S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

11/04/2018 - 22:25

‘‘నీకు తెలీదురా! మనీ మేక్స్ మెనీ థింగ్స్.. ఆశ పెడదాం...’’
‘‘తప్పదు.. వీరబాహుకి ఇచ్చాంగా..’’
ఇంతలో ఇల్లు రావడంతో అనిరుధ్‌ని ఇంటి దగ్గర దింపి వెళ్లిపోయాడు కొండబాబు ‘సాయంత్రం కలుస్తారా’ అని చెప్పి. అనిరుధ్ లోపలికి రాగానే అతడి అమ్మమ్మ చెప్పింది: ‘‘మీ మామయ్య వచ్చాడురా..’’ అని.
‘‘ఎప్పుడు?’’’
‘‘నువ్వు రావడానికి ముందే వెళ్ళాడు.. ఓ గంట కూర్చుని వెళ్లాడు’’

11/02/2018 - 20:10

‘‘అటెండర్‌నండి..’
‘‘ఇప్పుడు ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి రేట్లు?’’ అనిరుధ్ అడిగాడు.
‘‘బాగా పెరిగాయండి..’’
‘‘ఎందుకని?..’’
‘‘ఎందుకంటే.. కారణం అంటూ ఉండదండి.. ఈళ్లు పెంచేత్తుంటారు.. అంతేనండి.. మీరేవన్నా కొందావనుకుంటున్నారా?’’
‘‘అవును.. అందుకే వచ్చాం..’’ అనిరుధ్ చెప్పాడు.
‘‘ఎవర్ని కలిస్తే సరైన వివరాలు చెబుతారు?..’’ కొండబాబు అడిగాడు.

11/01/2018 - 19:18

రాత్రి ఏడు గంటలు కావస్తూంటే నారాయణ లేచాడు సీటులోంచి. అతడి బ్రీఫ్‌కేసు తీసుకుని రాగిణి కూడా నడిచింది. ఇద్దరూ కారులో రాగిణి ఇంటికి వచ్చారు. అల్లుడుగారువచ్చినంత హడావుడి చేసింది రాగిణి తల్లి.
‘‘ఏమిటి అదోలా మూడీగా ఉన్నారు?’’ అనడిగింది మంచినీళ్లు తెచ్చి ఇస్తూ నారాయణను రాగిణి అడిగింది.

10/31/2018 - 19:12

తను రిక్షా తొక్కేటప్పుడు, సంసారం కోసమని, కూటికోసమనీ, ఇలా ఏదో కారణాలు చెప్పి పడుపు వృత్తికి లాడ్జిలకు వచ్చే యువతులు ఇపుడు నారాయణకి గుర్తుకొస్తున్నారు. లవ్వు పేరు చెప్పి తన కూతుళ్లు ఎప్పుడేనా అలా లాడ్జిలకు వెళుతున్నారా వాళ్ల లవర్స్‌తో.. అన్న ఆలోచన వచ్చినపుడు నారాయణ వళ్ళు గగుర్పొడుస్తుంది. అతడు అలాంటి గగుర్పాటులో వున్నపుడే రహీం నుంచి ఫోనొచ్చింది.

10/30/2018 - 19:21

అప్పటికే కొడుకు వేస్తున్న చిల్లర వేషాలు తండ్రి దృష్టికివచ్చాయి. మందలించాడు. ఒకటి రెండుసార్లు తన కళ్ళల్లో పడ్డప్పుడు బెత్తానికీ పనిచెప్పాడు అలా తొమ్మిదో తరగతివరకూ నారాయణ చదువు కుంటుకుంటూ సాగింది. టెన్త్‌కివచ్చేసరికి నారాయణ ఇక బడికి వెళ్లడమే మానేశాడు. తండ్రి తిట్టినా దులిపేసుకున్నాడు.

10/29/2018 - 22:05

నర్స్ ముందు కంగారు పడింది. తర్వాత ఎందుకు అనడిగింది.
‘‘వేరే ఒక టెస్టు చేయించాలి.. అందుకాయన ఒప్పుకోవడంలేదు.. ఆయన మంచికోసమే..’’ చెప్పాడు చాలా నమ్మకంగా. ఆమె అయిష్టంగా, ఆమెకు తనదగ్గరున్న బాటిల్ ఇచ్చాడు, అందులో బ్లడ్ నింపమని. ఆమె వెళ్లింది సిరెంజ్ తీసుకుని డాక్టర్‌గారి రూములోకి. ఆమె వెనుకే వీరబాహూ వచ్చాడు.

10/29/2018 - 22:20

‘‘అవున్రా.. వాడు లక్ష తీసుకున్నాడన్నమాటేగానీ, పాపం అనుభవించలేదు..’’ అనిరుధ్ అన్నాడు వీరబాహు మృతికి సానుభూతిగా.
‘‘సరే!.. వాట్ నెక్స్‌ట్?’’ కొండబాబు అడిగాడు.
‘‘కథ మళ్లీ మొదలుపెట్టాలి..’’
‘‘ఇక్కడే ఉన్న నారాయణ?!’’
‘‘ఊ.. వీడినుంచి పని ఎలా చెయ్యాలి?’’
‘‘చూద్దాం.. మనసుండాలేగానీ ఏదో దారి దొరక్కపోతుందా?’’ ఆశావహంగా అన్నాడు కొండబాబు.

10/26/2018 - 18:57

‘‘సరే! వెళ్లు.. జాగ్రత్త..’’ అని సోఫాలోంచి లేచాడు రహీంపాషా. వెనక్కి తిరిగి రహీం వెళ్లబోతూ తూలి పడబోయాడు. చప్పున వీరబాహు వచ్చి పట్టుకున్నాడు. ఎందుకు అలా తూలి పడబోయాడో అతడికి అర్థం కాలేదు. కాళ్లకేదో తగిలినట్లయ్యింది. కాళ్ల వంక చూసుకున్నాడు. ఏమీలేదక్కడ.

10/25/2018 - 18:56

తర్వాత నెమ్మదిగా లేచి వీధి గుమ్మం తలుపు బయట తాళం వేసి కొండబాబు దగ్గరికి బయల్దేరాడు అమ్మమ్మ చెప్పిన విషయాలు కొండబాబుతో చెప్పాలని. వస్తున్నానని ఫోనూ చేశాడు. మర్నాడు ఉదయం చెప్పవచ్చు. కానీ ఇంట్లో చేసే పనేముందని అప్పుడే బయల్దేరాడు. ఫర్లాంగులోపు దూరంలోనే కొండబాబు ఇల్లు.

10/24/2018 - 19:12

అతడి తల్లిదండ్రుల స్టేటస్ కూడా చూస్తున్నారు.. ఇవన్నీ వాళ్లూ వీళ్లూ చెబుతుంటే ఆమెకు అర్థమయ్యాయి. అర్థమయ్యాక తాను బ్రతికుండగా తన మనవడికి పెళ్లి చెయ్యగలనా అన్న అనుమానం ఈమధ్య ఆమెలో సుడులు తిరుగుతున్నాయి.
పిచ్చిదే అయినా తన కూతురు బాగుండేది. దాని కడుపున పుట్టిన తన మనవడూ బాగుంటాడు.. కానీ అదొక్కటే పెళ్లికి సరిపోదు.

Pages