S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2016 - 23:56

సంగారెడ్డి టౌన్, జనవరి 21: జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారి ఫుట్‌పాత్‌లపై వెలసిన వ్యాపారాల డబ్బాలను తొలగించడం నిలిపి వేయాలని సిపిఎం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముందు వ్యాపారులు ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్వో దయానంద్‌కు అందజేశారు.

01/21/2016 - 23:56

నర్సాపూర్,జనవరి 21: నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన సంఘటన గురువారంనాడు జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

01/21/2016 - 23:55

సంగారెడ్డి, జనవరి 21: హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ పాలక మండలి ఎన్నికల ప్రచారం నేటి నుంచి జోరందుకోనుంది. మెదక్ జిల్లాలోని పటన్‌చెరు, రామచంద్రాపూర్, భారతీనగర్ వార్డులు జిహెచ్‌ఎంసిలో అంతర్భాగం కావడంతో ఈ మూడు వార్డుల్లో ఎన్నికలు అనివార్యమయ్యాయి.

01/21/2016 - 23:55

పటన్‌చెరు, జనవరి 21: ప్రజలకు సేవ చేయడంతోనే రాజకీయ నాయకుల జీవితాలకు సార్థకత లభిస్తుందని పటన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం కొద్ది మందికే లభిస్తుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

01/21/2016 - 23:54

సంగారెడ్డి, జనవరి 21: ప్రైవేట్ నెట్ సంస్థలకంటే మెరుగైన సేవలు అందిస్తుందన్న నమ్మకంతో ప్రభుత్వ రంగానికి చెందిన బిఎస్‌ఎన్‌ఎల్ సేవలు అత్యంత దారుణంగా మారాయి. ప్రతి రోజు ఎదో ఒక రకమైన ఇబ్బందులు తలెత్తుతుండటంతో బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్ బాండ్ సేవలను వినియోగదారులు సద్వినియోగపర్చుకోలేపోతున్నారు. ఆదివారం వచ్చిందంటే మరిన్ని ఇబ్బందులే తలెత్తుతున్నాయి.

01/21/2016 - 23:46

నియోజకవర్గాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష ప్రమేయానికి, క్రియాశీలక పాత్రకోసం నిర్దేశించబడిన ఎం.పి. లాడ్స్ నిధులు పెద్దఎత్తున దుర్వినియోగం అవుతున్నాయన్న కాగ్ తాజా నివేదిక క్షేత్రస్థాయిలో ఈ పథకం వైఫల్యానికి తార్కాణంగా నిలుస్తోంది. ఈ విధమైన ఎంపీ స్థానిక ప్రాంత పథకం మన దేశంలో తప్ప ఎక్కడా అమలులో లేదన్నది స్పష్టం.

01/21/2016 - 23:38

‘‘సప్రస్సియో వెరి-సజస్టియో ఫాల్సి’’2 అనేది ఒక లాటిన్ సామెత. దీని అర్థం సత్యాన్ని కప్పిపెట్టు. అసత్యాన్ని ప్రచారం చేయి అని. వామపక్ష చరిత్రకారులు, కుహనా మేధావులు ఇప్పుడు చేస్తున్న పని అదే. వారికి ఇంగ్లీషు మీడియా కొమ్ముకాస్తున్నది. తీవ్ర ఒత్తిడికి లోనైన రోహిత్ వేముల ఆత్మహత్య అందరినీ కలచివేసింది. కానీ ఈ ఆత్మహత్య వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.

01/21/2016 - 23:38

వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నామినేషన్ వేసిన రోజే ఆయన కోడలు సారిక తన ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యకు ఒడిగట్టింది. తనను తన పిల్లలను, నరకయాతనకు గురిచేస్తూ క్రూరంగా హింసిస్తున్న రాజయ్యకు ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వవద్దని ప్రాధేయపడుతూ సోనియాగాంధికి సారిక ఉత్తరం రాసింది.

01/21/2016 - 23:51

గత లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని విజయపథంవైపు నడిపించిన నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో రాజకీయ, పరిపాలన అనుభవంతో పార్టీలో అందరికన్నా సీనియర్ అయిన సుష్మాస్వరాజ్‌కు మంత్రివర్గంలో అసలు స్థానం లభిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంత్రివర్గ కూర్పు గురించి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అరుణ్‌జైట్లీతో సమాలోచనలు జరిపిన ప్రధానమంత్రి ఆమెను అసలు సంప్రదించలేదు.

01/21/2016 - 23:33

తిమింగలాలను దిగమింగుతున్న కాలుష్యం తాబేళ్లను మాత్రం వదలిపెడుతుందా? కాలుష్యం, అతి భయంకరమైన పరిణామాలకు కారణం! భూమి ఉపరితలంపై ఏనుగులు సముద్ర జలాలలో తిమింగలాలు పెద్ద జంతువులు. పిల్లలకు పాలిచ్చి పెంచే తిమింగలాలు భూమిపై ఏనుగుల వలెనే సముద్రంలో సాధు జంతువులు. ఈ సాధు జంతువులు చెలరేగినప్పుడు హాని జరుగుతుంది, కానీ మామూలుగా ఉన్నప్పుడు అవి మానవులకు హాని చేయవు!

Pages