S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/07/2018 - 22:49

యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్తస్వప్నా బోధస్య యోగో భవతి దుఃఖహా

01/07/2018 - 22:47

పూవు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు కొంతమంది చిన్నతనం నుంచే చదువుతో పాటు సామాజికాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. రామకృష్ణపరమహంస, స్వామి వివేకానంద లాంటి వాళ్లు తమ జీవితాలను సమాజోద్ధరణకు అర్పించారు. స్వామి వివేకానంద లాంటి వాళ్లు మన దేశంలో పుడుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ల కోవలో నడిచేవారిలో జంగం శ్రీనివాసులు ఒకరు.

01/07/2018 - 21:21

ఎన్నాళ్లు గడిచినా, ఎన్ని జన్మలెత్తినా కూడా పాపరాశి అట్లానే ఉంటూ ఉంటుంది. ఎంత పుణ్యం చేసినా ఆ పుణ్యానికి ఫలితం ఇచ్చినట్లే విధి పాపానికి శిక్ష అనుభవించమనే చెబుతుంది.

12/31/2017 - 20:59

ఇలా రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. కాని రాక్షసులకు వైరభావం పెరుగుతూనే ఉంది. అఘాసురుడను రాక్షసుడు కృష్ణుడి గురించి తెలుసుకొన్నాడు. ఎలాగైనా తన సోదరుని చంపిన కృష్ణుని సంగతి తేల్చాలని అనుకొన్నాడు.

12/31/2017 - 20:55

మీ ధర్మపత్ని, మీవారసులు వీరందరికీ మీరు చేయవలసిన కర్తవ్యాన్ని విడిచి మీరుతపస్సులో ఉన్నందువల్ల మీకు తెలియకుండానే మీలో అసహనమూ, కోపం వచ్చింది. మీరు తపశ్శక్తిని సాధించినా కోపాన్ని జయించలేకపోయారు. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించి ఉంటే, గృహసాథ్రశమంలో మీరు ఉండి ఉంటే మీలో సహనం, క్షమ, ఓర్పు అనేగుణాలు వచ్చి ఉండేవి. దానివల్ల మీకు ప్రశాంతి కలిగేది అంటూ ధర్మవ్యాధుడు ఎన్నోవిషయాలు కౌశికునకు చెప్పాడు.

12/31/2017 - 20:52

ర వి, ధనుర్రాశిలో ప్రవేశించినపుడు వచ్చేది- ధనుర్మాసం. ధనూరాశికి అధిపతి - బృహస్పతి. జ్ఞానప్రదాత ఈ మాసంలో జగన్మాత గోదాదేవిగా విల్లి పుత్తూరులోని విష్ణుచిత్తునికి పూదోటలో లభ్యమైంది. ఆ విష్ణుచిత్తునికి తన ఆటపాటలతో అలరించింది. తనభక్తుని కోర్కె ఆ విధంగా తీర్చిందా తల్లి. ఇక పరమాత్మ తన దైవం అయన స్వామిని భక్తవత్సలతను ప్రకటించడానికి విష్ణుచిత్తుని నోటి నుండి ప్రతిరోజు విష్ణుకథలను వినేది.

12/24/2017 - 23:55

రుద్రావతారో భగవాన్ భక్తోద్ధారకస్సవై
హనూమాన్స మహావీర్యో రామకార్య కరస్సదా

12/24/2017 - 23:50

ఆ బోయవాడే ధర్మవ్యాధుడు. ఆ ధర్మవ్యాధుని దగ్గరకు వచ్చిన కౌశికుడు పరధర్మాన్ని ఆశ్రయంచిన ధర్మవ్యాధుని పూర్వజన్మ .... గురించి ఆలోచిస్తూ
ఆ ధర్మవ్యాధా! నీకిన్ని ధర్మాలు తెలిసినప్పటికినీ, ధర్మసూక్ష్మ గ్రహణ ఉన్నప్పటికీ కూడా నీవు మాంస విక్రయం చేయడం నేరం కదా. పైగా నేను అడవిలో ముక్కుమూసుకొని కూర్చుని ఏకాగ్ర చిత్తుడినై ఉండగా నాపై కొంగ రెట్టవేసింది. నేను ఆ కొంగను కోపంతో చూడగా అది చనిపోయింది.

12/24/2017 - 23:49

వీరి పక్కనే కృష్ణుడు గీసిన గిరిలోనే పశువులు పచ్చికను ఆదమరిచి తింటున్నాయి. కొన్ని తిన్నవాటిని హాయిగా చెట్ల నీడలో కూర్చుని నెమరేస్తున్నాయి. కాని ఏ గోవు గిరి దాటి ఇవతల వచ్చే ప్రయత్నమేమీ చేయడంలేదు.

12/17/2017 - 23:04

‘‘అదిగోరా ! జగన్మోహిని వస్తోంది. మోహినీ నీవెంత అందంగా ఉన్నావు’’అంటూ కొమ్ములు పెట్టుకుని రాక్షసుల వోలె కూర్చున్న పిల్లలు అన్నారు.
‘‘నిజం నిజం ఓ భామా ! బలేగున్నది నీ వాలుజడ ఇటు రమ్ము ఇదిగో ఈ పూవు నీకోసమే ’’అంటూ పక్కనే ఓ గడ్డిపూవును తీసి ఇవ్వచూపుతూ దేవతలమని కూర్చున్న వారు అన్నారు. కృష్ణు డు కూడా కిలా కిలా నవ్వుతూ కూర్చున్నాడు.

Pages