S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 01:55

తిరుమల, జూలై 17: తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే రెండో కనుమమార్గంలో రెండు వేరువేరుప్రాంతాల్లో ఆదివారం వాహనాలు రోడ్డుప్రమాదాలకు గురయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. రెండవ ఘాట్‌రోడ్డులో అలిపిరికి 2 కిలో మీటర్ల దూరంలో ఓ కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. అలాగే 4వ కిలోమీటర్ వద్ద ప్రభుత్వ వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.

07/18/2016 - 01:55

తిరుపతి, జూలై 17: రైల్వే స్టేషన్‌లో పనిచేస్తున్న చిరువ్యాపారులను వేధింపులకు గురిచేస్తున్న రైల్వే జి ఆర్ పి ఎస్ ఐ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలని ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు టి. మురళి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక తిరుపతి రైల్వేస్టేషన్‌లోని పోలీస్ స్టేషన్ వద్ద ఎ ఐ టి యుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

07/18/2016 - 01:55

తిరుపతి, జూలై 17: పుస్తకం ప్రతిమనిషికి ఒక నేస్తమని, నిఘంటువు పదాలకు పరమార్థాలను తెలిపే ఓ విజ్ఞాన భాండాగారమని స్థానిక మహిళామైత్రి కన్వీనర్ ఎస్.శశికళ అన్నారు. విక్రమ్ పబ్లిషర్స్ తాజాగా విడుదలచేసిన ఇంగ్లీష్-తెలుగు నిఘంటువులను ఆదివారం వరదరాజ నగర్ చైతన్య పాఠశాల ఆవరణంలో పాచిగుంటకు చెందిన ఎస్టీ విద్యార్థులకు మహిళామైత్రి సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు.

07/18/2016 - 01:54

తిరుపతి, జూలై 17: న్యాయస్థానాల్లో ఎవరైనా తప్పుడు కేసులు వేసినా, సాక్ష్యాలు చెప్పినపుడు అవి నిర్థారణ అయితే న్యాయమూర్తులు తక్షణం అలాంటి వారిపై కేసులు నమోదుచేయాలని, తద్వారా న్యాయస్థానం విలువైన సమయాన్ని పరిరక్షించవచ్చని న్యాయ పరిరక్షణా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జుజ్జవారపు కాళేశ్వర రావు అన్నారు.

07/18/2016 - 01:52

కడప,జూలై 17: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎరువుల ధరను తగ్గించినా పలువురు వ్యాపారులు పాత ధరకే విక్రయిస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. జిల్లా అధికారులు ఎరువుల అంగళ్లపై దాడులు నిర్వహిస్తున్నా వ్యాపారులు తీరు మార్చుకోవడంలేదు. క్షేత్రస్థాయిలో కొంతమంది సంబంధిత అధికారులు ఎరువుల వ్యాపారులతో మిలాఖత్ అయి వ్యాపారులకు వత్తాసుపలుకుతున్నట్లు తెలుస్తోంది.

07/18/2016 - 01:52

వల్లూరు,జూలై 17: ఆరోగ్యం కోసం ప్రభుత్వం వేలాది రూపాయలు ఖర్చుచేసి విద్యార్థులకు శుద్ధినీరు అందించేందుకు ఏర్పాటుచేసిన జలమని పథకం మూలనపడి మంచినీరు అందించడంలో విఫలం చెందింది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం శుద్దినీరు అందించేందుకు పాఠశాలల్లో జలమని పథకం కింద ఆర్‌ఓ ప్లాంట్లను ఏర్పాటుచేసి పర్యవేక్షణ లేకపోవడంతో పథకం కాస్త మూలనపడి విద్యార్థులకు శుద్ధినీరు అందడం లేదు.

07/18/2016 - 01:52

కడప,జూలై 17: జిల్లాలో అధిక జనాభా కలిగిన రైల్వేకోడూరు, వేంపల్లె మేజర్ గ్రామపంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈ ఏడాది జనవరిలో ఆదేశించినా ఇంతవరకు ఆదేశాలు అమలుకాలేదు. జిల్లాకు చెందిన పురపాలక సంఘాలన్నింటికీ రాజంపేట పురపాలకం మినహా మిగిలిన పురపాలక సంఘాలకు రెండేళ్లక్రితం ఎన్నికలు జరిగాయి.

07/18/2016 - 01:51

రాయచోటి, జూలై 17: రాజంపేట నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఇన్‌చార్జిగా మాజీ కేంద్రమంత్రి సాయి ప్రతాప్‌ను తెలుగు దేశం పార్టీ అధిష్ఠానం నియమించడంపై రాయచోటి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుగవాసి శ్యామ్ కుమార్, రాయచోటి టిడిపి ఉపాధ్యక్షులు కారంశెట్టి గిరిలు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం కడపలోని సాయి ప్రతాప్ నివాసంలో ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపారు.

07/18/2016 - 01:51

కడప,(క్రైమ్)జూలై 17: పోలీసులు ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసు డిజిపి జెవి రాముడు అన్నారు. ఆదివారం సాయంత్రం పోలీసు క్వార్టర్స్‌లో జిమ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం డిజిపి మాట్లాడుతూ శారీరకంగా ధృడత్వం కలిగినప్పుడే మానసికంగా అలసత్వం లేకుండా విధులు నిర్వహించగలుగుతారని డిజిపి పేర్కొన్నారు.

07/18/2016 - 01:50

రాజంపేట, జూలై 17:తెలుగువారి సంక్షేమానికి అమెరికాలోని తానా సంస్థ కృషి చేస్తున్నదని డిజిపి జె.వి.రాముడు అన్నారు. ఆదివారం రాజంపేట పట్టణం మన్నూరు హైస్కూల్‌లో తానా ప్రతినిధి వేమన సతీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిజిపి పాల్గొని కరాటే విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తానా తెలుగువారి సంక్షేమానికి కోట్లాది రూపాయలతో సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నదని డిజిపి పేర్కొన్నారు.

Pages