S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/14/2019 - 02:15

ఆదోని, మే 13: బొగ్గుల వ్యాపారి నుంచి రూ.16 వేలు లంచం తీసుకున్న కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ అటవీశాఖ అధికారి వెంకటసుబ్బుడును ఏసీబీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. మార్కాపురానికి చెందిన వ్యాపారి నాగార్జునరెడ్డి బొగ్గుల వ్యాపారానికి అనుమతి కోసం అటవీశాఖ అధికారి వెంకటసుబ్బుడును కలవగా ఆయన రూ.30 వేలు లంచం అడిగాడు. అయితే రూ.16 వేలు ఇచ్చేందుకు అంగీకరించిన నాగార్జునరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

05/14/2019 - 02:52

నర్సీపట్నం, మే 13: విశాఖ జిల్లా నర్సీపట్నంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుండి అక్రమంగా తరలిస్తున్న సుమారు 2,500 కిలోల గంజాయిని నర్సీపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో సహా లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

05/14/2019 - 02:15

ఇచ్ఛాపురం(రూరల్), మే 13: ఎండలు మండిపోతుండడంతో వేసవితాపానికి ఉపశమనం కోసం తమ ఇంటి సమీపంలో వున్న బాహుదా నదిలో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం మండలం, బిర్లంగి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తల్లులు, వారి పిల్లలు సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు బాహుదానదిలో జారి పడి మృతి చెందారు.

05/14/2019 - 01:10

న్యూఢిల్లీ: తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్ విచారణ జూలై ఎనిమిదో తేదీకి వాయిదా పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ అనుమతులనూ సవాల్ చేస్తూ హర్షవర్థన్ అనే వ్యక్తి దాఖలు చేసిన మద్యంతరం పిటిషన్‌ను జస్టిస్ రఘువేంద్ర. ఎస్ రాథోడ్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారణ జరిపింది.

05/14/2019 - 00:39

న్యూఢిల్లీ, మే 13: అర్హత పరీక్షలకు ఎలాంటి రిజర్వేషన్లు వర్తించబోవని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర టీచర్ అర్హత పరీక్ష (సీటెట్)లో పది శాతం రిజర్వేషన్ కల్పించాలన్న పిటిషన్‌ను విచారించిన అనంతరం పైవిధంగా సుప్రీం కోర్టు తెలియజేసింది.

05/13/2019 - 23:42

జీడిమెట్ల, మే 13: పని ఇచ్చిన షాపులోనే దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తి కటకటాల పాలైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. దుందిగల్ పీఎస్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో నిందితుని వివరాలను పేట్‌బషీరాబాద్ ఏసీపీ నర్సింహా రావు, డీఐ సంతోషమ్ వెల్లడించారు. బీ.శివ కుమార్ (22) సూరారం కాలనీ, కృషి కాలనీలో నివసిస్తూ కార్పెంటర్ పని చేస్తుంటాడు.

05/13/2019 - 23:42

హైదరాబాద్, మే 13: ఇంటికి అనుకొని ఉన్న ఓ భవనం మూడో అంతస్తు కూలిన ఘటనలో బాలుడు మృతిచెందిన సంఘటన మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్‌హాట్ డివిజన్‌లోని ధూల్‌పేట్ బడాబంగ్లా వద్ద ప్రైవేట్ ఉద్యోగి రాజు సింగ్, అతని భార్య జ్యోతి ఇద్దరు కుమారులు పంటు సింగ్, గోపాల్ సింగ్‌తో కలిసి రేకుల ఇంటో నివాసం ఉంటున్నారు.

05/13/2019 - 23:41

మెహిదీపట్నం, మే 13: ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని ఫర్నిచర్ గోదాము కాలి బూడిదైన సంఘటన టప్పాఛబుత్రా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం ఉదయం సుమారు పదిన్నర గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్‌తో ఫర్నిచర్ గోదాములో భారీ అగ్ని ప్రమాదంతో పెద్ద మొత్తంలోనే ఆస్తి నష్టం జరిగింది. సంఘటన స్థలానికి నాలుగు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

05/13/2019 - 23:41

ఉప్పల్, మే 13: షేర్ బిజినెస్‌లో నష్టం వచ్చిందని తీవ్ర మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథ నం రామంతాపూర్ శారదానగర్‌లో నివసిస్తున్న బీ.బసవ రాజు(45) షేర్ బిజినెస్ చేస్తున్నాడు. ఇటీవల కాలంలో వ్యాపారంలో నష్టం వచ్చి బాదలో ఉన్నాడు.

05/13/2019 - 23:40

జీడిమెట్ల, మే 13: ఏటీఎం సెంటర్‌లలో చోరీకి విఫలయత్నం చేసిన ఇద్దరు నిందితులను దుందిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దుందిగల్ పీఎస్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను పేట్‌బషీరాబాద్ ఏసీపీ నర్సింహా రావు, సీఐ వెంకటేశం వెల్లడించారు. సూరారం కాలనీ, భవానినగర్‌లో నివాసముండే ఎండీ షాకీర్ అలియాస్ షరీక్ (30) ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తాడు.

Pages