S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

10/23/2018 - 19:22

దాంతో అనిరుధ్ సలహా మేరకు ఆ రైస్ షాప్ తనే నడుపుతూ తండ్రిని విశ్రాంతి తీసుకోమన్నాడు.
కొండబాబు బికాం డిగ్రీ వరకూ చదువుకున్నాడు. ఇద్దరూ ఇంటర్ వరకూ క్లాస్‌మేట్స్.

10/22/2018 - 22:17

డాక్టర్ హేమంత్ నలభయ్యేళ్లలోపువాడే. హుందాగా ఉన్నాడు. కడిగిన ముత్యంలా శుభ్రంగా ఉన్నాడు. ఘుమఘుమలాడుతున్నాడు.
‘‘మీలో పేషెంట్?.. ’’ ఫైలు ఏదీ లేకపోవడంతో అడిగాడు డాక్టర్ హేమంత్.
‘‘ట్రీట్‌మెంట్ కోసం కాదు సార్..’’ అంటూ అనిరుధ్ తనకి తాను పరిచయం చేసుకున్నాడు. కొండబాబుని పరిచయం చేశాడు.
‘‘సో.. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ..’’ అడిగాడు డాక్టర్ హేమంత్.

10/21/2018 - 23:34

వాడు ఏదైనా హాస్పిటల్‌లో చేరి నాలుగు రోజులుంటే తప్ప తన పనికాదని అనుకున్నాడు వీరబాహు. అదెలా సాధ్యం?
మందు తాగుతున్నాడు... ఏదో తింటున్నాడు. తన బాస్ వీరబాహు ధోరణి అర్థం కావడం లేదు బోడన్నకి. మందుతాగడం, తినడం చూస్తుంటే అతడికేం అర్థం కాలేదు.
‘‘ఏటిగురూ...అలా ఉన్నావ్?’’అనడిగాడు బోడన్న మరోసారి.
‘‘ఏం లేదురా... ఏదో చిన్న సమస్య... పర్సనల్‌లే...’’ చెప్పాడు వీరబాహు.

10/19/2018 - 21:42

‘‘ఓ నెలరోజులు సెలవుపెట్టి వచ్చాట్ట... ఇక్కడేదో పనుందట... నానమ్మ చెప్పింది.’’
‘‘అన్నాళ్లుంటాడా?!... రోజూ వెళ్లి అనిరుధ్‌తో కాస్సేపు కబుర్లు చెప్తూండు... బావ ఎక్కడికేనా రమ్మంటే రాననకు... వెళ్లు...’’
‘‘అలాగే... మరి జాబో...’’

10/17/2018 - 21:22

తల్లి గయ్యాళి, తండ్రి ఓ మూర్ఖుడు. వాళ్లిద్దరిదీ అన్యోన్య దాంపత్యం ఎంత మాత్రం కాదు. చిన్నతనంలో అవన్నీ అతడిని చాలా బాధించాయి. తన చదువు ఆగిపోయింది. వాళ్లు ఆపేశారో, తను మానేశాడో వాడికిప్పుడు సరిగా గుర్తులేదు. అల్లరి చిల్లరి జీవితం ఇపుడు ఒక రౌడీగా ముద్రవేసి నిలబెట్టింది. ఇపుడు వాడికే లోటు లేదు. ఏదైనా అనుభవించగలడు. ఏదైనా చేజిక్కించుకోగలడు. సినిమాల్లో చూపించినట్లు చుట్టు ఎప్పుడూ పదిమంది జనం.

10/21/2018 - 23:27

‘‘నేనింటికెళ్లి తింటా నానమ్మా..’’ అన్నది సాయిరమ్య.
‘‘్ఫర్వాలేదు... చాన్నళ్లయ్యింది నానమ్మ వంట తిని...’’అంటూ ముగ్గురికీ కంచాల్లోపెట్టి తెచ్చి ఇచ్చింది అమ్మమ్మ. అలాంటప్పుడు అనిరుధ్ ఆమెకు సాయం చేద్దామన్నా ఒప్పుకోదు. కూర్చోరా పిచ్చి సన్నాసీ... అంటుంది.
‘‘ఏదైనా కానీరా.. అమ్మమ్మ కందిపచ్చడి సూపర్బ్‌రా.. పేటెంట్ రైట్ అమ్మమ్మదే..’’ ముద్ద నోట్లో పెట్టుకుని తిన్నాక అన్నాడు కొండబాబు.

10/14/2018 - 23:35

‘‘నాకు ఒకటిరెండుసార్లు అనిపించింది జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడీ ప్రయత్నమంతా ఎందుకులే... అని. కానీ మనస్సు ఉండబట్టడం లేదురా... నా జన్మకు బీజం వేసిన వాడెవడో తెలుసుకోవాలనుంది... ఆ సంగతి హిమజకు చెప్పాను... ఆమెదగ్గర ఏమీదాచలేదు. ఆమె ధైర్యం చెప్పి పంపిందిరా...’’
‘ఓకేరా... ఆల్ ది బెస్ట్...’ భుజం తడుచూ కొండబాబు అన్నాడు.

10/12/2018 - 18:56

‘‘ఇదంతా నీకు సిల్లీగా అనిపిస్తోంది కదరా?!...’’ క్షణంపోయాక కొండబాబుని అడిగాడు అనిరుధ్.
‘‘లేదురా! సిల్లీగా అనిపించడం లేదు. నీ బాధేంటో నాకర్థమవుతోంది. పాపం ఆ కుర్రాడు ఎంత బాధపడుతున్నాడో అని మా అమ్మ నీ గురించి అంటే ఏమిటో అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది నీ బాధేంటో...’’ కొండబాబు అతడినే తదేకంగా చూస్తూ అన్నాడు.

10/11/2018 - 19:30

అయితే ఆ వార్త రహీంపాషాయే కావాలని చెప్పి రాయించుకున్నాడని మునిస్వామినాయుడు ఊహించాడు. అతడి వందిమాగదులు కూడా అయ్యుండవచ్చునన్నారు.
తీరా నామినేషన్ టైమొచ్చేసరికి అక్కడ మునిస్వామినాయుడు బంధువు నామినేషన్ వేశాడు. దాంతో రహీంపాషా మనస్సు చివుక్కుమంది. అయితే ఎవరిదగ్గరా అతడు ఆ విషయం ప్రస్తావించలేదు.

10/10/2018 - 18:52

సినిమాల్లో లాగా గొప్పగొప్ప ఎస్.ఐ.లు, ఎస్పీలు శివమణి లాంటి పోలీసు ఆఫీసర్లు నిజజీవితంలో ఉండరుగాక ఉండరని పాపం వాళ్లకి తెలీదు. కలం యోధుల జేబులూ నిండాయి. వాళ్ల యజమానులకుండే లావాదేవీలు, ఇబ్బందులూ రహీంపాషాకే అనుకూలంగా పరిస్థితులు మార్చేశాయి.

Pages