S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2016 - 08:03

తాడిపత్రి, జనవరి 20:హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ మరణాన్ని సాకుగా చూపి కాంగ్రెస్, కమునిస్టుపార్టీలు దేశంలో అలజడి రేపాలని చేస్తున్న కుటిలయత్నాలను తిప్పికొడుదామని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షులు అంకాల్‌రెడ్డి పేర్కొన్నారు.

01/21/2016 - 08:01

వరంగల్, జనవరి 20: వచ్చే ఏడాదిలోగా కాజీపేట- బళ్లార్షా మూడవ లైన్ పనులు పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా అన్నారు.
బుధవారం కాజీపేట రైల్వేస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేటకు చేరుకున్న ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

01/21/2016 - 07:59

నిజామాబాద్, జనవరి 20: ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా సూచించారు. ఎవరికివారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకు ప్రమాద ఘటనలను నియంత్రించేందుకు వీలుంటుందన్నారు. తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకునైనా వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ హితవు పలికారు.

01/21/2016 - 07:58

నల్లగొండ, జనవరి 20: జిల్లా సాగుతాగునీటి రంగ ప్రగతికి ఇరిగేషన్ ప్రణాళిక మార్గదర్శిగా ఉండేలా రూపొందించాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డిలు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఏజెన్సీలు రూపొందించిన జిల్లా ఇరిగేషన్ ప్రణాళిక పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా సమీక్షించి పలు సూచనలు చేశారు.

01/21/2016 - 07:56

నారాయణఖేడ్, జనవరి 20: నారాయణఖేడ్ శాసన సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో అకాలమరణం పొందిన దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు ఎంపిపి పి,సంజీవరెడ్డి బుధవారంనాడు నారాయణఖేడ్ తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లకు తన నామినేషన్ అందించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

01/21/2016 - 07:55

రామగుండం, జనవరి 20: మేమూ అడవి బిడ్డలమే సారు... జంతువులను వేటాడుతూ, దుంపలు, పండ్లు, కందమోలాలు తిని బతికేవాళ్లం... ఉన్నత చదువులు లేవు, ఉద్యోగాలు లేవు... పూర్వం మేమంతా కూడా గిరిజనులమే... బాషలేదని పక్కన పెట్టద్దు బాంచన్... దుర్భర జీవితాలను అనుభవిస్తున్న మా బతుకులకు ధైర్యమిచ్చి ఎస్టీ జాబితాలో చేర్చి...

01/21/2016 - 07:53

ఆదిలాబాద్ రూరల్, జనవరి 20: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లాస్టిక్ జెండాలను వినియోగించరాదని జిల్లా ఎస్పీ తరుణ్ జోషి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ జెండాను తోరణాలుగా, అలంకరణ వస్తువుగా వాడొద్దని సూచించారు. ప్లాస్టిక్ జెండాకు బదులుగా కాగితంతో తయారు చేసిన రంగు రంగుల జెండాలనే కట్టాలని పేర్కొన్నారు.

01/21/2016 - 07:43

హైదరాబాద్, జనవరి 20: ప్రముఖ కళాకారుడు, గేయ రచయిత సుందిళ్ల రాజన్న కుటుంబాన్ని అన్ని విధాల ఆందుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. రాజన్న ముఖ్యమంత్రి ఒఎస్‌డి దేశపతి శ్రీనివాస్‌తో కలిసి బుధవారం సిఎంను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. రాజన్న ఈ సందర్భంగా తన పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు.

01/21/2016 - 07:42

హైదరాబాద్, జనవరి 20: నాబార్డు ఆర్థిక సహాయంతో తెలంగాణ రాష్ట్రంలో రూ. 1024 కోట్ల వ్యయంతో చేపట్టిన 330 గోదాంల నిర్మాణాలను జూన్ నెలాఖరుకు నాటికి పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వచ్చే మార్చి నాటికి 100 గోదాంలు, జూన్ నాటికి మరో 230 గోదాంల నిర్మాణం పూర్తి కావాలని మంత్రి సూచించారు.

01/21/2016 - 07:30

హైదరాబాద్, జనవరి 20: అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పేర్లు చెబితే సంపన్నులు ఉండే ప్రాంతాలని ఇట్టే గుర్తుపట్టేస్తారు. రెండు తెలుగురాష్ట్రాల్లో బాగా పలుకుబడి ఉన్నవారు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు, సెలబ్రిటీలు నివసిస్తున్న ఈ ప్రాంతం హైదరాబాద్‌కు ఓ ఆభరణంలాంటిది. అయితే ఓటింగ్ విషయానికి వచ్చేసరికి ఈ ప్రాంతాలు వెనుకవరుసలోనే ఉంటాయి.

Pages