S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

12/17/2017 - 23:10

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
ఆ దండకా వనంబున
కోదండము దాల్చినట్టి కోమల మూర్తి
నాదండ గావ రమీ
వేదండము కాచినట్టి వేలువ కృష్ణా!

12/16/2017 - 18:42

గ్రహభయ దోషము లొందవు
బహు పీడలు చేర వెఱచు పాయును నఘముల్
ఇహపర ఫలదాయక విను
తహతహ లెక్కడివి నన్ను దలచిన కృష్ణా!

12/13/2017 - 19:26

ఏ విభుడు ఘోర రణమున
రావణ వధియించి లంక రాజుగ నిలిపెన్
దీవించి యూ విభీషణు
నా విభు నే దలఁతు మదిని నచ్యుత కృష్ణా!

12/12/2017 - 18:18

ఓ పుండరీక లోచన
యో పురుషోత్తమ ముకుంద యో గోవిందా
యో పురసంహార మిత్రుడ
యో పుణ్యుఁడ నన్ను బ్రోవుమో హరి కృష్ణా!

12/10/2017 - 20:25

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
*
ఏ తండ్రి కనక కశ్యపు
ఘాతకుడై యతని సుతుని కరుణనుగాచెన్
బ్రీం సురకోటి బోగడగ
నా తండ్రీ నిన్ను నేను నమ్మితి కృష్ణా!

12/10/2017 - 02:55

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
*

ఓ భవబంధ విమోచన
ఓ భరతాగ్రజ మురారి యో రఘురామా
ఓ భక్త కామధేనువ
ఓ భయహర నన్నుగావు మో హరి కృష్ణా!

12/08/2017 - 18:29

తురగాధ్వరంబు జేసిన
పురుషులకును వెఱె పదవి పుట్టుట యోమో
హరి మిము దలిచిన వారికి
నరుదా కైవల్య పదవి యచ్యుత కృష్ణా!

12/07/2017 - 18:34

తటతట లేటికి చేసెదు?
కట కట పరమాత్మ ! నీవు ఘంటాకర్ణున్
ఎటువలె నిపుణుని జేసితి
వటు వలె రక్షింపుమయ్య ! అచ్యుత ! కృష్ణా!

12/06/2017 - 18:20

భద్రార్చిత శుభచరణ సు
భద్రాగ్రజ! సర్వలోక పాలన!హరి! శ్రీ
భద్రాధిప ! కేశవ! బల
భద్రానుజ!నన్ను బ్రోవు భవహర ! కృష్ణా!

12/05/2017 - 18:34

ఎటువలె కరిమొఱ వింటివి
ఎటు వలె ప్రహ్లాదు కభయమిచ్చితి కరుణన్
అటువలె నను రక్షింపుము
కటకట నిను నమ్మినాడఁగావుము కృష్ణా!

Pages