S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2016 - 06:29

న్యూఢిల్లీ, జనవరి 20: బహుళ వ్యాపార దిగ్గజం ఐటిసి గ్రూప్‌నకు చెందిన ఇన్‌స్టంట్ నూడుల్స్ బ్రాండ్ ఇప్పీ.. వెయ్యి కోట్ల బ్రాండ్‌కు కూతవేటు దూరంలో ఉంది. దేశీయ మార్కెట్‌లో ప్రధాన ప్రత్యర్థి అయిన నెస్లే మ్యాగీపై నిషేధమే ఇప్పీ బ్రాండ్ విలువ పుంజుకోవడానికి ప్రధాన కారణం. మ్యాగీ వివాదంతో మార్కెట్‌లో ఇప్పీ అమ్మకాలు గణనీయంగా పెరగడంతో దాని మార్కెట్ విలువ కూడా ఎగిసింది.

01/21/2016 - 07:45

ముంబయి, జనవరి 20: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 2,175 కోట్ల రూపాయల నికర లాభాన్ని అందుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్‌తో పోల్చితే ఇది 15 శాతం అధికం. పోయినసారి 1,900 కోట్ల రూపాయల నికర లాభాన్ని బ్యాంక్ నమోదు చేసింది.

01/21/2016 - 06:25

హైదరాబాద్, జనవరి 20: ప్రముఖ విదేశీ ఆటోరంగ సంస్థ ఫోర్డ్.. హైదరాబాద్‌లో బుధవారం తమ కొత్త కారును ఆవిష్కరించింది. సరికొత్త ఎండీవర్ ఎస్‌యువి కారును పరిచయం చేసింది. రెండు రకాల శక్తివంతమైన, ఇంధన పొదుపు సామర్థ్యం కలిగిన ఇంజిన్లతో ఎండీవర్‌ను డిజైన్ చేసినట్లు ఈ సందర్భంగా ఫోర్డ్ తెలియజేసింది. 2.2 లీటర్, 3.2 లీటర్ ఇంజిన్లతో ఇవి అందుబాటులో ఉంటాయని వివరించింది.

01/21/2016 - 08:12

రాజమహేంద్రవరం, జనవరి 20: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ దిగ్గజం ఒఎన్‌జిసి.. రాజమహేంద్రవరం పరిసరాల్లోగల చమురు, సహజవాయువు నిక్షేపాలను కనుగొనడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. కొత్త నిక్షేపాలను కనుగొనడానికి ప్రస్తుతం జరుగుతున్న అనే్వషణ కార్యక్రమాల్లో వేగం పెంచేందుకు ఇప్పుడున్న ఏర్పాట్లను రెట్టింపు చేయాలని ఒఎన్‌జిసి భావిస్తోంది.

01/21/2016 - 06:22

హైదరాబాద్, జనవరి 20: సింగరేణి ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు సింగరేణిలోని అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ సిఎండి ఎన్ శ్రీధర్ తెలిపారు. ఒక్కో ప్రాంతంలో రెండు రోజులపాటు మేళా జరుగుతుందని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

01/21/2016 - 06:21

ముంబయి, జనవరి 20: ప్రపంచ వృద్ధిరేటుపై నెలకొన్న ఆందోళనలు బుధవారం భారతీయ స్టాక్ మార్కెట్లను భారీ నష్టాలకు గురిచేశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ ఉదయం ప్రారంభం నుంచే నష్టాల్లో కదలాడాయి. చివరిదాకా ఇదే తీరు కొనసాగగా, ఒకానొక దశలో సెనె్సక్స్ దాదాపు 650 పాయింట్లు, నిఫ్టీ సుమారు 200 పాయింట్లు క్షీణించాయి.

01/21/2016 - 06:12

న్యూఢిల్లీ, జనవరి 20: బిజెపి తాత్కాలిక అధ్యక్షుడు అమిత్ షా ఈ నెలాఖరుకు పూర్తిస్థాయి అధ్యక్షుడుగా ఎన్నిక కానున్నారు. బిజెపి అధ్యక్ష పదవి చేపట్టేందుకు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నిరాకరించటంతో అమిత్ షా పార్టీ అధ్యక్షుడుగా ఎన్నిక కావటం దాదాపుగా ఖాయమైపోయింది.

01/21/2016 - 07:48

పెషావర్, జనవరి 20: ఉగ్రవాదులనుంచి తన విద్యార్థులను కాపాడుకోవడానికి తన ప్రాణాలనే పణంగా పెట్టిన ఓ అధ్యాపకుడి వీరగాథ ఇది.

01/21/2016 - 06:11

న్యూఢిల్లీ, జనవరి 20: ఉత్తరాఖండ్‌లో నలుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టుతో హరిద్వార్‌లో జరిగే అర్ధ్ కుంభమేళా సందర్భంగా దాడులకు పాల్పడాలన్న ఉగ్రవాదుల కుట్ర బయటపడిందని ఢిల్లీ పోలీసులు బుధవారం చెప్పారు. అర్ధ్ కుంభమేళా సందర్భంగా హరిద్వార్ వైపు వెళ్తున్న రైళ్లపై, దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని వ్యూహాత్మక ప్రదేశాలపై దాడులకు పాల్పడాలని ఉగ్రవాదులు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు.

01/21/2016 - 06:09

లండన్, జనవరి 20: గత నవంబర్‌లో సిరియా పట్టణం రక్కాపై అమెరికా నేతృత్వంలో జరిగిన డ్రోన్ దాడిలో ‘జిహాదీ జాన్’గా పిలవబడే బ్రిటన్‌కు చెందిన ముసుగు మిలిటెంట్ చనిపోయినట్లు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంటు గ్రూపు ధ్రువీకరించింది. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపు విడుదల చేసిన పలువురు పాశ్చాత్య బందీల శిరచ్ఛేదం వీడియోలలో మసుగు ధరించి ఉన్న ఓ టెర్రరిస్టు వారి శిరచ్ఛేదంను అమలు చేస్తూ కనిపించేవాడు.

Pages