S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2016 - 21:07

మంగళగిరి, జనవరి 19: తమ గ్రామంలో రోడ్ల విస్తరణ పేరిట నివాస గృహాలను తొలగిస్తే సహించబోమని మంగళవారం మండల పరిధిలోని నవులూరు గ్రామస్థులు సిఆర్‌డిఎ అధికారుల ఎదుట ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు. నివాస గృహాల మధ్య రోడ్లు విస్తరించే ప్రతిపాదన ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

01/20/2016 - 21:04

గుంటూరు, జనవరి 14: రాష్ట్రప్రభుత్వం రాజధాని నిర్మాణాల కోసం శరవేగంగా ముందుకెళ్తున్న క్రమంలో మెట్టరైతులు గతంలో ఇచ్చిన ప్యాకేజీ కంటే అదనంగా 100 గజాల వాణిజ్యస్థలం ఇవ్వాలంటూ సిఆర్‌డిఎ అధికారుల ఎదుట ప్రతిపాదనలు చేస్తున్నారు. గ్రామకంఠాల జాబితా సిద్ధంచేసిన అధికారులు ప్రకటించే క్రమంలో గ్రామాల మధ్యగా రహదారులు వస్తున్నాయంటూ సర్వేనెంబర్లు వెల్లడించారు.

01/20/2016 - 21:02

రాయవరం, జనవరి 19: మండలంలోని వెదురుపాకలో హిందూ ధర్మ పరిరక్షణ వ్యాప్తికి సమరసత ఫౌండేషన్ ఏర్పాటుచేసినట్టు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఛైర్మన్ పివిఆర్‌కె ప్రసాద్ తెలిపారు. మంగళవారం మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠానికి వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులలో హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడంతోపాటు మత వ్యాప్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

01/20/2016 - 21:01

తిరుపతి, జనవరి 19 : హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీలో నెలకొన్న సాంఘిక అసమానతల కారణంగా రోహిత్ వేముల అనే దళితుడైన పరిశోధక విద్యార్థి ప్రాణాలను పొగొట్టుకున్నాడని, ఈ ఘటనకు బాధ్యులైన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, హెచ్‌సియు విసి అప్పారావును తక్షణం పదవి నుంచి తప్పించాలని తిరుపతి మాజీ ఎంపి చింతా మోహన్ డిమాండ్ చేశారు.

01/20/2016 - 20:58

కడప,జనవరి 19: కడప -బెంగుళూరు రైలు మార్గం పనులు అడుగుముందుకు మూడడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సిన సగభాగం నిధులు గత నాలుగేళ్లుగా విడుదల చేయని కారణంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. రూ.2వేల కోట్లు పైబడి వ్యయంతో ఈ రైల్వేలైనుకు ఏడేళ్లక్రితం శ్రీకారం చుట్టారు.

01/20/2016 - 20:55

నల్లమాడ, జనవరి 19: జిల్లాలో ఖరీఫ్‌లో సాగయ్యే పంటలతో రైతులు ఏదో ఒక విధంగా నష్టాలను చవిచూస్తూనే వున్నారు. రైతన్న కష్టానికి వర్షం తోడై పంట చేతికొస్తే అంతవరకూ మార్కెట్లో ఆకాశాన్నంటే ధరలు ఒక్కసారిగా దిగజారిపోయి రైతన్నలకు నష్టాలను చేకూర్చడం జిల్లాలో షరా మామూలుగా మారింది.

01/20/2016 - 18:58

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. మిషన్‌ భగీరథపై గవర్నర్‌తో చర్చించారు. ఈరోజు తెలంగాణలో మూడు జిల్లాల్లో పర్యటించిన గవర్నర్‌ మిషన్‌ భగీరథ పనులను పరిశీలించారు. పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కేసీఆర్‌ కలిశారు.

01/20/2016 - 16:51

ఢిల్లీ : భారత్ సంతతికి చెందిన వ్యక్తికి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు వరించింది. టిక్నికల్ అచీవ్‌మెంట్ విభాగంలో రాహుల్ థక్కర్ అనే భారత సంతతికి చెందిన వ్యక్తికి ఈ అవార్డు వచ్చింది. ఫిబ్రవరి 13న జరిగే వార్షిక సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అవార్డుల కార్యక్రమంలో రాహుల్ ఈ అవార్డును అందుకోనున్నారు.

01/20/2016 - 16:45

ఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. రోహిత్ మృతి ఘటనపై ఆమె వివరణ ఇస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించారు. వాస్తవాలు తెలుసుకోకుండా దళిత, దళితేతర మధ్య వివాదంగా కొంతమంది విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అన్నారు.

01/20/2016 - 16:43

ఢిల్లీ : ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఓ పోలీసు అధికారి కారు చోరీకి గురైంది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు విభాగంలో ఐజీగా పనిచేస్తున్న ఆనంద్ స్వరూప్ కారును దుండగులు అపహరించారు. ఇటీవల పఠాన్‌కోట దాడిలో ఉగ్రవాదులు పోలీసు కారును అపహరించి దాడికి పాల్పడిన విషయం విదితమే.

Pages