S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2017 - 04:44

వరంగల్, జనవరి 19: పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న మొదట తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆ తరువాత వత్తాసు పలికే విధంగా వ్యవహరించటం ప్రజలను మోసం చేయటమేనని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

01/20/2017 - 04:42

నల్లగొండ, జనవరి 19: ద్వంద్వ పన్ను విధానాన్ని నియంత్రిస్తు కేంద్రం ప్రతిపాదిస్తున్న నూతన వస్తు, సేవాపన్ను (ఐజిఎస్‌టి) పరిధిలోకి తెలంగాణ జిల్లాలు వడివడిగా ముందడుగు వేస్తున్నాయి. హైద్రాబాద్, రంగారెడ్డి మినహా ఇతర తెలంగాణ జిల్లాలు ఎక్కువగా గ్రామీణ నేపథ్యంతో ఉన్నప్పటికి జిఎస్‌టి పన్ను విధానంలో వ్యాపారులు, డీలర్లు వేగంగా నమోదు ప్రక్రియను పూర్తి చేస్తుండటం ఆసక్తికరం.

01/20/2017 - 04:41

హైదరాబాద్, జనవరి 19: భారతదేశంలో క్షయ మళ్లీ విస్తరిస్తోందని, ఏటా మూడు మిలియన్ల కొత్త కేసులు నమోదవుతున్నాయని, తెలంగాణలో బ్రెయిన్ టిబి కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోందని హైదరాబాద్‌కు చెందిన హెల్పింగ్ హాండ్ ఫౌండేషన్ పేర్కొంది. బ్రెయిన్ ట్యూబర్‌క్యులోసిస్ (టిపి)పై తెలంగాణలో క్షేత్రస్ధాయిలో ఈ సంస్థ అధ్యయనం చేపట్టింది.

01/20/2017 - 04:40

నర్సంపేట, జనవరి 19: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగుల పదోన్నతులలో భారీ గోల్ మాల్ జరిగింది. అంగన్‌వాడీ ఏసిడిపివో పదోన్నతులలో నిబంధనలను తుంగలో తొక్కిన ఓ ఉన్నతాధికారి కోటిన్నర పైచిలుకు మొత్తం దండుకుని 36 మంది జూనియర్లకు అడ్డదారుల్లో ఏసిడిపివో పదోన్నతులు కల్పించారు.

01/20/2017 - 04:32

సీలేరు, జనవరి 19: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా చర్యలు చేపట్టారు. ఆరు నెలల కాలంలో సుమారు నలుగురు గిరిజనులను మావోయిస్టు ఇన్‌ఫార్మర్ల పేరిట హత్యలు జరిగిన విషయం తెలిసిందే.

01/20/2017 - 04:32

అనకాపల్లి(నెహ్రూచౌక్), జనవరి 19: సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా తీర్థాలు జరగడంతో ప్రజలు, రైతులు ఆయా కార్యక్రమాల్లో తీరికలేకుండా పాల్గొంటున్నారు. దీంతో అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు బెల్లం అంతంతమాత్రంగా వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు.

01/20/2017 - 04:31

నర్సీపట్నం, జనవరి 19: నియోజకవర్గ కేంద్రమైన నర్సీపట్నం పెద్ద చెరువును హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేసేందుకు కోటి 35 లక్షల రూ.లు మంజూరు చేసినట్టు పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. గురువారం తన నివాసంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. చెరువు చుట్టూ ప్రహారీ నిర్మించి, పార్కును అభివృద్ధి చేస్తామన్నారు.

01/20/2017 - 04:31

జగదాంబ, జనవరి 19: వాతావరణంలో వస్తోన్న మార్పులు తదితర కారణాలతో విశాఖలో స్వైన్‌ఫ్లూ రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ఒక పాజిటివ్ కేసుకు సంబంధించిన రోగి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో తొమ్మిది మంది రోగులు అనుమానితులుగా గుర్తింపబడ్డారు. వీరి నుంచి రక్తనమూనాలను సేకరించారు. వీటిని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు.

01/20/2017 - 04:30

విశాఖపట్నం, జనవరి 19: జిల్లా కేంద్రంలోని పోలీసు బ్యారెక్స్‌లో నిర్వహించనున్న గణతంత్ర వేడుకల్లో జిల్లా ప్రగతిని ప్రతిబింబించేలా శకటాలను ప్రదర్శించాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వివిధ ప్రభుత్వశాఖల అధికారులను ఆదేశించారు. గణతంత్ర వేడుకుల నిర్వహణపై గురువారం కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షించారు.

01/20/2017 - 04:29

విశాఖపట్నం, జనవరి 19: పగలంతా దట్టమైన పొగమంచు నగరాన్ని కమ్ముకుంటుంది. ఎండను మించి మరీ మంచు తీవ్రత ఉన్నందున ఏమాత్రం వేడిమి జనానికి తగలడంలేదు. విశాఖ ఏజెన్సీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. విశాఖ నగరంలోనే పగటి ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని విధంగా పడిపోయాయి. విశాఖ జిల్లాకు సంబంధించి 19 డిగ్రీలు నమోదు కాగా, బాపట్లలో దీనికంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Pages