S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/21/2018 - 20:56

ప్రతీ ఉదయం నిత్యనూతనమే. కొత్తవిషయాలకు వేదిక. కొత్త విషయాలు నేర్చుకోవడంలో మనల్ని మనం సుసంపన్నం చేసుకోవాలి.
ఏ మనిషైనా ఒక రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలంటే కనీసం పదివేల గంటలైనా కృషి చెయ్యాలన్నది ఓ శాస్ర్తియ అంచనా. అంటే మనలో అందరికీ గొప్పవాళ్లయ్యే అవకాశం ఉంది. మనకి ఇష్టమైన రంగంలో ప్రతిరోజూ వీలైనంత సేపు కృషి చేస్తే మనకీ చరిత్రలో సమున్నత స్థానం లభించే అవకాశం ఉంది.

02/20/2018 - 21:25

స్ర్తిలకు స్వేచ్ఛను ఇవ్వలేదని చాలామంది ఆరోపణలు చేస్తూ వుంటారు. విద్యార్థుల పాఠశాల చదువుల్లో, ఐఎఎస్ అభ్యర్థులకు, ఇతర ఉద్యోగార్థులకు నిర్వహించే పరీక్షల్లో ఉండే చరిత్రలో కూడా ఇదే వాదన కన్పిస్తుంది. ఇక తమను తాము సంఘ సంస్కర్తలమనీ, అభ్యుదయవాదులమనీ చెప్పుకొనే కొందరు కుహనా మేధావులు ఈ విషయంలో వైదిక సంస్కృతిపై దుమ్మెత్తి పోస్తుంటారు. అసలు వేదాలు స్ర్తిల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాము.

02/20/2018 - 21:20

నిన్నటి గురించి దిగులు వద్దు. సమయం వృథా అవుతుంది.
రేపటి గురించి ఆందోళన వద్దు. అది ఇంకా మీదాకా రాలేదు
ఈరోజు గురించి ఆలోచించండి.
ఆలోచించింది కార్యరూపంలో పెట్టండి.
అది సత్ఫలితాలను ఇస్తుంది.
అదే రేపటికి మంచివనరుగా తయారు అవుతుంది.
నిన్నటి దిగులును దూరం చేస్తుంది.
కనుక ఈరోజు గురించి మాత్రమే వివేకంతో ఆలోచించండి

02/20/2018 - 21:17

అక్షరాలకు మంగళస్నానం చేయంచి
పదాలకు పట్టుపరికిణీలు తొడిగి
భావాలకు కస్తూరి తిలకాలు దిద్ధి
భావుకత్వ సామ్రాజ్యంలో
హంసతూలికా తల్పాలపై
అరమోడ్పు కన్నులతో ఒకప్పుడు
అలవోకగా శయనించిన
అనంత సౌందర్యరాశి మన తెలుగు
అలనాటి రాజెరాజు కంటికొసల
పసిడి పూల కలలమాల మన తెలుగు
పువ్వులలో పసిపాపల నవ్వులలో
అమ్మ ప్రేమ నయనమ్ముల మేల్ దివ్వెలలో

02/20/2018 - 21:13

అమ్మ.. ఈ రెండు అక్షరాలు ప్రేమ, ఆప్యాయత, అనురాగానికి ప్రతీక. అమ్మ ప్రేమ స్వచ్ఛం. కలుషితరహితం. కాని నేటి పరిస్థితులు అమ్మతనాన్ని ప్రశ్నిస్తున్నాయ. అమ్మతనానికి మచ్చ తెచ్చే సంఘటనలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయ. దీనికి కారణమేదైనా సరే అమ్మ తన పిల్లలనే కాదు లోకంలోని అందరి పిల్లలను తన పిల్లలుగా చూసే నేర్పును కలిగి ఉంటుంది.

02/19/2018 - 21:32

మన మెదడు ప్రొజీక్టర్ లాంటిదైతే మన భావాలు ఫిల్మ్‌రీలు లాంటివి. మన భావాలు అనే ఫిల్మ్ రోల్ ఎలా ఉందో అలా మన మెదడు అనే ప్రొజెక్టర్ జీవితం అనే సినిమాను అలాగే బాహ్యంలో ప్రదర్శిస్తూ ఉంటుంది. అన్నింటికీ మూలం భావాలు. మనభావం సరిగా ఉంటే మన మెదడు సరిగా ఉన్నట్టే ఎట్లాగంటే ఫిల్మ్ రీలును సరిచేస్తే తెరమీద సినిమా సరి అయినట్టు
శ్రీ మాస్టర్ తారావిశాల్

02/19/2018 - 21:23

‘ప్రియమైన శర్వాణి, ఉభయకుశలోపరి.
మీ అత్తగారు ఆరోగ్యం ఎలా ఉంది. మీ అమ్మగారు బాగున్నారా... నాలుగు లైన్లు క్షేమసమాచారాలే ... ఎంతో అప్యాయంగా పేరుపేరునా అడిగింది.

02/18/2018 - 21:12

సంపదను అందరూ కోరుకుంటారు. డబ్బులను ఎవరూ కాదనరు. సంపదను సంపాదించే మార్గాలకోసమే నిరంతరమూ అనే్వషిస్తుంటారు చాలామంది. అట్లాంటి వారికి ఓ ఉపాయం..

02/18/2018 - 21:09

12 ఏళ్ల వయస్సులోనే తన చేతికున్న గాజులను ధారాళంగా విరాళంగా ఇచ్చిన చిన్నారి దుర్గాబాయ్ దేశ్‌ముఖ్. తన పదయేటనే హిందీపై పట్టు సాధించి హిందీ పాఠశాలను నెలకొల్పి వయోభేదం పాటించకుండా అందరికీ హిందీని నేర్పించిన ధీశాలి దుర్గాబాయి. కృష్ణవేణమ్మ, రామారావులకు ముద్దుబిడ్డయై 1909 జూలై 15న కళ్లు తెరిచిన ఈ చిన్నారి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వనితామణిగా ప్రసిద్ధికెక్కింది.

02/18/2018 - 20:58

మనం చెప్పుకున్న
ఊసులు
మనం కట్టుకొన్న
అందాల మేడలు
మనల్ని వెన్నంటి
వుండాలని

పాత జ్ఞాపకాలే
మరొక్కసారి
మరీ మరీ కొంగొత్త రుచులను
వెలబోయాలని

Pages