S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2016 - 16:29

న్యూఢిల్లీ : బీజేపీ పాలనలో దేశంలో దళితులకు భద్రత లేకుండా పోయిందని ఆప్‌ నేత అశుతోష్‌ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందుత్వ వాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించి తీరాలని అన్నారు.

01/21/2016 - 16:28

ముంబయి: రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ ముంబయిలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) గురువారం ర్యాలీ నిర్వహించింది. బీజేపీ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పని చేస్తోందంటూ మండిపడింది. కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయలు తమ పదవులకు రాజీనామా చేయాలంటూ ఎన్‌సీపీ డిమాండ్‌ చేసింది.

01/21/2016 - 16:24

ఢిల్లీ ‌:దేశ రాజధాని ఢిల్లీలో మయూర్‌ విహార్‌ ప్రాంతంలో గురువారం ఓ వ్యక్తి రిక్షాలో సూట్‌కేస్‌ వదిలి పారిపోయాడు. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తంగా ఉన్న సంగతి తెలిసిందే. పోలీసులు రిక్షాను చుట్టుముట్టి సూట్‌కేస్‌ తెరిచి చూసి నిర్ఘాంతపోయారు. అందులో ఓ మహిళ మృతదేహం ఉంది.

01/21/2016 - 16:05

చెన్నై: సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు క్రీడపై విధించిన నిషేధంపై ఈరోజు తమిళనాడు అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని, సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ప్రశ్నోత్తరాల తర్వాత కూడా డీఎంకే జల్లికట్టుపై చర్చించేందుకు స్పీకర్‌ను అనుమతి కోరగా.. స్పీకర్‌ అనుమతించలేదు.

01/21/2016 - 15:58

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఉపసంహరణ తర్వాత ఇండిపెండెంట్‌లతోపాటు వివిధ పార్టీలకు చెందిన 1,939 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 604 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇవాళ సాయంత్రంకల్లా అభ్యర్థుల తుది జాబితా వెలువడనుంది.

01/21/2016 - 15:53

హైదరాబాద్: హెచ్‌సీయూలో నలుగురు పీహెచ్‌డీ విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.ప్రశాంత్, శేషయ్య, విజయ్‌, సుంకన్న విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.

01/21/2016 - 15:48

కోల్ కతా: సుభాష్ చంద్రబోస్ అన్న కుమారుడు, మాజీ ఎంపీ సుబ్రతా బోస్ మృతి చెందారు. దక్షిణ కోల్ కతాలోని తన నివాసంలో సుబ్రతా బోస్ గతరాత్రి గుండెపోటుతో మరణించినట్లు సన్నిహితులు వెల్లడించారు. సుబ్రతా బోస్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ ఎంపీగా ఆయన 2004 నుంచి 2009 వరకూ పని చేశారు.

01/21/2016 - 14:02

హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థులను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతు రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామి ఇచ్చారు. దేశం మొత్తం మీ వెంటే ఉందని రోహిత్ కుటుంబానికి దైర్యం చెప్పారు.

01/21/2016 - 13:29

బెంగళూరు : ఐబీఎంలో ఉద్యోగం చేస్తున్న కుసుమ్‌ సింగ్లా(31) దారుణ హత్యకు గురైన సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. కుసుమ్‌ బెంగళూరులోని ఓ ఫ్లాట్‌లో మరో మహిళతో కలిసి నివసిస్తోంది.

01/21/2016 - 13:25

విజయవాడ : రాష్టస్థ్రాయి గణతంత్ర దినోత్సవాలలో రాష్టస్థ్రాయి ప్రగతిని తెలిపే 8 శకతాలు ప్రదర్శించేందుకు నిర్ణయించడం జరిగిందని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన గణతంత్ర దినోత్సవాల సమావేశంలో ఇప్పటివరకు ఆయా శాఖలు చేపట్టిన పనులను ఆయన సమీక్షించారు.

Pages