S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2016 - 00:07

నాంపల్లి, జనవరి 21: తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని కట్టెల పొయ్యిని వీడి గ్యాస్‌ను వినియోగించుకునేందుకు దీపం పథకంద్వారా గ్యాస్ కనెక్షన్‌లను అందిస్తుందని, అలాగే నల్లా కనెక్షన్‌ల ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని కూడా అందిస్తుందని మునుగోడు శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

01/22/2016 - 00:06

భువనగిరి, జనవరి 21: ఎక్సైజ్ సూపరింటెండెంట్ దత్తరాజ్‌గౌడ్ ఉత్తర్వులమేరకు గురువారం భువనగిరిలో కల్తీకల్లు విక్రయిస్తున్న శ్రీలక్ష్మినరసింహ గీతాపారిశ్రామిక సహకార సంఘం లైసెన్స్‌ను రద్దుచేస్తు 8కల్లువిక్రయశాలలను సీజ్ చేసినట్లుగా భువనగిరి ఎక్సైజ్ సర్కిల్ ఇన్సిపెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు.

01/22/2016 - 00:06

దీపికా పదుకొనె

01/22/2016 - 00:05

నల్లగొండ, జనవరి 21: జిల్లాలో కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రభుత్వ శాఖల నుండి 600కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించామని జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి వెల్లంచారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్‌తో కలిసి కలెక్టర్ తన చాంబర్‌లో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్ల్యుఎస్, డిపివో, అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పుష్కర ఏర్పాట్లను సమీక్షించారు.

01/22/2016 - 00:04

యాదగిరిగుట్ట, జనవరి 21: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి ఆలయాన్ని గురువారం జర్మని దేశానికి చెందిన ఎస్ కేన్‌లు సందర్శించారు. దైవదర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం ఎంతో ఆహ్లాదాన్ని కల్గించిందని చెప్పారు. ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు.

01/22/2016 - 00:04

నల్లగొండ, జనవరి 21: జిల్లాలో స్కానింగ్ సెంటర్లలో అక్రమంగా సాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించి భ్రూణ హత్యలు నివారించి ఆడ పిల్లలను సంరక్షించాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి లింగ నిర్ధారణ నిషేధ చట్టం పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్ష వహించి మాట్లాడారు.

01/22/2016 - 00:03

ప్రతి శుక్రవారం పాఠకులను అలరిస్తున్న వెనె్నల సినిమా ప్రత్యేక అనుబంధం ఇక (జనవరి 26) నుంచి ప్రతి మంగళవారం అందుతుంది. పాఠకులు గమనించగలరు.

-ఎడిటర్

01/22/2016 - 00:03

నల్లగొండ రూరల్, జనవరి 21: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ గురువారం ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బరిగెల వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్ధుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు.

01/22/2016 - 00:03

రామన్నపేట, జనవరి 21: రానున్న వేసవి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉపాధిహామీ కార్మికులకు వచ్చేనెల 15 నుండి ఇరవైశాతం కూలీ అదనంగా చెల్లించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. సత్యనారాయణరెడ్డి అన్నారు. మండలంలోని జనంపల్లి, ఉత్తటూరు, ఇస్కిళ్ల గ్రామాలలో జాతీయ ఉపాధిహామీ పథకం కింద నిర్వహిస్తున్న పలు పనులను ఆయన గురువారం పరిశీలించారు.

01/22/2016 - 00:02

కోదాడ, జనవరి 21: రోడ్డు భద్రతను అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని నల్లగొండ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ కోరారు. కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ గురువారం కోదాడలో రోడ్డ్భుద్రతపై డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు.ఉద్యమం మాదిరిగా రోడ్డ్భుద్రతపై డ్రైవర్లలో, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.

Pages