S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2018 - 19:25

శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ పతాకంపై భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన బాలల చిత్రం ఆదిత్య క్రియేటివ్ జీనియస్. నవంబర్ 4, 2015న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ మధ్యాహ్నం ఆటతో పలు కేంద్రాల్లో ప్రదర్శితమవుతోంది. 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ఏకైక తెలుగు చిత్రంగా పురస్కారం గెల్చుకుంది.

07/23/2018 - 19:23

శ్రీ వీరాంజనేయులు సమర్పణలో కుబేర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కుబేర ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘నటన’. 180కు పైగా విజయవంతమైన చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన భారతీబాబు ‘నటన’ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వ బాధ్యతను స్వీకరిస్తున్నాడు. మహీధర్ హీరోగా, శ్రావ్య హీరోయిన్‌గా నటిస్తున్నారు.

07/22/2018 - 22:39

తెలుగు ప్రేక్షకుల్లో తనదైన అందంతో అభినయంతో దశాబ్దకాలంగా టాప్ హీరోయిన్‌గా ఆకట్టుకున్న త్రిష తిరిగి మోహినిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం, తెలుగు భాషల్లో మోహినిగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ లక్ష్మి పిక్చర్స్ తెలుగులో విడుదల చేస్తున్నారు.

07/22/2018 - 22:37

ఎస్.ఎ.రెహమాన్ సమర్పణలో ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వంలో బి.చంద్రశేఖర్ (పెదబాబు) నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం ‘బిచ్చగాడా మజాకా’- ఏ బ్రేకప్ లవ్‌స్టోరీ అన్నది ట్యాగ్‌లైన్.

07/22/2018 - 22:36

శ్రీనివాస కల్యాణం ఫస్ట్‌లుక్..

07/22/2018 - 22:34

సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లో సంపత్ నంది నిర్మాతగా ప్రచిత్ర క్రియేషన్స్, బిఎల్‌ఎన్ సినిమా సంయుక్తంగా జయశంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం టీజర్‌ను రియల్ పేపర్‌బాయ్ అఖిల్ చేత విడుదల చేయించారు. ఈ సందర్భంగా దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. ‘‘నేను చేసిన షార్ట్ ఫిల్మ్ చూసి సంపత్‌గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు.

07/22/2018 - 22:31

ఛలో లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత నాగశౌర్య, ఐరా క్రియేషన్స్ కాంబినేషన్‌లో ప్రొడక్షన్ నెం-2గా తెరకెక్కుతున్న చిత్రం నర్తనశాల ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ కష్మిర పరదేశి, యామిని భాస్కర్, శివాజీరాజా, జెమిని సురేష్, రాఘవ, రాకెట్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

07/22/2018 - 22:30

మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచీస్‌కున్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి సినిమాకూ దర్శకుడు మారుతూ ఉండటమే. ఈ వరుసలో ఒక్కో సినిమాకు, ఒక్కో దర్శకుడు పని చేయడాన్ని గమనించవచ్చు. ఈసారి హీరో టామ్‌క్రూయిజ్ ‘మిషన్ ఇంపాజిబుల్- ఫాలౌట్’ కోసం తనకిష్టమైన దర్శకుడు మెక్ క్వారీని ఎంపిక చేసుకున్నారు. వీరిద్దరి కలయికలతో రూపొందిన రెండో సినిమా ఇది.

07/22/2018 - 22:28

తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం ‘విశ్వాసం’ చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించి సగభాగాన్ని హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలోనే తెరకెక్కించారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రం తరువాత అజిత్ యువ దర్శకుడు వినోద్ దర్శకత్వంలో నటించనున్నారు.

07/22/2018 - 22:27

థర్టీ ఇయర్స్ ఇక్కడ.. అంటూ తనదైన కామెడీ మేనరిజమ్, టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న స్టార్ కమెడియన్ పృథ్వీ టైటిల్ పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘మై డియర్ మార్తాండం’. మేజిన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సయ్యద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరీష్ కె.వి. దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Pages