S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2016 - 22:35

మహబూబ్‌నగర్, జనవరి 21: ఎస్సీ సబ్ ప్లాన్ ఆమలుకు జిల్లాలో పకడ్బంది చర్యలు చేపట్టాలని ఈ కార్యక్రమానికి అన్ని శాఖలు అనుబంధంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి తెలిపారు. గురువారం రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఎస్సీ సబ్‌ప్లాన్ ఆమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

01/21/2016 - 22:35

మహబూబ్‌నగర్, జనవరి 21: పోలీసు సాయుద బలగాలకు పునశ్ఛరణ తరగతులు వృత్తిలో మరింత నైపుణ్యత పెంపొందిస్తాయని జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సాయుద పోలీసు బలగాల పునశ్చరణ తరగతుల ముంగింపు కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయుద పోలీసు బలగాలు తమ వృత్తికి సంబందించిన శిక్షణ నైపుణ్యాలను పదర్శించారు.

01/21/2016 - 22:34

మిడ్జిల్, జనవరి 21: దుందుబీ వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న ఆరు లారీలను మున్ననూర్ గ్రామస్ధులు గురువారం అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మిడ్జిల్ తహశీల్దార్ పాండునాయక్ మున్ననూర్‌కు చేరుకుని గ్రామస్థులు అడ్డుకున్న ఇసుక లారీలను సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

01/21/2016 - 22:34

మహబూబ్‌నగర్, జనవరి 21: జిల్లాలోని డిగ్రీ విద్యార్థులకు వరం లాంటి పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నామని రాష్ట్రంలోనే తొలిసారిగా డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఆమలులోకి తీసుకోస్తున్నామని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి వెల్లడించారు.

01/21/2016 - 22:33

బొంరాస్‌పేట, జనవరి 21: తెలంగాణ రాష్ట్రానికి వాటర్ షెడ్ పనుల కోసం రూ.140 కోట్లు కేంద్రం నిధులు మంజూరు చేసిందని గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ అనిత రాంచంద్రన్ అన్నారు.

01/21/2016 - 18:59

హైదరాబాద్‌: కొన్ని నెలలుగా వాయిదా పడుతున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఎట్టకేలకు గురువారం జరిగింది. బోర్డు ఛైర్మన్‌ రామ్‌శరణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు నియంత్రణ, నిబంధనల్లో కొన్ని సవరణలు చేసి వాటిని కేంద్ర జలవనరులశాఖకు పంపించాలని నిర్ణయించారు.

01/21/2016 - 18:54

చెన్నై: చెన్నై తీరంలో నావికాదళ పడవ నీటమునిగింది. పడవలో మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఘటనపై నావికాదళం విచారణకు ఆదేశించింది.

01/21/2016 - 18:51

తాండూరు రూరల్: రంగారెడ్డి జిల్లా తాండూరులో గురువారం ఇంటి ముందు ఆడుకుంటున్న అక్కాచెల్లెళ్లను పాము కాటు వేసింది. పట్టణంలోని రహమత్‌నగర్‌కు చెందిన అబ్దుల్, ఫాతిమా దంపతుల కూతుళ్లు సనాబేగం(6), సౌలీబేగం(3)లు ఇంటి ముందు ఆడుకుంటుండగా.. పాము కాటు వేసింది. దీంతో ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నిస్తుండగా.. సౌలీబేగం మృతిచెందింది. సనాబేగంను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

01/21/2016 - 18:47

తిరువనంతపురం: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ప్రతిష్టాత్మక నిశగంధీ పురస్కారాన్ని పొందారు. కేరళ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్‌చాందీ ఇళయరాజాకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. నిశగంధీ అవార్డు కింద రూ.1,50లక్షల నగదుతోపాటు జ్ఞాపిక, కాంస్య ప్రతిమను అందజేశారు.

01/21/2016 - 16:43

చెన్నై:తమిళనాడులో కరడుగట్టిన ఉగ్రవాది తప్పించుకున్నాడు. ఉత్తరాదిలో ఏడు బాంబుపేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన సయ్యద్ మహ్మద్ అలీ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. లక్నో కోర్టులో హాజరుపరిచి వేలూరుకు తీసుకొస్తుండగా మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ దగ్గర రైలులో నుంచి దూకి సయ్యద్ తప్పించుకున్నాడు.

Pages