S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/08/2019 - 02:15

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: బీహార్‌లోని శరణాలయాల కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మను బదిలీ చేయడం పట్ల సుప్రీం కోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన అప్పటి తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు ఈ నెల 12న హాజరు కావాలని ఆదేశించింది.

02/08/2019 - 01:49

మచిలీపట్నం (కోనేరుసెంటరు) ఫిబ్రవరి 7: స్థానిక 30వ వార్డు రాజుపేట మగ్గాల కాలనీలో గురువారం తెల్లవారు జామున ప్రమాద వశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో మొహమ్మద్ షంసద్దీన్ కుమారుడు మొహమ్మద్ బాజీ (అలియాస్ హాజీ) (35) సజీవ దహనం అయ్యాడు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని గురువారం పరామర్శించారు.

02/08/2019 - 01:37

తాడేపల్లి, ఫిబ్రవరి 7: తాడేపల్లి మండలం కుంచనపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీసు రోడ్డులో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థి క్షతగాత్రుడయ్యాడు.

02/07/2019 - 23:12

లేపాక్షి, ఫిబ్రవరి 7 : మండల పరిధిలోని కోడిపల్లి ఎస్సీ కాలనీలో బుధవారం రాత్రి అరుణ (21) ఇంట్లో పైకప్పునకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు లేపాక్షి పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటక ప్రాంతంలోని వాటం కొత్తపల్లి గ్రామానికి చెందిన అరుణ కోడిపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.

02/07/2019 - 23:11

మడకశిర, ఫిబ్రవరి 7 : స్థానిక ప్రభుత్వాసుపత్రి సమీపంలో చోరీకి గురైన వాహనాన్ని స్థానిక పోలీసులు గంటలోపే స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఆసుపత్రి ఆవరణలో రోగులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొందరు ప్రైవేటు అంబులెన్స్‌లను నిర్వహిస్తున్నారు. ఇందులో ఓ అంబులెన్స్‌ను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకెళ్లారు.

02/07/2019 - 23:06

సంతనూతలపాడు, ఫిబ్రవరి 7 : సంతనూతలపాడులోని మార్కెట్ యార్డులోని గోడౌన్‌లో ఎన్నికలకు సంబంధించిన వివిప్యాడ్స్ విధులలో పాల్గొనేందుకు యర్రగొండపాలెం తహశీల్దార్ కార్యాలయానికి చెందిన విఆర్‌ఏ దాసరి మల్లయ్య (58) రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని ట్రాక్టర్ ఢీ కొట్టి వెళ్ళింది. ఈ సంఘటనలో ప్రమాదానికి కారణమైన మల్లయ్యను సంతనూతలపాడు పి మధు సూదన్‌రావు తన కారులో వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలించారు.

02/07/2019 - 03:46

తిరుపతి, ఫిబ్రవరి 6: శ్రీ గోవింద రాజ స్వామివారి ఆలయంలో శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామివారి ఉపాలయంలోని ఉత్సవమూర్తుల మూడు కిరీటాలను చోరీ చేసిన తమిళనాడుకు చెందిన ముత్తయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతనికి సహకరించిన ఆటో డ్రైవర్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. కిరీటాల చోరీ కేసుకు సంబంధించి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ నేతృత్వంలో ఆరు పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్న విషయం విదితమే.

02/07/2019 - 03:45

దియోరియా (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 6: ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లాలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక బాలికను ముగ్గురు యువకులు బలవంతంగా ఎత్తుకొనిపోయి అత్యాచారం జరిపారు. సోమవారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న ఈ బాలికను యువకులు ఎత్తుకెళ్లి దగ్గరలోని పంట చేలలోకి తీసుకెళ్లారు. తరువాత అక్కడ ఆమెను రేప్ చేశారని ఎస్‌పీ ఎ.కోలంచి బుధవారం తెలిపారు.

02/07/2019 - 02:37

జీడిమెట్ల, ఫిబ్రవరి 6: భారీ స్థాయిలో నిషేధిత గుట్టాను తరలిస్తున్న 10 మంది నిందితులతో పాటు రూ.24 లక్షల గుట్కాను దుందిగల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను షాపూర్‌నగర్‌లోని బాలానగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ పద్మజా, పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ రావు, దుందిగల్ సీఐ శంకరయ్య వెల్లడించారు.

02/07/2019 - 02:36

సనత్‌నగర్, ఫిబ్రవరి 6: ఫత్తేనగర్ బ్రిడ్జ్‌కు ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్ ఎస్‌ఆర్‌టీలో నివాసం ఉండే బీములు, మంగతాయారు భర్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం అర్థరాత్రి బ్రిడ్జ్ వద్దకు మంగతాయారు వచ్చి తన చున్నీతో బ్రిడ్జికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

Pages