S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/29/2017 - 20:09

అంతలో అక్కడికి ఓ మనిషి వచ్చాడు. ‘‘మహా రాజా మహారాజా... ఇతనిని దూరంగా ఉంచండి. ఇతడు పైకి ఇలా కనిపిస్తున్నాడు కాని ఇతని దగ్గర మహాశక్తులు ఉన్నాయి. వీనివల్ల మేమంతా నరకయాతన అనుభవించాము. నేను ఇలా పారిపోయి వచ్చాను. మీరు వీనిని దూరంగా పారద్రోలండి ’’అని అరుస్తూ దగ్గర కు రావడానికి చాలా భయపడుతూ దూరం నుంచి అరుస్తున్నాడు.
వాని దగ్గరకు మహారాజే వెళ్లాడు. ఆయన వెంట పరివారం అంతా వెళ్లింది.

10/29/2017 - 20:07

పద్నాల్గు భువనభాండాగారాలను తన కడుపులో పెట్టుకొన్న పరమాత్మ భక్తులకు వశ్యుడు. యశోద ఏ జన్మలో చేసుకొన్న పుణ్యమో ఈరోజు ఆ పరమాత్మనే తన కొడుకుగా భావిస్తోంది. బాలుడై ఆమెపై ఆనందవర్షాన్ని కురిపిస్తున్నాడు. అల్లరి పనులు చేస్తున్నాడనుకొని తన కొడుకును కట్టడి చేయడానికి పట్టుకొంది. అల్లరి చేయకుండా ఉండడానికి బెత్తం తీసుకొని కొట్టి భయపెట్టుదామని అనుకొంది. కాని ఆ చిన్నవానిని కొట్టడానికి ఆమెకు చేతులు రాలేదు.

10/22/2017 - 21:26

మాట బహుళ ప్రయోజనకారి! అమ్మో! ‘మాటే’ చాలా ప్రమాదకారి! నిజమే అగ్ని లాంటిదే మాట. జాగ్రత్తగా వాడితే అగ్నివలన ఎన్నో ప్రయోజనాలున్నట్టే, అలానే దురుపయోగం చేస్తే ఎన్నో ప్రమాదాలుంటాయి. అగ్గిపుల్ల దీపాన్ని వెలిగిస్తుంది... గడ్డి కుప్పని కాలుస్తుంది. వాడుకోవడంలోనే ఉంది. అలానే మాట కూడా. అగ్నిని వాడుకోవడానికి కాస్త అవకాశం ఆలోచన వుంటుంది, మరి ఒక్కొక్కసారి మాట విసుర్లకు అట్టి అవకాశం చూసుకోవడం వ్యక్తి చేయడు.

10/22/2017 - 21:24

అంతలో పక్కింటిలో రోలు తిరగవేసి దానిపై నిలబడి ఉట్టి అందుకుని వెన్న తాను తింటూ కోతులకు పెడుతున్న కృష్ణుడు యశోదమ్మ కు కనిపించాడు. వెంటనే ‘ఓరి ఇక్కడున్నావా. నీవు వస్తున్నా... మనింట్లో చేసిన అల్లరి చాలక ఇక్కడ మొదలెట్టావా... వస్తున్నా.. అంటూ ముందుకు వస్తున్నయశోదమ్మను చూచి నిజంగా భయపడుతున్నట్లు అమ్మో అన్నకేక పెడుతూ ఆ వెన్నకుండలను కిందికి దబ్బున వేసి అక్కడ్నుంచిపరుగెత్తాడు కృష్ణుడు.

10/22/2017 - 21:21

‘‘ఎ వడురా అది. పల్లకీని ఇలా మోస్తున్నది’’ అని పలికిన రాజుగారికి ‘‘మహారాజా.. ఈ కొత్తబోయి వానికి పల్లకీని మోయడం రాకున్నది. వీని వల్లనే మాకు కూడా కష్టంగా ఉంది’’అన్న జవాబు చిరాకు తెప్పించింది. మేనాలోంచి తొంగి చూసేసరికి బలిష్టమైనవాడు, మధ్యవయస్కుడు, కండలు తిరిగిన వానిగా ఉన్న ఒక బోయి పల్లకీని మోస్తున్నాడు. ఆమోయడంలో ఆసక్తి గాని, భయభక్తులు గాని కనిపించలేదు రహూగణ మహారాజుకు.

10/15/2017 - 22:10

ఈ వైశ్యులలో కుసుమశ్రేష్టి కుసుమాంబ అను దంపతులు తమకు సంతానం లేదని పెద్దల చేత అనుజ్ఞ తీసుకొని పుత్రకామేష్టి యాగం చేశారు. అపుడు ఆ దంపతులకు విరూపాక్షుడు, వాసవాంబ అనువారు పుట్టారు. శచీదేవినే వాసవాంబగా పుట్టింది. వారు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకొనేవారు. ఆమె యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఓసారి విష్ణువర్థనుడు అను రాజు వీరున్న పెనుగొండకు వచ్చాడు.

10/08/2017 - 21:22

సృష్టిలో గల సమస్త ప్రాణులకి మరణమంటే విపరీతమైన భయం. మరణాన్ని తప్పించుకునేందుకు ప్రతిప్రాణీ శాయశక్తులా కృషి చేస్తుంది. మరణం ఎప్పుడు ఏ రూపంలో ప్రాణిని హరిస్తుందో తెలియదు. గీతలో చెప్పినట్టు పుట్టిన ప్రతి ప్రాణి మరణించి తీరవలసిందే. అందువలనే మహనీయుల తపస్సులకు సంతసించి ప్రత్యక్షమైన దేవతలు ఎన్ని వరాలైనా ఇచ్చారు కానీ మరణం లేకుడా ఎవరూ వరం ఇవ్వలేకపోయారు.

10/08/2017 - 21:20

వెంటనే కృష్ణుని ముద్దాడుతూ తన కొంగు ను కప్పి కృష్ణు ని దాచేసి ‘‘ ఏమి అమ్మలమ్మా మీరు మీకు కూడా కొడుకు వున్నారు కదా. నేను ఎప్పుడైనా మీ కొడుకులపై నిందలు మోపానా? పోయిరండమ్మా! నాకొడుకు అమాయకుడు మీరు చెప్పేవన్నీ మీకొడుకులు చేస్తున్నారేమో చూసుకోండి.

10/08/2017 - 21:15

పుత్రవ్యామోహం, పుత్రుని మీద మమకారం అనేది కేవలం మానవులకే కాదు దేవతలకు కూడా ఉంటుందని శచీదేవిని చూస్తే అనిపిస్తుంది. ఒకానొక కాలంలో శతజిహ్వుడనే రాక్షసుడు మితిమీరి ప్రవర్తిస్తుండేవాడు. సజ్జనులను హింసించడం రాక్షసుల ప్రవృతి. ఈ రాక్షసులు యజ్ఞాలను ధ్వంసం చేయడం వారి హక్కుగా భావిస్తారు కదా. అట్లానే ఈ శతజిహ్వుడు కూడా యజ్ఞవిధ్వంసకుడుగా చెలరేగి ప్రవర్తిస్తుండేవాడు.

10/01/2017 - 23:11

సాధనా మార్గంలో సాగిపోవాలనే సాధకుడు మొదట తన శరీరానికి యోగాభ్యాసంకు ఉపకరించేటి ఆహారాన్ని నియమంగా తగుపాళ్లలో స్వీకరించాలి. తగినంత మాత్రమే భుజించాలి. విహరించే ప్రాంతాలు కూడా మనోల్లాసాన్ని కలిగిస్తూ సాధనకు తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చేదిలా వుండాలి.

Pages