S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/18/2017 - 20:57

భ్రమను నిజంగా భావించే చిత్రమైన పాత్ర చేస్తున్నానంటోంది మంచు లక్ష్మి. ఆమె ప్రధాన పాత్రలో మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రానికి విజయ్ ఎలంకంటి దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్‌లో చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వైవిధ్యమైన పాత్ర పోషిస్తోన్న నిర్మాత మంచులక్ష్మి మాట్లాడుతూ ‘చాలాకాలం తరువాత మంచు సంస్థ నుంచి మరో చిత్రం రాబోతోంది.

08/18/2017 - 20:55

తెలుగు పరిశ్రమలో తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా ఒకటి రెండు సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. దానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలు కాబట్టి హీరోయిన్ గ్లామర్‌గా ఉండేందుకు దర్శక నిర్మాతలు కేర్ తీసుకుంటారు. కానీ తెలుగు హీరోయిన్లు పెట్టే కండిషన్‌లను ఒప్పుకోలేక బాలీవుడ్ హీరోయిన్లను దించడం కామనే.

08/18/2017 - 20:53

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ రాశీఖన్నా మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకుంది. ఆ తరువాత గ్లామర్ హీరోయిన్‌గా ఆకట్టుకున్న ఈమెకు గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్‌లు దక్కడంలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన జైలవకుశ సినిమాలో నటిస్తున్న రాశి, మరోవైపు కోలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తోంది.

08/17/2017 - 21:01

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ‘స్పైడర్’ సినిమా ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తిచేసుకుంది. క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాటను ఈనెల 23నుంచి రుమేనియాలో చిత్రీకరించనున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించిన ఈ సినిమాతో మహేష్ కోలీవుడ్‌లోకి స్ట్రెయిట్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆయన సినిమాలు డబ్బింగ్ రూపంలో తమిళ ప్రేక్షకుల్ని అలరించాయి.

08/17/2017 - 20:59

శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మహానుభావుడు. యువి క్రియేషన్స్ పతాకంపై మెహరీన్ హీరోయిన్‌గా వంశి, ప్రమోద్ రూపొందిస్తున్న చిత్రానికి మహానుభావుడు టైటిల్ ఖరారు చేశారు. పాట వినా సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. త్వరలోనే డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

08/17/2017 - 20:58

పైసా వసూల్ ఆడియో ఖమ్మంలో అట్టహాసంగా సాగింది. దర్శకుడు పూరీ హడావుడి, బాలయ్య మేకోవర్ చూస్తుంటే ఖాతాలో మరో హిట్ వేసుకున్నట్టేనన్న అంచనాలు వినిపిస్తున్నాయ. నిజానికి ఇప్పుడు పూరీకి అతని రేంజ్ హిట్టు అవసరం. ఆ కసి ఈ సినిమాతో తీర్చుకోవచ్చని అంటున్నారు.

08/17/2017 - 20:56

ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విఎస్ క్రియేటివ్ వర్క్స్ పతాకాంపై రాము కొప్పుల దర్శకత్వంలో దివ్యవిజయ్ ఆ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోస్‌లో గురువారం ఉదయం సినిమా ప్రారంభమైంది. తొలి సన్నివేశంపై దర్శకుడు వివి వినాయక్ క్లాప్‌నివ్వగా, ఫైట్‌మాస్టర్ విజయన్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

08/17/2017 - 20:54

చేసే ప్రతి సినిమాపై ఒకేలా దృష్టిపెడతాను. నావరకూ నాకు కొత్తగా అనిపించే పాత్రలే చేయాలనుకుంటున్నానని అంటోంది అందాల భామ తాప్సీ. తాజాగా తెలుగులో ‘ఆనందోబ్రహ్మ’లో నటించింది. మహి వి.రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ హారర్ ఎంటర్‌టైనర్ నేడు విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ తాప్సీతో ఇంటర్వ్యూ..
* హర్రర్ సినిమాలంటే ఇష్టమా?

08/17/2017 - 20:52

సినిమాల్లో మామూలు హీరోయిన్స్ నుండి టాప్ హీరోయిన్స్ వరకు వేశ్య పాత్రలు వేయడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు.. దానికి బలమైన కారణమే వుంది. అదేమిటంటే ఆ పాత్రలో అన్ని రసాలను పండించడమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి సింపతీ దొరుకుతుంది. అందుకే ఆ పాత్రలకు అంత క్రేజ్. తాజాగా వేశ్య పాత్రలో నటించేందుకు మాజీ హీరోయిన్ ఓకె చెప్పింది. ఎవరా మాజీ హీరోయిన్, ఏమా కథ అంటే...

08/17/2017 - 20:50

తెలుగు భామ అంజలికి ఈమధ్య కెరీర్ సాఫీగా సాగడంలేదు. వరుసగా పరాజయాలు పలకరిస్తుండడంతో అవకాశాలు తగ్గాయి. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా తరువాత క్రేజీ హీరోయిన్‌గా మారిన అంజలికి వరుస అవకాశాలతో పలు సినిమాలు చేసింది. ఈమధ్య ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రాంగద భారీ పరాజయాన్ని అందుకోవడంతో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం తమిళంలో బెలూన్ సినిమాలో నటిస్తోంది.

Pages