S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2016 - 22:08

విజయనగరం, జనవరి 19: జిల్లాలో అడవుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఎంఎం నాయక్ సూచించారు. అటవీ సంరక్షణ, వనసంరక్షణపై అటవీశాఖ అధికారులతో కలెక్టర్ నాయక్ తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అటవీసంపద తరలిపోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, బిట్ అధికారులతో పర్యవేక్షణ జరపాలని, చెక్ పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు.

01/20/2016 - 22:06

విశాఖపట్నం, జనవరి 19: సాగరతీరం కోతను నివారించే చర్యలను వేగవంతం చేయాలని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ కోరారు. నెదర్లాండ్స్‌కు చెందిన డెల్టారేస్ సంస్థ ఇప్పటికే కొంతకాలంగా అధ్యయనం చేసి రూపొందించిన నివేదకను సమీక్షించాల్సిందిగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటి)ను కోరారు. డెల్టారేస్, ఎన్‌ఐఓటి ప్రతినిధులతో కమిషనర్ మంగళవారం సమావేశమై నివేదికపై సమీక్షించారు.

01/20/2016 - 22:04

విజయవాడ, జనవరి 19: రాజధాని మాస్టర్ ప్లాన్‌పై సిఆర్‌డిఎ ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరపాలని, వ్యవసాయ పరిరక్షణ జోన్‌లను సమూలంగా మార్చాలని సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్‌ను తెలుగులో ప్రచురించి అందించాలని కోరింది. ఈ నెల 21న అన్ని ప్రజా సంఘాల, రాజకీయ నాయకులు కలిసి సిఆర్‌డిఎ కమిషనర్‌కు వినతిపత్రం అందజేయాలని సమావేశం తీర్మానించింది.

01/20/2016 - 22:02

శ్రీకాకుళం(కల్చరల్), జనవరి 19: వచ్చేనెల 8న మహోదయం సముద్ర స్నానాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

01/20/2016 - 22:00

మార్కాపురం, జనవరి 19: నల్లమల అటవీప్రాంతం నాటుసారా తయారీదారులకు, కలప స్మగ్లర్లకు, మూగజీవాల వేటగాళ్లకు నిలయంగా మారింది. ఇటీవల పులిచర్మాలను పట్టుకోగా తాజాగా ఏకంగా చిరుతపులిని వేటాడి చర్మం వలిచి కళేబరాన్ని కాల్చివేసిన సంఘటన కలకలం రేపింది. ప్రకాశం, మహబూబ్‌నగర్, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతం అరాచకాలకు అడ్డాగా మారడంతో ఫారెస్టు అధికారులకు కంటిపై కునుకులేకుండా పోయింది.

01/20/2016 - 21:58

సూళ్లూరుపేట, జనవరి 19: శ్రీహరికోటలోని షార్‌లో బుధవారం పిఎస్‌ఎల్‌వి-సి 31 రాకెట్ ప్రయోగం దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. షార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిఐఎస్‌ఎఫ్ బలగలాలు, సముద్ర మార్గాన కోస్టల్ గార్డ్సుచే జల్లెడ పట్టి గాలిస్తున్నారు. షార్ మొదటి గేటు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపుతున్నారు.

01/20/2016 - 21:54

కర్నూలు, జనవరి 19:కరవు బారిన పడిన అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్న ఆరోపణలు అధికమవుతున్నాయి. కరవు పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులతో నివేదికలు తెప్పించుకున్నా నష్టపరిహారం అందడంలో మాత్రం తీవ్ర జాప్యం నెలకొంటోంది. దీంతో రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన సాయం సకాలంలో అందక మరిన్ని కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.

01/20/2016 - 21:25

హైదరాబాద్, జనవరి 19: ‘మహమూద్ మ్యాచింగ్ సెంటర్, బంగ్లాదేశ్’- తెలుగులో కొట్టొచ్చినట్టు కనిపించే ఈ బోర్డు కొత్తవారికి వింతగా అనిపించొచ్చు. బంగ్లాదేశ్‌నుంచి వచ్చి బట్టల కొట్టు పెట్టినంతమాత్రాన ఆ దేశం పేరు పెట్టుకోవడమేంటని ఒకింత కోపమూ రావచ్చు. కానీ ఇదొక్కటే కాదు...ఆ ప్రాంతంలో చాలా దుకాణాలకు ఇలాంటి పేర్లే ఉంటాయి. కానీ స్థానికులకు మాత్రం ఇదో మామూలు విషయం.

01/20/2016 - 21:24

గుంటూరు, జనవరి 19: పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే బడ్జెట్‌కు మించి 2 వేల కోట్ల రూపాయలు వెచ్చించి పనులు ప్రారంభించామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని దివంగత మల్లెల సత్యనారాయణ ప్రాంగణంలో జరుగుతున్న జాతీయస్థాయి ఎడ్ల బల ప్రదర్శన రెండవ రోజు కార్యక్రమానికి మంగళవారం ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

01/20/2016 - 21:16

కొత్తగూడెం, జనవరి 19: ఆదివాసీల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా పునుకుడుచెలక తదితర గ్రామాలు తుడిచిపెట్టుకుపోయే విధంగా నిర్మించాలని చూస్తున్న విమానాశ్రయ ఏర్పాటుపై తిరుగుబాటు చేయండని ఆదివాసీల పోరాటానికి సిపిఎం అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యలు అన్నారు.

Pages