S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2016 - 06:07

వాషింగ్టన్, జనవరి 20: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు మరో దెబ్బ తగిలింది. అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటికే ఎంతో ఆర్థిక నష్టాన్ని చవిచూసిన ఐసిస్ మంగళవారం అర్ధరాత్రి జరిగిన వైమానిక దాడుల్లో 45 మిలియన్ అమెరికా డాలర్ల నగదు ధ్వంసమైంది. ఇంతటి భారీ నష్టం ఎదురుకావడం వారంలో ఇది రెండోసారి. ఈ నెల 10న జరిగిన వైమానిక దాడుల్లో 90 మిలియన్ డాలర్లను అమెరికా ఫైటర్లు ధ్వంసం చేయగలిగారు.

01/21/2016 - 06:07

ఉపగ్రహ ఉపయోగాలు
నావిగేషన్ సర్వీస్ సిగ్నల్స్‌ను వేగంగా అందిస్తుంది.
రేంజింగ్ పేలోడ్స్‌లో సీ బ్యాండ్ ట్రాన్సుపాండర్స్, రెట్రోరిఫ్లెక్షన్ లేజర్ రేజింగ్ అనే పరికరాలు పనిచేస్తాయి.
ఈ సాంకేతిక పరికరాలన్ని భారత్‌కు దిక్సూచి వ్యవస్థలను అందిస్తాయి.

01/21/2016 - 06:02

న్యూఢిల్లీ, జనవరి 20: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ పిహెచ్.డి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యను దళిత, దళితేతర వివాదంగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. బుధవారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గెహ్లాట్, సాంప్లాలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

01/21/2016 - 05:51

సంగారెడ్డి/ వరంగల్, జనవరి 20: దేశానికే ఆదర్శవంతంగా నిలిచేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు కాదు...బుల్లెట్ రైలులా శరవేగంతో దూసుకుపోతున్నాయని, అధికార యంత్రాంగం ఎంతో శ్రమిస్తోందని, మరింత ఒత్తిడి తీసుకువచ్చి నిర్ణిత కాల వ్యవధి నాటికి ఇంటింటికి నల్లా నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన

01/21/2016 - 05:47

హైదరాబాద్, జనవరి 20: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణకు గురువారం (21న) గడువు ముగియనున్నది. నామినేన్లు దాఖలు చేసేందుకు గడువు ముగిసి నాలుగు రోజులైనా అభ్యర్థులు ‘బి-్ఫరం’ దాఖలు చేసేందుకు నామినేషన్ల ఉపసంహరణ తేదీ వరకూ గడువు ఉండడంతో పార్టీల నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులకు మరి కొంత గడువు దక్కినట్లు అయ్యింది.

01/21/2016 - 07:35

హైదరాబాద్, జనవరి 20: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన వేముల రోహిత్ కుల వివాదంపై వాస్తవాల పరిశీలనకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నేరుగా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోహిత్ ఎస్సీ కులానికి చెందిన వారేనా? కాదా?

01/21/2016 - 05:34

పెషావర్, జనవరి 20: పాకిస్తాన్‌లో కల్లోలిత ఖైబర్-్ఫక్తూన్‌ఖ్వా రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక బచాఖాన్ యూనివర్సిటీపై బుధవారం భారీ ఆయుధాలు ధరించిన తాలిబన్ ఆత్మాహుతి బాంబర్లు దాడి చేసి తరగతి గదులు, హాస్టళ్లలోని విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో కనీసం 25 మంది చనిపోగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు.

01/21/2016 - 05:32

హైదరాబాద్, జనవరి 20: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యంత అధునాతన ప్రపంచ శ్రేణి రాజధానిగా నిర్మిస్తున్నామని, పెట్టుబడులతో వచ్చి కార్యాలయాలను ప్రారంభించాలని ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.

01/21/2016 - 05:29

దోస్నా/ రోరి/ మీరట్, జనవరి 20: ఇస్లామిక్ సైద్ధాంతిక పునాదులతో ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్న ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ ఐసిస్‌ను ఢీకొనేందుకు ధర్మసేన పేరిట ఓ సాయుధ బలగం సన్నద్ధమవుతోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ సరిహద్దు వరకూ హిందూ స్వాభిమాన్ పేరుతో ధర్మసేన శిక్షణా శిబిరాలు ఆవిర్భవించాయి.

01/21/2016 - 05:27

హైదరాబాద్, జనవరి 20: ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు దావోస్ పర్యటన సత్ఫలితాలిస్తోంది. అనేక మంది పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉత్సాహాన్ని చూపించడం రాష్ట్ర బృందానికి మంచి ఊపునిస్తోంది. సిఎం చంద్రబాబు రాష్ట్రం కోసం వినత్న రీతిలో ప్రచారం చేయడం కూడా సత్ఫలితాలిస్తోంది.

Pages