S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/08/2019 - 23:03

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత తేజస్వియాదవ్ పాట్నాలో అధికారికంగా కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు సమయాన్నివృధా చేసినందుకు రూ.50వేల జరిమానాను కూడా విధించారు. ఈ బంగ్లాను ఖాళీచేయాల్సిందిగా అంతకుముందు పాట్నా హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ తేజస్వి యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

02/08/2019 - 23:01

కోల్‌కొతా, ఫిబ్రవరి 8: సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులకు చెందినట్లుగా భావిస్తున్న ఆస్తులు, కంపెనీలపై స్థానిక పోలీసులు దాడులు చేపట్టడం సంచలనం కలిగిస్తోంది. మరో వైపు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యేందుకు కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ షిల్లాంగ్‌కు వెళ్లారు.

02/08/2019 - 23:00

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: అనుచితంగా జాతీయ స్టాక్ ఎక్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లోకి ప్రవేశించిన ఓ బ్రోకర్ కంపెనీపై సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొరడా ఝళిపించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ శుక్రవారం పార్లమెంట్‌లో ఈ విషయం వెల్లడించారు. ఇంటర్ అలియా అనే బ్రోకరేజి సంస్థపై ఈమేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ చట్ట పరిధిలో చర్యలు చేపట్టడం జరిగిందని మంత్రి వివరించారు.

02/08/2019 - 22:59

అగర్ మాల్వా (ఎంపీ), ఫిబ్రవరి 8: పశువులను రవాణా చేస్తూ శాంతికి విఘాతం కలిగిస్తున్నారన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లా అధికారులు ఇద్దరు వ్యక్తులను జాతీ య భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద అరెస్ట్ చేశా రు.

02/08/2019 - 22:56

బీజింగ్, ఫిబ్రవరి 8: చంద్రమాన ప్రకారం జరుపుకునే కొత్త సంవత్సర వేడుకల్లో చైనాలో తీవ్ర విషాదం నెలకొంది. రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు ఉన్మాదులు జరిపిన ఘాతుకంలో 15మంది మృతి చెందారు. రాత్రి అందరూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగి ఉండగా, లూసెట్ అనే వ్యక్తి షాంక్సిలోని ఉత్తర ప్రాంతంలోని బావోజి పట్టణంలో నివసించే తన సోదరుడి ఇంటికి నిప్పు పెట్టాడు.

02/08/2019 - 22:52

సింగపూర్, ఫిబ్రవరి 8: ఒక స్టాల్‌లోపనిచేస్తున్న వంటవాడిపై దాడి చేసిన ఘటనలో భారత సంతతికి చెందిన ఒక వ్యక్తికి సింగపూర్ కోర్టు కఠిన శిక్ష విధించింది. పది నెలల జైలు, మూడు వేల డాలర్లతో పాటు ఆరు కొరఢా దెబ్బలను శిక్షగా విధిస్తూ తీర్పు ఇచ్చింది. అడిగిన వెంటనే తాను ఆర్డర్ ఇచ్చిన ఆహారాన్ని సమకూర్చలేదనే ఆగ్రహంతో మురగన్ జోసెఫ్ అనే వ్యక్తి వంటవాడిపై దాడికి దిగారు.

02/08/2019 - 21:56

శ్రీకాకుళం : నగదు, నగలు చోరీ చేసేందుకు వచ్చే ముఠాలైనా, దొంగలైనా ప్రాణాలు తీసేంతటి సాహాసానికిపోరు. అడ్డుతగిలితే, గాయపరిచి వెళ్ళే చోరీలే ఇంతవరకూ చూసాం. మనుషులను క్రూరంగా చంపేసి నగదు, నగలు దోచుకుపోయే గ్యాంగ్‌లు ఈ మధ్యకాలంలో పోలీసు రికార్డుల్లో లేరు.

02/08/2019 - 05:11

హైదరాబాద్: వన్యప్రాణులను రక్షించే బాధ్యత అటవీశాఖ అధికారులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్, ఆమ్రాబాద్ అడవుల్లో పులులను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్రాలు చొరవ తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. పులల రక్షణకు సంబంధించి హైకోర్టు సుమోటోగా తీసుకున్న కోర్టు సమన్లు జారీ చేసింది. వన్యప్రాణులను చంపేయడం, అటవీ సంపదను అక్రమంగా తరలించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

02/08/2019 - 04:25

హైదరాబాద్, ఫిబ్రవరి 7: రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఎన్నారై, ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరాం హత్యకేసు తెలంగాణకు బదిలీ అయిందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ గురువారం ఇక్కడ వెల్లడించారు. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ స్పెషల్ మెసెంజర్ ద్వారా తమకు సమాచారం చేరిందని సీపీ స్పష్టం చేశారు.

02/08/2019 - 03:11

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 7: అర్థరాత్రి నగల వ్యాపారి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. బాకీ ఇవ్వనందుకు మరో నగల వ్యాపారి తన కారులో ఎక్కించుకుని చితకబాది పాతబస్తీకి తీసుకెళ్లాడు. సీబీసీఐడీ అధికారులమని ఫోన్‌లో చెప్పి బెదిరించిన కిడ్నాపర్ల ఎత్తుగడ అడ్డం తిరగడంతో చేసేదిలేక చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో వదిలేసి పారిపోయారు.

Pages