S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

04/28/2016 - 21:32

వాడికి కాలయవనుడని పేరు పెట్టాడు యవనేశ్వరుడు. వాడికి వ్వనం వచ్చింది. యవనేశ్వరుడు కాలగతి చెందగానే కాలయవనుడు మహారాజైనాడు. కాలయవనుడి జన్మ రహస్యమే యాదవ కుల భంజనం. యాదవ సంహార ప్రభంజనం. ఎప్పుడ్పెడు మధురపై దండెత్తుదామా? అని ఉద్ధతుడవుతూ వచ్చాడు. ఎవ్వరినీ లక్ష్యపెట్టక విర్రవీగుతున్నాడు. అపుడు నారదుడు పొద్దుపోకకు ఒక రోజున కాలయవనుడి వద్దకు వచ్చాడు.

04/28/2016 - 00:12

ఆ శాపవృత్తాంతం ఏమిటంటే భోజవృష్ణి కుకురాంధక యాదవ వంశాలన్నిటికీ గర్గ మహర్షి కులగురువు. చిరకాలం నుంచీ ఇది ప్రవర్తితమవుతున్నది. ఆయన మహాముని. ఇంద్రియజయుడు. అస్ఖలిత బ్రహ్మచారి. దివ్య తపస్సంపన్నుడు. ఒక రోజున సకల యాదవ సభలో ఆయన ఉండగా ఏ దేశం నుంచి వచ్చాడో, వాడెవడో, ఏ కారణంచేత యాదవులను గర్గ మహర్షి వల్ల శాపదగ్థులను చేయాలని కపటమతి అయినాడో కాని వాడు ఆ సభకు వచ్చాడు.

04/26/2016 - 22:18

అపుడు పిన్నలూ, పెద్దలూ కూడా కృష్ణుడు చెప్పిన విషయం బాగా ఆలోచించారు. అవగాహన చేసుకున్నారు. ‘జరాసంధుడు చూడబోతే అవధ్యుడు. ఆ మగధేశ్వరుడి సైన్యాన్నంతా నిశే్చషం చేయాలాంటే నూరు సంవత్సరాలైనా సరిపోవు. నిజమే మధురలో మనకు ఎటువంటి కొరతా లేదు. మహా సంపద ఉంది మనకిక్కడ. గుర్రాలు, ఏనుగులు, రథాలు, పల్లకులు, వెండి బంగారాలు సమృద్ధంగా ఉన్నాయి. అయినా ఎప్పుడూ ఒక ఆందోళన ఉండనే ఉంది. జరాసంధుడెప్పుడు వచ్చి పైనబడతాడో! అని.

04/24/2016 - 21:32

అక్కడికి యమున దగ్గరలో లేదు. అందువల్ల గోకులానికే తానున్న చోటికే కాళింది (యమున)ని రప్పించుకోవాలని తెప్పించుకోవాలని ఆ బలదేవుడికి కోరిక కలిగింది.

04/24/2016 - 00:57

నిజ మాయా ప్రభావం ఎవరూ తెలుసుకోలేనట్లుగా వారి వర్తనం ఉండేది. ఇట్లా మధురలో బలరామ వాసుదేవులు పొద్దులు పుచ్చుతుండగా బలదేవుడు తమ్ముడితో ఒక రోజున ఇట్లా అన్నాడు. ‘కృష్ణా! ఒకసారి వ్రేపల్లె వెళ్లి అక్కడి మన చిన్ననాటి రోజులను వేడుకగా గుర్తుచేసుకోవాలని ఉంది. మళ్లీ ఆ ప్రదేశాలలో ఒకసారి విహరించాలని ఎంతో కుతూహలం కలుగుతుంది.

04/22/2016 - 20:53

ఈ గదాయుద్ధంలో ఒకరికొకరు ఎంత మాత్రం తీసిపోలేదు. ఒకరిని మింగేట్లు ఒకరు సింహనాదాలు చేశారు. ఒకరు ప్రదక్షిణ వలయంలో గద ఎత్తి శత్రువును మోదాలని గుండ్రంగా పరిభ్రమిస్తుండగా, వేరొకరు అప్రదక్షిణంగా మండలాకారంలో శత్రువును గదా ప్రహరంతో నొప్పించాలని పదఘట్టనం చేస్తూ గదా యుద్ధ మెళుకువులతో విక్రమ విహారం చేశారు. వాళ్ళ గదలు ఒకదానితో ఒకటి తాకినపుడు పిడుగు చ్పుడులు చేస్తూ భయంకర దృశ్యాన్ని సృష్టించాయి రణరంగంలో.

04/21/2016 - 21:49

క్రథుడు తనపై ఏడు అమ్ములు వేశాడో లేదో వెంటనే క్రథుణ్ణి విరధుణ్ణి చేసి, కేతనాన్ని, అశ్వాలను కూల్చటంతో క్రధుడు పలాయనం చిత్తగించాడు. ఉగ్రసేనుడు భీష్మకుణ్ణి ఇరవై అయిదు బాణాలతో హతాశుణ్ణి చేయగా అతడు పరాజయం పాలైనాడు. జరాసంధుడి సేనానాయకుడైన కౌశికుణ్ణి బభ్రుడు అర్థచంద్ర విశిఖం ప్రయోగించి హతమార్చాడు. ఆపైన దిక్కటాహాలు ప్రతిధ్వనించేట్లు బొబ్బలు పెట్టాడు.

04/20/2016 - 22:15

అప్పుడు చేసేదేమీ లేక చిత్రసేనుడు పరిఘాయుధంతో బలరాముడిపై వచ్చి పడ్డాడు. అతణ్ణి చంపివేయాలని హలాయుధుడు వరుస బాణాలు వేయటానికి సన్నద్ధుడవుతుండగా జరాసంధుడు తన సేనాధిపతిని రక్షించాలని బలరాముడి చేతి విల్లును కూల్చివేశాడు. దీనితో హలాయుధుడు కోపించి తన పెను గదతో ఉరికి జరాసంధుడి రధ హయాలను చావమోదాడు. జరాసంధుడిక చేసేదేమీ లేక తానూ ఒక పెద్ద గద తీసుకొని హలాయుధుడితో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు.

04/19/2016 - 21:22

నీ ముఖం చూస్తేనే పాపం చుట్టుకుంటుంది అని జరాసంధుడు ప్రేలాపన సాగిస్తూ ఉండటం చూసి కృష్ణుడు సహించలేకపోయినాడు.

04/17/2016 - 22:33

ఇక ఆకాశమంతా బాణాలతో నింపాలి. కోటపై నుంచి ఒక్కరు కూడా మనను చూడటానికి కూడా అశక్తులయ్యేట్లు కోటనంతా బయటనుంచి బాణాలతో కప్పివేయాలి’ అని యుద్ధవ్యూహం వివరించి చెప్పాడు జరాసంధుడు. మొట్టమొదట మనం పూనుకోవలసిన పని ఏమంటే నగరాన్ని ధ్వంసం చేయటం అని కూడా చెప్పాడు.

Pages