S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/24/2017 - 20:51

సొట్టబుగ్గల తాప్సికి ఈమధ్య బాలీవుడ్‌లో మంచి క్రేజ్ దక్కింది. వరుసగా బేబి, పింక్, నామ్ షబానా లాంటి సినిమాలతో నటిగా ఇమేజ్ తెచ్చుకున్న తాప్సీ.. అబ్బో ఇలాంటి అవకాశాలే వరుసగా వస్తాయా అని అనుకుందో ఏమో.. అందుకే ట్రెండ్ మార్చి హాట్ హాట్ అందాలు ఆరబోసేందుకు రెడీ అయింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న జుడువా-2లో తాప్సి అందాలు బాలీవుడ్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని అంటున్నారు.

08/24/2017 - 20:48

దశాబ్దకాలంపాటు హీరోయిన్‌గా సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందా ల భామ త్రిష కొంత గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటిస్తుంది. ముఖ్యంగా లేడీ ప్రాముఖ్యత ఉన్న సినిమాల్లో నటిస్తున్న త్రిష తాజాగా 8 చిత్రాల్లో నటిస్తూ షాక్ ఇస్తోం ది. ప్రస్తుతం ఓ సినిమా కోసం ఆమె బాక్సర్‌గా కనిపిస్తుందట.

08/24/2017 - 00:11

దశాబ్దకాలంగా సౌత్‌లో గ్లామర్ భామగా పేరు తెచ్చుకున్న శ్రీయకు ఈమధ్య వరుస పరాజయాలతో కాస్త బ్రేక్ పడింది. కొత్త అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు కాస్త బ్రేక్ తీసుకుని తన గ్లామర్‌కు పదును పెట్టుకుని మళ్లీ బాలయ్య సరసన గౌతమీ పుత్రతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇంకా వనె్న తరగని అందంతో శ్రీయ కుర్ర హీరోయిన్స్‌కు గబులు పుట్టిస్తూనే వుంది. తాజాగా ఈ 35 ఏళ్ల కుర్ర భామ లక్మే ఫ్యాషన్ వీక్‌లో రాంప్ వాక్ చేసి షాకిచ్చింది.

08/24/2017 - 00:10

విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ఓవైపు కమర్షియల్ సినిమాలతో మరోవైపు ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు ధనుష్. దక్షిణాదిలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ బాలీవుడ్‌లో కూడా తన హవాను చాటాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం విఐపి-2. ఇంతకు ముందు వచ్చిన రఘువరన్ బిటెక్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది.

08/24/2017 - 00:09

ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న హీరోల జాబితాలో కింగ్‌ఖాన్ షారూఖ్‌కు చోటుదక్కింది. ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన జాబితాలో ముగ్గురు భారతీయ నటులకు చోటు లభించడం గమనార్హం. ఈ జాబితాలో ట్రాన్స్‌ఫార్మర్ హీరో వార్క్‌వాల్ బెర్గ్ తొలి స్థానంలో ఉన్నాడు. తాజా చిత్రానికి రెమ్యునరేషన్ భారీగా అందడంతో వాల్‌బర్గ్ 68 మిలియన్ డాలర్ల సంపాదనతో తొలిస్థానం నిలుపుకున్నాడు.

08/24/2017 - 00:09

దయ్యం అంటే.. ఎవరైనా భయపడతారు కానీ ఈ హాట్ భామ మాత్రం ఏకంగా ఈ దెయ్యం నా ఫ్రెండ్ అంటూ దెయ్యంతో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ కామెంట్ పెట్టింది!! ఇంతకీ ఎవరా భామ ఏమా కథ అంటే.. హాలీవుడ్‌లో ఈమధ్యే విడుదలైన అనబెల్ సినిమా ఎలాంటి సంచలనం రేపిందో అందరికీ తెలుసు. ఆ సినిమాలో ఓ బొమ్మే ప్రధాన భూమికను పోషించింది. తాజాగా ఈ సినిమా ఇండియాలో కూడా విడుదలై దుమ్ము రేపుతోంది. ఈబొమ్మతో కలిసి ఓ ఫోటో దిగింది. మన రత్తాలు..

08/24/2017 - 00:09

ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు నాగార్జున ‘రాజుగారి గది 2’తో రెడీ అయపోతున్నాడు. దీంతో -వాట్ నెక్ట్స్ అన్న ఆసక్తి ఇండస్ట్రీలో కనిపిస్తోంది. తర్వాతి ప్రాజెక్టు ఎవరితో.. ఎప్పుడు అన్న సమాచారం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నాగ్, తన పూర్తి సమయాన్ని అఖిల్ వ్యవహారాలు చూడడానికే కేటాయిస్తున్నారట.

08/24/2017 - 00:08

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పైసా వసూల్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 1న విడుదలవుతున్న సందర్భంగా ప్రమోషన్‌లో స్పీడు పెంచాడు బాలయ్య. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్లు సంచలనం రేపుతున్నాయి. తేడాసింగ్ పాత్రలో బాలయ్య హంగామా మామూలుగా లేదు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

08/24/2017 - 00:08

విష్వక్‌సేన్ హీరోగా యాకూబ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వెళ్లిపోమాకే’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. కొత్త నటీనటులు, టెక్నీషియన్లతో తెరకెక్కిన ఈ చిత్రానికి దిల్‌రాజు సపోర్టు చేయడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 2న విడుదలవుతున్న సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ- ఈ సినిమా మేకింగ్ అద్భుతంగా వుంది. మంచి ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ.

08/24/2017 - 00:07

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ‘జయ జానకి నాయక’ చిత్రం ఇటీవలే విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో విజయోత్సవ సభను ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Pages