S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/26/2017 - 21:40

ప్ర - సఠ్వభయాలను పోగోట్టేది
ద-మోక్షాన్ని ప్రసాదించేది
క్షి - సర్వవ్యాధులను నయం చేసేది

02/26/2017 - 21:38

గుడిలో దేవుని దర్శనం తరువాత తీర్థప్రసాదాల అనంతరం పూజారి శఠగోపం పెడ్తారు. ఈ శఠగోపం పైన దేవుని పాదాలు చెక్కి ఉంటారు. అంటే ఆ దేవుని పాదాలను మన తలపై పెట్టుకున్నట్టు అవుతుందన్నమాట. అందుకే శఠగోపం పెట్టేటపుడు తలవంచి నమస్కరిస్తూ పెట్టించుకుంటారు. స్వామి వారి పాదాలు తలపై పెట్టుకున్నందున అప్పటివరకు చేసిన పాపాలు ప్రక్షాళనం అవుతాయ. సర్వపుణ్యాలు కలుగుతాయ. సద్భావన కలుగుతుంది.

02/26/2017 - 21:28

యజ్ఞమనగా యాగము. హవిస్సు అనగా అగ్నిలో హుతం చేయబడు వస్తువు. యజ్ఞము యొక్క స్వరూపాన్ని బట్టి హవిస్సు మారుతుంది. అగ్నిలో వ్రేల్చెడి సమిధలు (కట్టెలు) కూడా హవిస్సుగానే పరిగణింపబడును. యజ్ఞస్వరూపాన్ని బట్టి ఈ హవిస్సు మారుతుంటుంది. సాధారణంగా యజ్ఞములలో అన్నముగాని పాయసముగాని లేక ఇతర మధుర పదార్థములుగాని మరియొక్క హోమద్రవ్యముతో హుతము చేయబడును.

02/26/2017 - 21:26

వాల్మీకి మహర్షి రామాయణంలో ఎందరు మహర్షులనో పరిచయం చేసాడు. ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. ఆ మహర్షుల చరిత్రలు చదివినపుడు గ్రహించిన విషయాలను అవగాహన చేసుకుని జీవితాన్ని సరిదిద్దుకోవడంలో ఉన్నది నేర్పు. రాముడు అరణ్యవాస ప్రారంభంలోను చివరిలోను భరద్వాజ మహర్షిని సందర్శిస్తాడు. చిత్రమేమంటే భరద్వాజ మహర్షి తనను సందర్శించిన రాముడికి రెండుసార్లు భరతుడికి ఒకసారి విందు ఏర్పాటు చేసాడు.

02/19/2017 - 22:44

పరమేశ్వరుని పతిగా పొందిన సతి అన్యోన్యానురాగాలతో పరమశివుణ్ణి సేవించసాగింది. సతి తండ్రి యైన దక్షుడు ఒకానొక కాలంలో అహంకారానికి వశమైనాడు. శివదూషణ చేయడానికి వశుడయ్యాడు. ఆ క్రమంలోనే తాను తలపెట్టిన యజ్ఞానికి శివుని పిలవకూడదని నిశ్చయించుకున్నాడు. తన పుత్రిక పై కూడా మమకారాన్ని వదిలివేసుకొని శివునికి ఆహ్వానం అందించకుండానే యజ్ఞాన్ని తలపెట్టాడు.

02/19/2017 - 22:41

ఆధ్యాత్మిక చింతనకు ‘ఆచంట’ ఆలవాలం. ఇక్కడ స్వామి ఆచంటేశ్వరుడు. నిత్యం పరిసర ప్రాంతాలనుంచే కాకుండా సుదూర ప్రాంతాలనుండి ఇక్కడకు భక్తులు వస్తుంటారు. ప్రతీ సోమవారంనాడు విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. కార్తీక మాసంలో ఇక్కడ అఖండ దీపాన్ని వెలిగించడానికి భక్తులు పోటీపడుతుంటారు. కాశీక్షేత్రం తర్వాత ఇక్కడే కార్తీక మాస అఖండ దీపం వెలిగించడం ఈ క్షేత్ర విశేషం.

02/05/2017 - 21:51

భారతీయ జీవనంలో వేదాలకు, ఉపనిషత్తులకున్న ప్రాధాన్యత వేటికీ లేదు. జాతిలో చేతనత్వాన్ని నింపేందుకు సత్యానే్వషణ చాలా వరకూ ఉపకరిస్తుంది. వేదవిహితమైన హైందవ ధర్మం సూర్యచంద్రులున్నంతవరకూ కొనసాగుతూనే ఉంటుంది. నిజాన్ని నమ్మి, వాస్తవాన్ని ప్రేమించే హైందవ సంస్కృతి నిత్య శోధనతో సశాస్ర్తియమైన అంశాలను ఆవిష్కరించింది.

02/05/2017 - 21:30

భారతదేశం కర్మభూమి. పుణ్యభూమి. సనాతన ధర్మానికి వేదిక. అమృతత్వోపాసనయే మనిషి ధర్మం అని చెప్పే దివ్యభూమి ఇది. మనిషి పుట్టగానే సరిగాదు పుట్టినందుకు జన్మ సాఫల్యానికి త్యాగమే మహోన్నతం అని తెలుసుకోవాలంటుంది భారతీయం. అటువంటి భారతదేశానికి యయాతి ఒక మహారాజు. ఆ మహారాజుకు ఇద్దరు భార్యలు. ఒకరు ధర్మానే్న శాసించే నేర్పు ఒడిసిపట్టిన శుక్రాచార్యుని కూతురు దేవయాని.

01/29/2017 - 23:21

మాతృదేవోభవ, పితృదేవోభవ
ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ
తల్లినే ఆరాధ్యదేవతగా చేసుకో, తండ్రినీ ఆరాధ్యదేవతగా చేసుకో, గురువునీ ఆరాధ్యదేవతగా చేసుకో- అతిథినీ ఆరాధ్యదేవతగా చేసుకో అని.

01/29/2017 - 23:19

ఈ జగత్తులోని జీవరాసులన్నింటికన్నా ఉత్కృష్టమయినది మానవ జన్మ. మనిషికి తక్కిన జీవరాసి కంటే అధికంగా ఉన్నవి, మేధోశక్తి, భావప్రకటనకి అనుకూలమైన శరీర నిర్మాణం. దానికి ఒక భాష, ఏ ప్రాంతాల వారికి వారి వారి భాష. అందువల్ల మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ లక్షణాలను వాడుకుని చక్కని జీవితం గడపడానికి వీలుగా మలుచుకోవడం మంచిది. జంతువులు బ్రతుకుతాయి. మనిషి జీవించాలి.

Pages