S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2016 - 05:10

మేడ్చల్, జనవరి 20: రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి కుళాయిల ద్వారా తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పధకం (వాటర్‌గ్రిడ్) పనుల పురోగతిని బుధవారం రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పరిశీలించారు. హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2-30 గంటల ప్రాంతంలో పట్టణ శివారులోని సిఎంఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యారు.

01/21/2016 - 05:05

జీడిమెట్ల, జనవరి 20: యువత టిడిపి అభ్యర్థులను గెలిపించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ సూచించారు. బుధవారం కుత్బుల్లాపూర్ గ్రామంలో రంగారెడ్డినగర్ డివిజన్ నుండి పెద్దసంఖ్యలో యువకులు టిడిపి పార్టీలో చేరారు. డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి మోటె శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వివేక్ యువకులకు పార్టీ కండువాలను వేసి ఆహ్వానించారు.

01/21/2016 - 04:58

గచ్చిబౌలి, జనవరి 20: నగరంలోని కాలనీలలోని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు హామీనిచ్చారు. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ కాలనీతోపాటు కోర్టు వివాదంలో వున్న 9 కాలనీలకు చెందిన కాలనీవాసులు టిఆర్‌ఎస్ నాయకుడు వాసు ఆధ్వర్యంలో సిఎం క్యాంప్ ఆఫీసులో మంత్రి కెటిఆర్‌ని కలిసారు.

01/21/2016 - 04:56

శేరిలింగంపల్లి, జనవరి 20: శేరిలింగంపల్లి తెలుగుదేశం పార్టీలో బుధవారం హైడ్రామా నెలకొంది. తీవ్ర ఉత్కంఠ మధ్య నిరసనలు, అసంతృప్తి, ఆగ్రహావేశాలు వెలువడ్డాయి. చందానగర్‌లో మాజీ కార్పొరేటర్ పి.అశోక్‌గౌడ్ నివాసంలో డివిజన్ ఇంచార్జి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో ఆశావహులతో సమావేశం నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ కె.సునితారెడ్డి, జిల్లా నాయకుడు బి.వి.రమణగౌడ్, డివిజన్ అధ్యక్షుడు ఉరిటి వెంకట్రావుతో మంతనాలు జరిపారు.

01/21/2016 - 04:52

గచ్చిబౌలి, జనవరి 20: దళితుడు పిహెచ్‌డి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యతో చెలరేగిన నిరసనలు యూనివర్సిటీలో ఇంకా చల్లారలేదు. రోహిత్ వేముల మృతికి నిరసన తెలియచేయడంతో పాటు బహిష్కరణకు గురైన విద్యార్థులకు మద్ధతు తెలిపేందుకు నేతలు వరుసకట్టారు. బహిష్కరణను ఉపసంహరించుకొనాలని విద్యార్థులు నిరవధిక నిరసనకు దిగారు. మూడోరోజు కూడా విద్యార్థులు క్లాసులు, ఉద్యోగులు విధులు బహిష్కరించారు.

01/21/2016 - 04:47

రాజేంద్రనగర్, జనవరి 20: భారతదేశంలోనే గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్‌దేనని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బాబుల్‌రెడ్డినగర్ సమీపంలోని గ్రాండ్ ఫంక్షన్‌హాల్లో బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు.

01/21/2016 - 04:46

నార్సింగి, జనవరి 20: గత పాలకుల పాలనలో చేసిన అభివృద్ధిని టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం ఐదేళ్లలో చేసి చూపెడుతుందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. గుడిమల్కాపూర్‌లో బుధవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. యాదవ్ భవన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గతంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు.. ఈసారి టిఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు.

01/21/2016 - 04:43

రాజేంద్రనగర్, జనవరి 20: మైనారిటీ ముస్లింలను మభ్యపెడుతూ ఎన్నికల్లో గెలుపొందుతున్న ఎంఐఎంకి తగిన బుద్ధి చెప్పాలని రంగారెడ్డి జిల్లా తెదేపా అధ్యక్షుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. బుధవారం శాస్ర్తిపురం, సులేమాన్‌నగర్ డివిజన్లలో టిడిపి అభ్యర్థులకు మద్దతుగా ఆయా బస్తీల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ముందుగా దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

01/21/2016 - 04:24

‘కంచెలో కన్నాల’ గురించిన సంపాదకీయం బాగుంది. బ్రిటిష్‌వారు కుటిలనీతిని ప్రయోగించి, చరి త్రను వక్రీకరించి దేశాన్ని ద్వేషించడమే నాగరికత అన్న స్థాయలో కానె్వంట్లలో పాఠాలు చెప్పించారు. అందువల్ల ప్రజలకు దేశభక్తి పనికిరాని పదార్థమైపోయం ది. అయ్యర్ లాంటి వారు పాక్‌కు వెళ్లి మోదీని దించేస్తే కాని శాంతి చర్చలు జరుగవని ప్రకటించడం దారుణం. మరో దేశంలో అయతే దేశద్రోహం కింద అయ్యర్‌ను జైల్లో పెట్టి ఉండేవారు.

01/21/2016 - 04:21

తెలంగాణా ముఖ్యమంత్రిగారు ముస్లింలకు ప్రభుతోద్యోగాల్లో, ఇతర సంస్థల్లో 12 శాతం రిజర్వేషన్ కల్పించ నిర్ణయించామంటున్నారు. ఇది సహేతుకం కాదు. తెలంగాణాను ముస్లింలు 600 ఏళ్లకు పైగా, 1948 సెప్టెంబర్ వరకు పాలించారు, అన్ని భోగాలూ, విశేషాధికారాలూ, సంపదలూ అనుభవించారు. భాష, ఉద్యోగాధిపత్యాలు వారివే. అప్పటివరకు అణగత్రొక్కబడ్డ హిందువులతో పోలిస్తే ఎలా వెనుకబడ్డారు?

Pages