S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2016 - 13:11

బిహార్‌‌: బిహార్‌ రాష్ట్రంలో ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు కేబినెట్‌ అంగీకరించింది. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై నిర్ణయం తీసకున్నట్లు సీఎం కార్యాలయ అధికారులు వెల్లడించారు.

01/20/2016 - 13:10

విశాఖపట్నం: దక్షిణ మధ్యప్రదేశ్‌ నుంచి కర్ణాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధవారం తెలంగాణ, రాయలసీమ, కోస్తాలో ఒకటి, రెండు చోట్ల వానలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ మధ్యప్రదేశ్‌లో రెండు రోజుల కిందట ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రాంతం నుంచి ద్రోణి కర్ణాటక వరకు ఉన్నట్లు వెల్లడించింది.

01/20/2016 - 11:45

హైదరాబాద్: పాతబస్తీలోని కిషన్ బాగ్, అసద్ బాబా నగర్ ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించి, మయన్మార్, సౌదీకి చెందిన 15 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పాస్‌పోర్టు లేకుండా వీరు ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటూ వివాహాలు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అఫీజ్ బాబానగర్ ప్రాంతంలో మరో 60 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

01/20/2016 - 11:45

హైదరాబాద్:: నాగోల్ ప్రాంతంలో ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులకు చెందిన రెండు ఎటిఎంలను బుధవారం ఉదయం మంటల్లో దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

01/20/2016 - 11:44

గుంటూరు: తెనాలి పట్టణంలో సాయిబాబా ఎంటర్‌ప్రైజెస్ యజమాని జి.వెంకట సతీష్‌కుమార్ మంగళవారం అర్ధరాత్రి తన దుకాణంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు.

01/20/2016 - 11:44

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామ జిల్లా నయినాబాద్‌పురి ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం ఉదయం ఇద్దరు ఉగ్రవాదులు ఓ ఇంట్లో చొరబడి దాక్కున్నట్లు పోలీసులు పసిగట్టారు. ఉభయ పక్షాల మధ్య కాల్పులు జరుగుతున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.

01/20/2016 - 11:43

నిజామాబాద్: భార్యపై అనుమానం పెంచుకొన్న ఓ భర్త తన ఇద్దరు పిల్లలను నేలకేసి కొట్టిన ఘటన నందిపేట మండలం తల్వెదలో బుధవారం జరిగింది. ఈ ఘటనలో బాలుడు మరణించగా, తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించారు.

01/20/2016 - 11:43

హైదరాబాద్: రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య అనంతరం హెచ్‌సియు లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతు పలికేందుకు యు.పి. మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ అధినేత్రి మాయావతి, సిపిఎం నేత సీతారాం ఏచూరి, లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ తదితరులు నేడు వర్సిటీకి వస్తున్నారు. దిల్లీ సిఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఇక్కడికి వస్తారని సమాచారం.

01/20/2016 - 11:43

గుంటూరు: ఇక్కడి హనుమయ్య నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆరు బైక్‌లను దగ్ధం చేశారు. ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న విద్యార్థులు తమ బైక్‌లను చెట్టు కింద నిలిపి ఉంచగా, ఆగంతకులు వాటికి నిప్పంటించారు.

01/20/2016 - 14:12

కరాచి: వాయవ్య పాకిస్తాన్‌లోని బచాఖాన్ యూనివర్సిటీలో బుధవారం ఉదయం సాయుధులైన ఉగ్రవాదులు చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. విద్యార్థులు, అధ్యాపకులపై వారు కాల్పులు జరిపినట్లు, ఈ ఘటనలో ఘటనలో మృతుల సంఖ్య 70కి పెరిగింది. ఆరుగురు ఉగ్రవాదులను పాక్‌ సైనికులు హతమార్చారు. మరికొంతమంది వర్సిటీలోనే ఉంటూ దాడులు చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ 11 చోట్ల బాంబు దాడులు చేశారు.

Pages