S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2016 - 11:42

కాకినాడ: మాజీ ఎమ్మెల్యే సత్యలింగ నాయకర్ (80) తీవ్ర అనారోగ్యంతో ఇక్కడి పోరంగిలోని స్వగృహంలో బుధవారం మరణించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, బిసి కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయన సేవలందించారు. గురువారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

01/20/2016 - 11:41

హైదరాబాద్: రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య అనంతరం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నాలుగో రోజు బుధవారం బంద్ కొనసాగుతోంది. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు వర్సిటీకి తరలి వస్తున్నారు.

01/20/2016 - 11:41

నెల్లూరు: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం సరిగ్గా 9.31 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి-31 (పిఎస్‌ఎల్‌వి) వాహక నౌకను ఇస్రో శాస్తవ్రేత్తలు నింగిలోకి విజయవంతంగా పంపారు. ఈ ఏడాది ఇస్రో సాధించిన ఘన విజయం ఇది అని శాస్తవ్రేత్తలు అభివర్ణించారు.

01/20/2016 - 08:10

నల్లగొండ, జనవరి 19: సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన ఏజెంట్లను అరెస్టు చేయడం ద్వారా నల్లగొండ జిల్లా పోలీసులు మరో విజయం సాధించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కిడ్నీ రాకెట్ ఏజెంట్లను హాజరుపరిచి కేసు పురోగతి వివరాలను వెల్లడించారు.

01/20/2016 - 17:19

నెల్లూరు: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం సరిగ్గా 9.31 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి-31 (పిఎస్‌ఎల్‌వి) వాహక నౌకను ఇస్రో శాస్తవ్రేత్తలు నింగిలోకి విజయవంతంగా పంపారు. ఈ ఏడాది ఇస్రో సాధించిన ఘన విజయం ఇది అని శాస్తవ్రేత్తలు అభివర్ణించారు.

01/20/2016 - 07:45

జెరూసలెం, జనవరి 19: భారత ఆర్థిక వ్యవస్థతో అవధుల్లేని దీర్ఘకాలిక సంబంధాలను పెంపొందించుకోవాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఇజ్రాయెల్ వ్యాపార, వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ఇక్కడ ఉంటున్న భారతీయ సంతతిని ఉద్దేశించి మాట్లాడిన సుష్మా స్వరాజ్ దేశీయ భద్రత, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటికే ఇరు దేశాల సంబంధాలు పరిమితం కాకూడదని స్పష్టం చేశారు.

01/20/2016 - 07:43

పుణె/గాంధీనగర్, జనవరి 19: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన ఓ దళిత పరిశోధకుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం పుణె, గాంధీనగర్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అలజడి రేకెత్తించింది. ఆందోళనకారులను ఈ ఆత్మహత్యను సంస్థాగత హత్యగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

01/20/2016 - 07:41

కోక్రాజార్ (అసోం), జనవరి 19: గత పదిహేను సంవత్సరాలుగా అసోంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏ విధంగానూ అభివృద్ధి చేయలేకపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ప్రచార కార్యక్రమానికి మంగళవారం నాడిక్కడ శ్రీకారం చుట్టిన నరేంద్ర మోదీ అనేక కీలక ప్రకటనలు చేశారు.

01/20/2016 - 08:16

న్యూఢిల్లీ, జనవరి 19: సామరస్యపూర్వక సమాజ నిర్మాణానికి వీలుగా దేశ ప్రజల్లో లౌకిక భావనలను మరింతగా శక్తివంతం చేయాల్సిన అవసరం ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. మంగళవారం నాడిక్కడ ఉన్నత విద్యా సంస్థలు, సివిల్ సర్వీస్ సంస్థలను ఉద్దేశించి మాట్లాడిన ప్రణబ్ ముఖర్జీ దేశ యువతకు విలువ ఆధారిత విద్యను అందించడం ఎంతో అవసరమన్నారు.

01/20/2016 - 07:27

వాషింగ్టన్, జనవరి 19: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2015-16) గాను భారత జిడిపి వృద్ధిరేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) యథాతథంగానే ఉంచింది. ఇంతకుముందు వేసినట్లుగానే 7.3 శాతంగా ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) జిడిపి వృద్ధిని సైతం 7.5 శాతంగానే ఉంచింది. అయితే చైనా వృద్ధిరేటును మాత్రం ఈ ఏడాది 6.3 శాతంగా, వచ్చే ఏడాది 6 శాతంగా అంచనా వేసింది.

Pages