S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

12/30/2017 - 19:37

అయ్యా పంచేంద్రియములు
నయ్యాలల సూచినట్లు లూచగ నేనున్
నీ యాజ్ఞ దలపనేరను
కుయ్యాలింపుము మహాత్మ గుఱుతుగ కృష్ణా!

12/28/2017 - 18:41

తిరుమణి దురిత విదూరము
తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్
తిరమణి పెట్టిన మనుజుడు
పరమ పవిత్రుడు భాగ్యవంతుడు కృష్ణా!

12/27/2017 - 18:34

నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నందకుమార
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణా!

12/26/2017 - 18:37

దండమయా విశ్వంభరా
దండమయా పుండరీకదళ నేత్రహారీ
దండమయా కరుణానిధి
దండమయా నీకు నెపుడు దండము కృష్ణా!

భావం: హే పరంధామా శ్రీకృష్ణా! వరహావతారంలో సముద్రగర్భంనుండి భూమిని పైకెత్తి రక్షించినవాడా! తామర రేకుల్లాంటి నేత్రములు గలవాడా! పాపములను శమింపచేయు ఓకృష్ణా! నీకు సదా నమస్కారములు. కృష్ణునికి ఒక్క దండం పెడితే నమస్కారంచేస్తే చాలు ఎట్టి ఆపదలోనున్నా రక్షించబడుతాము.

12/24/2017 - 23:25

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
యమునికి నికనే వెఱవను
కమలాక్ష జగన్నివాస కామిత ఫలదా
విమలమగు నీదు నామము
నమరగ దలఁచెదను వేగ ననిశము కృష్ణా!

12/23/2017 - 18:40

కంటికి రెప్పవిధంబున
బంటు గదా యనుచు నన్ను బాయక యెపుడున్
జంటయు నీ వుండుట నే
కంటకమగు పాపములను గడచితి కృష్ణా!

12/22/2017 - 18:56

కొంచెపు వాడని మదిలో
నెంచకుమీ వాసుదేవ గోవింద హరీ
యంచితముగా నీకరుణకు
గొంచెము నధికంబు గలదె కొంతయు కృష్ణా!

12/21/2017 - 19:23

రఘనాయక నీ నామము
లఘమతితో దలచగలనె లక్ష్మిరమణా
యఘములు బాపుదు దయతో
రఘురాముడవైన లోక రక్షక కృష్ణా!

12/20/2017 - 19:50

పాలను, వెన్నయు మ్రుచ్చిల
రోలను మీ తల్లి గట్ట రోషము తోడన్
లీలావినోది వైతివి
బాలుడవా బ్రహ్మ గన్న ప్రభుడవు కృష్ణా!

12/19/2017 - 18:54

గంగ మొదలైన నదులను
మంగళమున జేయునట్టి మజ్జనములకున్
సంగతి గలిగిన ఫలములు
రంగుగ మిము దలచు సాటి రావుర కృష్ణా!

భావం: ఓ కృష్ణా! పవిత్రమైన గంగ , యుమున, సరస్వతి, బ్రహ్మపుత్ర, కృష్ణా, గోదావరి నదులందు మునిగిన కలుగు పుణ్యఫలములు నీ నామస్మరణము వలన వచ్చే పుణ్యఫలములతో అలరారుతాయి.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము

Pages