S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

11/22/2017 - 19:28

క్రతువులు తీర్థాటనములు
వ్రతములు దానములు సేయవలెనా? లక్ష్మీ
పతి మిము దలచిన వారికి
అతులిత పుణ్యములు గలుగు టరుదా కృష్ణా!

11/21/2017 - 18:45

హరి! నీవె దిక్కు నాకును
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్
పరమేష్ఠి సురలు బొగడగ
కరి గాచిన రీతి నన్ను గావుము కృష్ణా!

11/19/2017 - 22:23

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
*
పంచేంద్రియ మార్గంబుల
కొంచెపు బుద్ధిని చరించి కొన్ని దినంబుల్
ఇంచుక సజ్జన సంగతి
నెంచగ మిమ్మెఱిగినాడ నిప్పుడె కృష్ణా!

11/18/2017 - 17:53

పురుషోత్తమ ! లక్ష్మీపతి!
సరసిజగర్బాది వౌని సన్నుత చరితా!
మురభంజన! సురరంజన!
వరదుడవగు నాకు భక్తవత్సల !కృష్ణా!

11/17/2017 - 19:21

దిక్కెవ్వరు ప్రహ్లాదుకు
దిక్కెవ్వరు పాండుసుతుల దీనుల కెపుడున్
దిక్కెవ్వ రయ్య హల్యకు
దిక్కెవ్వరు? నీవు నాకు దిక్కుకు కృష్ణా!

11/16/2017 - 18:21

కుంభీంధ్ర వరద! కేశవ!
జంభాసురవైరి! దివిజ సన్నుత చరితా!
అంభోజ నేత్ర జలనిధి
గంభీర! నన్ను గావు కరుణను కృష్ణా!

భావం: కృష్ణా ! గజేంద్రుడు మున్నగు ఆర్తులను రక్షించిన వాడా, లోకకంటకుడగు జంభాసురుని వధించినవాడా, దేవతల చేత నుతింప దగిన చరిత్రము గలవాడా పద్మముల వంటి నేత్రములు కలవాడా! గంభీరమైన హృదయము గలవాడా నన్ను దయతో రక్షింపుము.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము

11/15/2017 - 17:49

నరపశువు మూఢ చిత్తుడ
దురతారంభుడను మిగుల దోషగుడను నీ
గురుతెఱుగ నెంతవాడను
హరి నీవే ప్రాపు దాపు నౌదువు కృష్ణా!

భావం: కృష్ణా నేనొక నరపశువును. మనుష్యుడనై జన్మించియు పశువు వలె ప్రవర్తింపచేసేవాడను. మూర్ఖుడను. దుష్కార్యాలు చేసినవాడను పెక్కు దోషాలను చేసినవాడను. కృష్ణా! నీ లక్షణమును నీ మేరను ఎరుగుటకు నేనెంటివాడను.అల్పుడను. నీ వేనాకు ఆశ్రయము నీవే నాకు సన్నిహితుడవు కావాలి.

11/15/2017 - 03:51

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
*
అపరాధ సహస్రంబుల
పరిమితములైన యఘము అనిశము నేనున్
గపటాత్ముడవై చేసితిఁ
జపలుని ననుగావు శేషశాయివి కృష్ణా!

11/12/2017 - 21:13

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
*
వనజాక్ష భక్త వత్సల
ఘనులగు త్రైమూర్తులందు కరుణానిధివై
మను నీ సద్గుణ జాలము
సనకాది మునీంద్రు లెన్నజాలరు కృష్ణా!

11/11/2017 - 19:20

వలపుల తేజీ నెక్కియు
నిలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్
కలియుగము తుదిని వేడుక
కలికివిగా నున్న లోకవర్తవుకృష్ణా!

Pages