S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/09/2018 - 21:18

యత్ర నార్యస్తు పూజ్యంతే
రమాంతే తత్ర దేవతాః
పెళ్ళైన కొత్తలో-
ఆమె ఒక అపరంజి బార్బరీ బొమ్మ
ఆపై ఒక అందాల రాక్షసి
నిజానికి ఆమెయే ఒక అమూల్య రత్నం
వజ్ర వైఢూర్యాలు పొదిగిన సింహాసనం
ఆమె చిరు దరహాసమే
నాకు మధురాతి మధురమైంది
ఇల్లంతా ఆమె చూపులతో వెనె్నల కాసింది
జిలుగు వెలుగులు నింపింది
ఆమె లేకుంటే నేను లేను

03/09/2018 - 21:16

చిగురాకుల చిరుమొలక స్పర్శానువులు,
గర్భకుహర అంతరాలను కదిలించిన కదలికలు
అమ్మనడకలో తడబాటును సృష్టిస్తాయి!
అమ్మా! ఈ బిడ్డ మీద నీవాత్సల్యం అనంతమైనది సుమా!
***
గర్భదోషాలు లేకుండా, అంగవైకల్యాలు రాకుండా,
నాకు సద్బుద్ధి, ఆయుష్యాభివృద్ధి కలగాలని,
సీమంతం జఠిపించుకుని, మురిసిపోతున్న
నీ మనోగత ఆశలదీపం నేనే ననుకుంటే--

03/08/2018 - 21:01

అంతరిక్షానికి ఎదిగినా మహిళా సాధికారతలో వెనుకబాటే కన్పిస్తోంది. వివక్ష, చిన్నచూపు మహిళా వికాసానికి అడ్డంకిగా మారుతున్నాయి. అయినా ప్రతిబంధకాలు, కట్టుబాట్లను ఎదుర్కొంటూ నేటి మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. బాల్య వివాహాలు, జోగినీ దురాచారాలు, నిరక్షరాస్యత, భ్రూణ హత్యల్లాంటి సాంఘిక దురాచారాలు వెంటాడుతున్న మహిళలు అలాంటి సమస్యలు ఎదుర్కొంటూ విజయబాటలో పయనిస్తున్నారు.

03/08/2018 - 20:46

కృష్ణుడ్ని కన్న దేవకమ్మవో....
క్రీస్తునిచ్చిన మరియమ్మవో...
లాలించే తల్లివో.., పూజించే ‘అమ్మ’వో,

ఓలలాడించే ఆలివో..., శిలలాంటి మనిషిని చెక్కే ఉలివో,
అనురాగం పంచే సోదరివో..., అక్కున చేర్చుకునే ఆశ్రయానివో,
కవ్వించే మరదలివో..., కనికరించే కూతురివో,

03/07/2018 - 23:30

తల్లివై, చెల్లివై, భార్యవై, బిడ్డవై
ఎనె్నన్నో రూపాలతో అలరించే
ఓ మహిళా శిరోమణీ! నారీమణీ!
నీకు అడుగడుగునా స్వాగతం
నీవు చేయు త్యాగాలకు ఈ పుడమి తల్లి
అర్పించేను ఆనందపు బాష్పాంజలి.

03/07/2018 - 23:27

అమెరికన్ సోషలిస్టు పార్టీ ఫిబ్రవరి 28న జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. 1910లో కేపెన్ హోగెన్ సోషలిస్టు మీటింగ్‌కు 17 దేశాల నుంచి 100 పైగా మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. దీని స్ఫూర్తితో మరుసటేడాది ఆస్ట్రేలియా, జర్మనీ, స్విట్జర్లాండ్‌లో మార్చి 19న మహిళా దినోత్సవాన్ని జరిపారు. 1913-14 సంవత్సరాల్లో యుద్ధానికి వ్యతిరేకంగా శాంతి నినాదాలతో రష్యా దేశంలోని ఆడవాళ్లంతా ర్యాలీలు చేశారు.

03/07/2018 - 23:24

బొడ్డుకోయక ముందే జన్మకారకుడైన,
జనకునితో తేనె నెయ్యి పసిడితో నాకించి,
పల్చనైన నా గుండెకు వెచ్చని ఊపిరి పోశావే!?
గర్భగత నీటి దోషాలు, పూర్వజన్మ పాపవాసనలు
నాకంట కూడదని నా క్షేమాన్ని ఆకాంక్షించావే!?
అమ్మా! బిడ్డ మీద మమకార సాకార శక్తివి..
మాతృమూర్తీ! శిశోదయుడైన నాకు
యేదుష్టశక్తి ఆవహించకూడదని,
చెడు చూపుల దోషం అంటకూడదని,

03/06/2018 - 21:35

ఓ మహిళా మేలుకో ఈ జగతి ఏలుకో
ఆడదంటే ఆది నుంచి ఆదిశక్తి
అమృతమూర్తి అన్న పూర్ణ
అందరికీ ‘అమ్మ’
అమ్మను ఆదరించు
కానీ చీదరించుకోకు
అమ్మను అనాథాశ్రమాల పాలు చేయొద్దు
అభాగ్య స్థితిలో నున్న
అమ్మను ఆదుకోండి
అమ్మను ఆదరించండం
అమ్మను గౌరవించండి
ఓ మహిళా మేలుకో
ఈ జగతి ఏలుకో
నవ మాసాలు మోసి
కనిపెంచిన అమ్మ అనురాగం

03/06/2018 - 21:30

ఆకాశం లోనే కాదు
అర్ధాకలిలో కూడా సగానివే
పుట్టినప్పటి నుంచి
పురిటి శాపాన్ని భరిస్తూ
నీడనిచ్చే చెట్టులా కాపాడుతూనే ఉన్నావు

తరతరాలు నిన్ను
బిడ్డలని కనే యంత్రంగా
మార్చినా కూడా
చిరునవ్వుతో
మగాడి చేతుల్లో
రేపటి తరపు భవిష్యత్తుని
భద్రంగా అప్పగిస్తావు.

03/06/2018 - 21:29

సూర్యుని చుట్టూ భూమిలా
మన చుట్టూనే తిరుగుతుంది!

ఆలనా పాలనా చూస్తూ..
రేయనకా పగలనకా..
నీడలా మనతో నడుస్తుంది!

పైపైన నవ్వులను
తన పెదాలకు పులుముకుంటూ
గలగల మువ్వల
సవ్వళ్ళను వీనుల విందు చేస్తుంది!

క్షణం తీరిక
క్షణం ఓపిక లేకున్నా
నిన్నంటిపెట్టుకుంటూ..
చల్లని వెనె్నల కురిపిస్తుంటుంది!

Pages