S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/24/2017 - 00:07

శ్రీలంకన్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఈమధ్య తెగ పాపులర్ అయిపోతోంది. వరుసగా బాలీవుడ్‌లో చాన్సులు దక్కించుకుంటూ బికినీ అందాలతో రెచ్చిపోతోంది. ప్రస్తుతం రెండు సినిమాలను పూర్తిచేసిన ఈ అమ్మడు ఒక సినిమాను ఈనెల 25న రిలీజ్ చేయనుంది. రాజ్ మరియు డికెలు తెరకెక్కించిన ‘ఏ జెంటిల్మెన్’ సినిమాలో ఈ అమ్మడు వరుణ్‌ధావన్‌తో చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదట.

08/24/2017 - 00:07

విజయ్ దేవరకొండ, షాలిని జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రణయ్‌రెడ్డి నిర్మించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్లు సంచలనం రేపుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్‌రెడ్డి చెప్పిన విశేషాలు..
అర్జున్‌రెడ్డి ఎవరు?

08/22/2017 - 20:56

చిరంజీవి నటించనున్న 151వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. గత కొద్ది రోజులుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిత్రాన్ని రామ్‌చరణ్ రూపొందిస్తారన్న కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.

08/22/2017 - 20:51

ఫిదా.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా కూడా ఇంకా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే వుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కాస్త గ్యాప్ తరువాత తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే యాభై కోట్ల మార్కెట్‌ను దాటి దూసుకుపోతోంది. వరుణ్‌తేజ్ హీరోగా, సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారట.

08/22/2017 - 20:49

బాలయ్య 152వ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సికె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకంపై నిర్మాత సి కల్యాణ్ భారీ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నాడు. ఈమధ్యనే ప్రారంభోత్సవం జరుపుకున్న చిత్రంలో, బాలయ్య సరసన నయనతారను కథానాయికగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వడంతో, మంగళవారం నుంచీ ఆమె టీంలోకి చేరింది.

08/22/2017 - 20:47

ఓ అందమైన దృశ్యకావ్యంగా అల్లుకున్న కథతో రూపొందించిన ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ చిత్రం నాకు డెబ్యూ మూవీ అయినా తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెస్తుందన్న నమ్మకం వుంది. సినిమా మాత్రం ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు నచ్చుతుంది. ఓ రకంగా ఈ చిత్రం అంతా మధురమే అని చెబుతా అంటున్నాడు కొత్త కథానాయకుడు చంద్రకాంత్.

08/22/2017 - 20:45

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు లైఫ్ హిస్టరీని సినిమాగా తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు అటు రాజకీయరంగంలో, ఇటు సినీవర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజకీయనేతగా, ఉద్యమకర్తగా ఇమేజ్ తెచ్చుకున్న కెసిఆర్ కథను సినిమాగా తీయడం మామూలు విషయం కాదు, కత్తిమీద సామే.

08/22/2017 - 20:43

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న రెండవ చిత్రానికి ‘హలో’ అన్న పేరును ఖరారు చేశారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నాగార్జున రూపొందిస్తున్న లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను నాగార్జున ట్విట్టర్‌లో విడుదల చేశారు. ఈ చిత్ర యూనిట్‌ను విష్ చేసిన వీడియోను కూడా విడుదల చేశారు.

08/22/2017 - 20:41

గోవా భామ ఇలియానా మొత్తానికి బాలీవుడ్‌లోనే సెటిలైంది. సౌత్‌లో అవకాశాలు వస్తున్నా, ఇక్కడి సినిమాలపై ఆమె ఆసక్తి చూపించడం లేదన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. తాజాగా ఇలియానా కొన్ని సంచలన కామెంట్స్ చేసింది? అదీ తన ఫ్యాన్స్‌పై.. కాదు పబ్లిక్‌పైన కూడా! ఇంతకీ ఏ విషయం గురించి అలా రెస్పాండ్ అయ్యిందంటే.. -ఇలియానా, అజయ్‌దేవ్‌గన్‌తో కలిసి నటించిన ‘బాద్షాహో’ ప్రమోషన్‌ల్ ఈవెంట్‌కు హాజరైందట.

08/20/2017 - 21:37

మహేష్‌బాబు చేసిన ‘స్పైడర్’ సినిమాకోసం ప్రేక్షకులకు ఆసక్తి ఎక్కువైంది. దక్షిణాది స్టార్ డైరక్టర్లలో ఒకరైన మురగదాస్ డైరక్టు చేయడంవల్ల చిత్రానికి ఎనలేని క్రేజ్ దక్కింది. ప్రస్తుతం చివరి పాట షూటింగ్ దశలో వున్న చిత్రాన్ని తమిళంలోనూ భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇంతలా సినిమాను తమిళంలో విడుదల చేయడం వెనక ఇన్నాళ్లు మహేష్ స్ట్రాటజీ మాత్రమే ఉందనుకున్నారు.

Pages