S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

01/11/2018 - 19:29

సీ. పసరంబు బందైనఁ బసుల కాపరితప్పు
ప్రజలు దుర్జనులైన ప్రభునితప్పు
భార్య గయ్యాళైనఁ బ్రాణనాథుని తప్పు
తనయుఁడు దుష్టైన ఁ దండ్రి తప్పు
సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు
కూతురు చెడుగైన మాతతప్పు
అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు
ఇభమది చెడ మావటీని తప్పు
తే, ఇట్టితప్పు లెఱుంగక యిచ్చ వచ్చి
నటుల మెలగుపు రిప్పుడీ యవని జనులు

01/10/2018 - 18:56

సీ. అర్థినాండ్రకు నీక హానిచేయుట కంటె
తెంపుతో వసనాభిఁ దినుటమేలు
ఆడుబిడ్డల సొమ్ము నపహరించుట కంటె
బండఁగట్టుక నూతఁ బడుట మేలు
పరుల కాంతలబట్టి బల్మిఁ గూడుట కంటె
బడబాగ్ని కీలలఁ బడుటమేలు
బ్రతుకఁ జాలక దొంగ పనులు చేయుట కంటె
కొంగుతో ముష్టెత్తుకొనుట మేలు
తే. జలజదల నేత్ర! నీ భక్తజనుల తోడ
జగడమాడుటకంటెను చావు మేలు

01/09/2018 - 18:53

సీ. గౌతమీ స్నానానఁ గడతేరుదా మంటె
మొనసి చన్నీళ్లలో మునుఁగలేను
తీర్థయాత్రలచేఁ గృతార్థుఁడౌదామంటే
బడలి నే మంబు నే నడవలేను
దాన ధర్మముల సద్గతిని జెందుదమంటె
ఘనముగా నావద్ద ధనము లేదు.
తపమాచరించి సార్థకత నొందుద మంటె
నిమిషమైన మనసు నిలువ లేదు
తే. కష్టముల కోర్వనా చేతఁగాడు నిన్ను
స్మరణ చేసెద నాయథా శక్తి కొలది

01/07/2018 - 21:02

శ్రీ నరసింహ శతకములోని పద్యము

సీ. శ్రవణరంధ్రముల నీ సత్క్థల్ సోకంగ
లేశమానందంబు లేనివాఁడు
పుణ్యవంతులు నిన్నుఁ బూజసేయఁగ జూచి
భావమందు త్సాహ పడనివాఁడు
భక్తవర్యులు నీప్రభావముల్ పొగడంగఁ
దత్పరత్వములేక తలఁగువాఁడు
తన చిత్తమందు నీధ్యానమెన్నడు లేక
కాలమంతయు వృథా గడుపువాఁడు

01/06/2018 - 18:51

సీ. చిత్తశుద్ధిగ నీకు - సేవ చేసెదఁగాని
పుడమిలో జనుల మెప్పులకు గాదు
జన్మ పావనతకై స్మరణఁ జేసెదఁగాని
సరివారిలోఁబ్రతిష్టలకుఁ గాదు
ముక్తికోసము నేనుమ్రొక్కి వేడెదఁగాని
దండి భాగ్యము నిమిత్తంబు గాదు
నిన్ను బొగడు విద్య నేర్చితినే కాని
కుక్షినింపెడి కూటి కొఱకుఁగాదు

01/05/2018 - 20:14

సీ. మందుఁడ నని నన్ను నిందఁ జేసిన నేమి?
నా దీనతను జూచి నవ్వలేమి
దూర భావము లేక తూలనాడిన నేమి
ప్రీతి సేయక వంకఁ బెట్టనేమి?
కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి?
తీవ్రకోపము చేతఁ దిట్టనేమి?
హెచ్చుమాటల చేత నెమ్మెలాడిన నేమి?
చేరి దాపడ గేలి సేయనేమి?

01/04/2018 - 19:20

సీ. ఆది నారాయణా! యనుచు నాలుక తోడ
పలుక నేర్చినవారి పాదములకు
సాష్టాంగముగ నమస్కారమర్పణ జేసి
ప్రస్తుతించెదనయ్య బహువిధముల
ధరణిలో నరులెంత దండి వారైనను
నిన్నుఁ గానని వారినే స్మరింప
మేము శ్రేష్టులమంచు మిడుకు చుండెడివారి
చెంతఁజేరగఁ బోను శేషశయన

01/03/2018 - 20:32

సీ. ఆది నారాయణా! యనుచు నాలుక తోడ
పలుక నేర్చినవారి పాదములకు
సాష్టాంగముగ నమస్కారమర్పణ జేసి
ప్రస్తుతించెదనయ్య బహువిధముల
ధరణిలో నరులెంత దండి వారైనను
నిన్నుఁ గానని వారినే స్మరింప
మేము శ్రేషుటలమంచు మిడుకు చుండెడివారి
చెంతఁజేరగఁ బోను శేషశయన

01/02/2018 - 19:22

సీ॥ నరసింహ! నీ దివ్యనామ మంత్రము చేత
దురిత జాలము లెల్లఁ ద్రోలవచ్చు
నరసింహ! నీ దివ్యమంత్రము చేత
బలుపైన రోగముల్ పాపవచ్చు
నరసింహ! నీ దివ్య నామ మంత్రముచేత
రిపు సంఘముల సంహరింపవచ్చు
నరసింహ! నీ దివ్యనామమంత్రము చేత
దండహస్తుని బంట్ల -దఱుమవచ్చు

12/31/2017 - 20:35

శ్రీ నరసింహ శతకములోని పద్యము
*
సీ. పద్మలోచన సీసపద్యముల్ నీమీదఁ
జెప్పఁబూని తివయ్య చిత్తగింపు
గణయతి ప్రాసలక్షణముఁ జూడను లేదు
పంచకావ్యశ్లోక పఠనలేదు
అమరకాండ త్రయం బరసి చూడగలేదు
శాస్ర్తియ గ్రంథముల్ చదువలేదు
నీ కటాక్షంబున నే రచించితిఁగాని
ప్రజ్ఞనాయదిగాదు ప్రస్తుతింప
*
తే. తప్పుపడనేమి సద్భక్తి తక్కువౌనె

Pages