S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2016 - 12:14

నిజామాబాద్: ఇద్దరు బాలికలకు మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేసి అత్యాచారానికి ప్రయత్నించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. సదాశివనగర్ మండలం రామారెడ్డి గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. 8వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా కిరణ్‌కుమార్, నితీష్ కుమార్ అనే యువకులు మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేశారు.

01/21/2016 - 12:13

తిరుపతి: ఎ.పి. రాజధాని అమరావతి నిర్మాణానికి తమ వంతు బాధ్యతగా రాష్ట్రంలోని సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు నెల రోజుల గౌరవ వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, నెల గౌరవ వేతనం కింద 9 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.

01/21/2016 - 12:13

గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం అదృశ్యమైన తొమ్మిది నెలల బాలుడు ఏసుబాబు ఆచూకీని కనుగొన్నట్లు ఎ.పి. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ రోజు చెప్పారు. నగరంలోని అరండల్‌పేటలో ఓ మహిళ వద్ద బాలుణ్ని గుర్తించినట్టు తెలిపారు. బాలుణ్ని చూస్తానని చెప్పి చేతుల్లోకి తీసుకుని ఆ మహిళ కనిపించకుండా పోయింది. పోలీసులు కొద్ది గంటల్లోనే ఈ కేసును ఛేదించి అనుమానితురాలిని అరెస్టు చేశారు.

01/21/2016 - 12:07

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలతో గడువు ముగుస్తుంది. పలు వార్డుల్లో వివిధ పార్టీల తరఫున ఒకరి కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. రెబల్స్‌గా బరిలో దిగిన వారిని బుజ్జగించేందుకు టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఉపసంహరణ గడువులోగా అభ్యర్థులు సంబంధిత పార్టీల నుంచి బి-్ఫరాలను సమర్పించాల్సి ఉంది

01/21/2016 - 12:06

మెదక్: ములుగు మండలంలో మావోయిస్టులకు సహకరిస్తున్న శ్యామ్‌సుందర్ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మావోయిస్టులకు ఇతను కొరియర్‌గా పని చేస్తున్నాడని ములుగు ఎస్సై చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలానికి చెందిన శ్యామ్ సుందర్‌ను కోర్టులో హాజరుపరచి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

01/21/2016 - 12:25

హైదరాబాద్: దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అనంతరం ఐదో రోజు గురువారం కూడా హెచ్‌సియులో బంద్ కొనసాగుతోంది. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు దిల్లీ సి.ఎం. కేజ్రీవాల్, సిపిఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, మాజీ ఎం.పి. అజీజ్ పాషా తదితరులు ఈ రోజు వర్శిటీకి వస్తున్నారు. రాజకీయ నేతల తాకిడి అధికం కావడంతో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.

01/21/2016 - 12:06

పంజాబ్: భారత్ - పాక్ సరిహద్దు ప్రాంతంలోని పఠాన్‌కోట్ వద్ద బుధవారం రాత్రి అనుమానస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళ సైనికులు కాల్చి చంపారు. భారత్ భూభాగంలోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నిస్తుండగా జవాన్లు అక్కడికి చేరుకున్నారు. చొరబాట్లను నిలువరించేందుకు జవాన్లు జరిపిన కాల్పుల్లో మరో ఇద్దరు తప్పించుకున్నారు.

01/21/2016 - 12:05

దిల్లీ: అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ‘ఐసిస్’తో సంబంధాలు ఉన్న నలుగురు అనుమానిత వ్యక్తులను ఉత్తరాఖండ్‌లో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గణతంత్ర వేడుకల సమయంలో దేశంలో ఉగ్రవాదుల దాడులకు అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించటంతో పోలీసులు దిల్లీ సహా పొరుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో నలుగురిని అరెస్టు చేసి క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నారు.

01/21/2016 - 08:07

ఏలూరు, జనవరి 20: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు నానాఆగచాట్లు పడుతూనే ఉంటాయి. అయితే ఇది అంతా ఉద్యోగం వచ్చేవరకు మాత్రమే. ఇక వచ్చిన తర్వాత భాగ్యలక్ష్మి లాటరీ తగిలినట్లే. ఏటా బంగారుబాతు నుంచి గుడ్లు తీసుకువెళ్లినట్లు ఒక్కొక్కటి వెనకేసుకోవటమే.

01/21/2016 - 08:05

కడప, జనవరి 20: తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపికచేస్తారని గత కొద్దినెలలుగా వార్తలు వెలువడుతున్నాయి. వీరశివారెడ్డి మాత్రం ఎమ్మెల్సీగా వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. ఆలస్యమైనప్పటికీ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే ఆయన మొగ్గుచూపుతున్నారు. తెలుగుదేశంపార్టీలో ఒక పర్యాయం, కాంగ్రెస్‌పార్టీలో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Pages