S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2016 - 07:13

విశాఖపట్నం, జనవరి 20: మహిళలు రాజకీయ సాధికారత కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి అనీ రాజా పిలుపునిచ్చారు. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ 20వ జాతీయ మహాసభలు విశాఖలో బుధవారం ప్రారంభమయ్యాయి.

01/21/2016 - 07:12

ఊతడ, జనవరి 20: ఆంధ్ర- తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు తనిఖీ కేంద్రమైన భీములవారి పాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రంపై బుధవారం ఎసిబి అధికారులు జరిపిన దాడుల్లో 55,620 రూపాయల నగదును స్వాధీనం చేసుకొన్నారు. తనిఖీ కేంద్రం వద్ద నిఘా కెమేరాలు ఏర్పాటు చేసినా ప్రైవేటు వ్యక్తుల సహాయంతో అక్రమ వసూళ్లకు చెక్ పోస్టు అధికారులు పాల్పడుతున్నారని ఈదాడుల్లో స్పష్టమైంది.

01/21/2016 - 07:11

గుంటూరు, జనవరి 20: మాస్టర్‌ప్లాన్‌లో పొందుపర్చిన విధంగా రహదారికి స్థలాలు ఇస్తే తమ గ్రామంలో 80 ఇళ్లు పోతాయంటూ కృష్ణాయపాలెం వాసులు ఆందోళన చేయడంతో సిఆర్‌డిఎ అధికారులు దిగివచ్చారు. బుధవారం సిఆర్‌డిఎ అధికారులు మంగళగిరి మండలం, కృష్ణాయపాలెం గ్రామంలో మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామస్థులు రహదారులకు భూములు ఇవ్వబోమంటూ ఆందోళన వ్యక్తంచేశారు.

01/21/2016 - 07:11

గుంటూరు, జనవరి 20: మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సు జరగనివ్వం అంటూ రాజధాని పరిధిలోని ఎర్రబాలెం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, నిడమర్రు గ్రామాల్లో మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సులు నిర్వహించారు. తొలుత ఎర్రబాలెంలో సదస్సు నిర్వహించేందుకు సిఆర్‌డిఎ అధికారులు ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకునేందుకు సిద్ధపడ్డారు.

01/21/2016 - 07:10

విజయవాడ (క్రైం), జనవరి 20: ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌ను అవినీతి నిరోధక శాఖాధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఏసిబి సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ బృందాలు మంగళవారం విజయవాడలోని సదరు అధికారి ఇంటితోపాటు పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు.

01/21/2016 - 07:02

కాన్‌బెరా, జనవరి 20: విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ శతకాలు వృథా అయ్యాయి. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన నాలుగో వనే్డలో టాప్ ఆర్డర్ రాణించినప్పటికీ మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగా టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమిని కొనితెచ్చుకుంది. అంతకు ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఫలితంగా ఆ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 348 పరుగులు సాధించింది.

01/21/2016 - 07:00

ముంబయ, జనవరి 20: ప్రతిష్ఠాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను ఉత్తర ప్రదేశ్ (యుపి) జట్టు కైవసం చేసుకుంది. బుధవారం వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ లో ఈ జట్టు బరోడాను 38 పరుగుల తేడాతో ఓ డించింది. 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన బరోడా 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేయగలిగింది.

01/21/2016 - 06:56

మెల్బోర్న్, జనవరి 20: ఆస్ట్రేలియా గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ డిఫెండింగ్ చాంపియన్లు, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తమతమ విభాగాల్లో నంబర్‌వన్ స్థానంలో ఉన్న నొవాక్ జొకోవిచ్, సెరెనా విలియమ్స్ ముందంజ వేశారు. వీరిద్దరూ తమ రెండో రౌండ్ మ్యాచ్‌లను ఎలాంటి ఇబ్బంది లేకుండా గెల్చుకున్నారు.

01/21/2016 - 06:55

ఖుల్నా, జనవరి 20: బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన మూడో వనే్డలో జింబాబ్వే 31 పరుగుల తే డాతో గెలుపొంది, నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశాన్ని సజీవంగా నిలబెట్టుకుంది. టాస్ గెలిచిన ఈ జట్టు బ్యాటింగ్ ఎంచుకొని, 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయ 187 పరుగులు చే సింది. మాల్కం వాలర్ 49, సిన్ విలియమ్స్ 32, ఉ సి సిబాండ 44 పరుగులు చేసి జింబాబ్వేను ఆదు కున్నారు.

01/21/2016 - 06:54

మొహాలీ, జనవరి 20: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో జేపి పంజాబ్ వారియర్స్‌పై ఢిల్లీ వేవ్‌రైడర్స్ జట్టు 5-4 తేడాతో గెలిచింది. రూపీందర్ పాల్ సింగ్ రెండు గోల్స్ చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి వరకూ ఉత్కంఠ రేపిన ఈ పోరు ప్రేక్షకులను అలరించింది. మ్యాచ్ తొమ్మిదో నిమిషంలోనే యువరాజ్ వాల్మీకి గోల్ చేసి ఢిల్లీని ఆధిక్యంలో నిలబెట్టాడు.

Pages