S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2016 - 13:24

సికింద్రాబాద్: దొంగచాటుగా రేషన్‌ సరుకులను దారి మళ్లిస్తున్న 26 మంది ముఠా ను టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్నవారిలో డీలర్లు, బ్రోకర్లు, మిల్లర్లు ఉన్నారు. 362 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం, 500 క్వింటాళ్ల గోదుమలు, 630 లీటర్ల కిరోసిన్‌, రెండు ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు.

01/21/2016 - 13:24

మచిలీపట్నం : జిల్లా గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని సంస్థ చైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య అన్నారు. స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని చైర్మన్ ఛాంబర్‌లో బుధవారం ఆయన విలేక్షర్ల సమావేశంలో మాట్లాడారు. గ్రంథాలయాలను అందరూ సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా రాజకీయ వేత్తలు, ప్రజాప్రతినిధులు, సాహితీవేత్తల సమన్వయంతో కృషి చేస్తానన్నారు.

01/21/2016 - 13:24

కైకలూరు : కైకలూరు నియోజకవర్గంలో క్యాట్‌ఫిష్ అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఇటీవల స్వయంగా రాష్టమ్రంత్రి కామినేని శ్రీనివాస్ క్యాట్‌ఫిష్ రవాణాపై ఉపేక్షించవద్దు, క్యాట్‌ఫిష్‌ను రవాణా చేసే వారు ఎంతటి వారైనా సరే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులు, రెవిన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసి క్యాట్‌ఫిష్‌ను సాగుచేసే వారిని హెచ్చరించినా మార్పు రావడం లేదు.

01/21/2016 - 13:23

మచిలీపట్నం : అంగన్‌వాడీ కేంద్రాలను ఆకర్షణీయమైన ఆటపాటల కేంద్రాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పనితీరు, తదితర అంశాలపై ఐసిడిఎస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

01/21/2016 - 13:23

విజయవాడ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. 125ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మాది అని ఘనంగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర విభజనలో బొక్కబోర్లా పడి రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిందన్నారు.

01/21/2016 - 13:16

గుంటూరు: ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న 600 మంది ప్రభుత్వ డాక్టర్లకు నోటీసులు జారీ చేసినట్లు మంత్రి కామినేని వెల్లడించారు. పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత వాస్తవమేనని మంత్రి అంగీకరించారు.వెయ్యి మంది నర్సులు, 500 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తామని మంత్రి కామినేని వివరించారు.

01/21/2016 - 13:11

న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో చలి మరింత పెరిగిపోతోంది. దట్టమైన పొగమంచు కారణంగా అక్కడ 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. పగటిపూట అధికంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, ఉదయం వేళల్లో అత్యల్పంగా 6.9 డిగ్రీలే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

01/21/2016 - 13:06

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. విశాఖ ఏజెన్సీలోని పాడేరులో 12 డిగ్రీలు.... అలాగే మినుములూరులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.

01/21/2016 - 13:02

అహ్మదాబాద్ :ప్రఖ్యాత భరత నాట్య కళాకారిణి, పద్మభూషణ్ మృణాళిని సారాభాయి(97) కన్ను మూశారు. గురువారం ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో మరణించారని కుమార్తె మల్లికా సారాబాయి ఫేస్ బుక్పేజీలో వెల్లడించారు. భారత అంతరిక్షపితామహుడు విక్రం సారాబాయిని మృణాళిని 1942లో వివాహం చేసుకున్నారు. నృత్యకారిణిగానే కాకుండా మంచి రచయిత్రి, కవయిత్రిగా కూడా మృణాళిని గుర్తింపు పొందారు.

01/21/2016 - 12:54

గుజరాత్‌: పాఠశాల బస్సుబోల్తా పడి ఆరుగురు మృతి చెందిన ఘటన గుజరాత్‌ రాష్ట్రంలోని కేషోడ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 20మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Pages