S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2016 - 16:42

ఢిల్లీ :ఢిల్లీ సెల్ ప్రత్యేక పోలీసులు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతోసంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. గణతంత్ర వేడుకలు సమీపిస్తుండటంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీతో పాటు శివారు ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

01/20/2016 - 16:41

హైదరాబాద్ : హెచ్‌యూసీ పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనలో కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, దత్తాత్రేయలతో పాటు వీసీపై చర్య తీసుకోవాలని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. హెచ్‌యూసీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఆయన బుధవారం పరామర్శించి సంఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని, మిగిలిన విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

01/20/2016 - 16:40

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ మృతిపై ఆందోళన చేస్తున్న విద్యార్థులను సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఒత్తిడితో వీసీ తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, దత్తాత్రేయ, వీసీ అప్పారావులే విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారణమని ఆయన అన్నారు.

01/20/2016 - 13:57

కడప ‌:అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పెద్దముడిగం, జమ్మలమడుగు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. ప్రొద్దుటూరు, మద్దనూరు మండలాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో జొన్న, వేరుశనగ పంటలు నీటమునిగాయి.

01/20/2016 - 13:51

గుంటూరు ‌: గుంటూరు జిల్లా రెంటచింతల మండలం పసర్లపూడికి చెందిన తొమ్మిది నెలల బాలుడు ఏసుబాబు అదృశ్యం కలకలం రేపుతోంది. వైద్యం చేయించేందుకు మంగళవారం అతని అమ్మమ్మ దగ్గుబాటా హుసేనమ్మ ఆసుపత్రికి తీసుకొచ్చి పిల్లల వార్డులో చేర్పించింది. బుధవారం ఉదయం అల్పాహారం తీసుకొచ్చేందుకు బయటికి వెళ్తూ... తన మనవడిని చూస్తూ ఉండమని మరో మహిళకు అప్పగించి బయటకు వెళ్లింది.

01/20/2016 - 13:36

ఢిల్లీ‌‌: పీఎస్‌ఎల్వీసీ- సీ31ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రదాని నరేంద్ర మోదీ అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

01/20/2016 - 13:31

ఢిల్లీ‌: భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకి ఉత్తరప్రదేశ్‌ పోలీసులు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్‌షా ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. అయితే.. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ప్రకటించారు.

01/20/2016 - 13:24

హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై రెండవ రోజున రాంనగర్‌లోని కేంద్రమంత్రి దత్తాత్రేయ ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. ఈ ఉదయం ఏఐఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు దత్తాత్రేయ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

01/20/2016 - 13:18

హైదరాబాద్: బంజారా హిల్స్ రోడ్ నంబరు 12లోని భవానీనగర్ శ్రీ కనకదుర్గా టెంపుల్ వెనుక వైపు నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం బుధవారం ఉదయం అకస్మాత్తుగా కొద్దిభాగం భూమిలోకి కుంగింది. దీంతో భవనంలో పని చేస్తున్న కూలీలు, చుట్టుపక్కల స్థానికులు భయంతో పరుగులు తీశారు. సంఘటన స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

01/20/2016 - 13:14

గజ్వేల్: మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలో గుట్టపై నిర్మిస్తున్న ఓవర్‌హెడ్ ట్యాంకు, వాటర్ గ్రిడ్ పథకం పనులను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ పథకం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Pages