S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

12/03/2017 - 21:14

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
*
పరుసము సోకిన యినుమును
వరుసగ బంగారమైన పడువున జిహ్వన్
హరి ! నీ నామము సోకిన
సురవందిత! నేను నటుల సులభుడ కృష్ణా!

12/02/2017 - 18:45

బలమెవ్వడు కరిఁబ్రోవను
బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వడు సుగ్రీవుకు
బలమెవ్వడు నాకు నీవె బలవౌ కృష్ణా!

12/01/2017 - 18:26

సుత్రామ నుత! జనార్దన
సత్రాజిత్తనయ నాథ! సౌందర్య కళా
చిత్రావతార !దేవకి
పుత్రా! ననుఁగావు నీకు పుణ్యము కృష్ణా!

11/30/2017 - 23:47

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
దుర్వార చక్రధర కర!
శర్వాణీ భర్తృ వినుత ! జగదాధారా!
నిర్వాణనాథ! మాధవ!
సర్వాత్మక! నన్నుఁగావు సరగున కృష్ణా!

11/29/2017 - 19:39

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
దుర్మతిని మిగుల దుష్టవు
కర్మంబులు చేసినట్టి కష్టుడ నన్నున్
నిర్మలుని జేయవలె ని
ష్కర్ముడ నిను నమ్మినాడ కావుము కృష్ణా!

11/28/2017 - 18:35

గోపాల కృష్ణ! మురహర!
పాపాలను పారదోలు ప్రభుడవు నీవే
గోపాలమూర్తి! దయతో
నా పాలిట గలిగి ప్రోవు నమ్మితి కృష్ణా!

11/26/2017 - 21:09

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
గజరాజ వరద !కేశవ!
త్రిజగత్కల్యాణ మూర్తి! దేవ! మురారీ!
భుజగేంద్రశయన! మాధవ!
విజయాప్తుడ నన్ను గావు వేగమె కృష్ణా!

11/25/2017 - 18:50

మందుట నే దురితాత్ముడ
నిందల కొడిగట్టి నట్టి నీచుని నన్నున్
సందేహింపక కావుము
నందుని వరపుత్ర! నిన్ను నమ్మితి కృష్ణా!

11/24/2017 - 20:15

శతకోటి భాను తేజా!
యతులిత సద్గుణ గణాఢ్య! అంబుజనాభా!
రతినాథ జనక! లక్ష్మీ
సతిహిత! నను గావు భక్త సన్నుత కృష్ణా!

11/23/2017 - 17:57

దుష్టుండ ననాచారుడ
దుష్టచరిత్రుడను చాల దుర్బుద్ధిని నే
నిష్ఠ నిను గొల్వనేరని
కష్టుడ ననుగావు కావు కరుణను కృష్ణా!

భావం: కృష్ణా ! నేను దుష్టుడను, అనాచారుడను, దుష్టచరిత్రుడను, దుర్బుద్ధిని నిన్ను నిష్ఠలో పూజింపని పాపిని. నన్ను దయతో రక్షింపుము.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము

Pages