S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/08/2018 - 03:28

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగ ధ్రువపత్రాలు (యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు) సమర్పించనందుకే రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నిధులు విడుదల చేయలేకపోతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అశ్వినీకుమార్ చౌబే తెలిపారు. రాజ్యసభలో మంగళవారం ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చౌబే ఈ విషయాన్ని వెల్లడించారు.

08/08/2018 - 03:27

ముంబయి, ఆగస్టు 7: ఓబీసీలకు కేటాయించిన ఉద్యోగాలు వారికే తప్ప మరొక వర్గానికి కేటాయించబోమని మహారాష్ట్ర సీఎం దేవేందర్ ఫడ్నవిస్ స్పష్టంచేశారు. ఉద్యోగాలు, విద్యలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఓబీసీలు ఆందోళన చెందుతున్నారు.

08/08/2018 - 03:26

న్యూఢిల్లీ, ఆగస్టు 7: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రాకు ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వకుండా ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని తెలుగుదేశం సభ్యుడు అవంతి శ్రీనివాస్ ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని శ్రీనివాస్ ప్రస్తావించారు.

08/08/2018 - 03:26

న్యూఢిల్లీ, ఆగస్టు 7: అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల నిమిత్తం సంవత్సరానికి ఎమ్మెల్యేకు ఇచ్చే 4 కోట్ల రూపాయల నిధులను 10 కోట్లకు పెంచుతూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన ఢిల్లీ కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం శాసనసభలో ప్రకటించారు.

08/08/2018 - 03:24

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ముజఫర్ ఘటనలో నిందితులను వదిలిపెట్టే ప్రసక్తిలేదని, ఈ ఉదంతంపై బీహార్‌కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారని, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించినట్లు ఆయన లోక్‌సభలో వెల్లడించారు. లోక్‌సభలో ఈ అంశంపై చర్చ జరుగుతుండగా ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు నిరసనలు వ్యక్తం చేశారు.

08/08/2018 - 03:24

న్యూఢిల్లీ, ఆగస్టు 7: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుంటున్నారు. ఢిల్లీమెట్రో, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సీఐఎస్‌ఏఫ్ పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రయాణీకుల కదలికలపై నిఘాను పెంచారు.

08/08/2018 - 03:20

చెన్నై: దశాబ్దాల పాటు తమిళనాడును భిన్న రంగాల్లో అద్వితీయమైన రీతిలో ప్రభావితం చేసిన నిరుపమాన రచయిత, సాహితీవేత్త, రాజకీయ నాయకుడు ఎమ్.కరుణానిధి. వైఫల్యాలను ఎదురొడ్డి తనదైన శైలిలో తమిళనాడు రాజకీయ యవనికనే మార్చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. కరుణానిధి నిష్క్రమణతో ఓ అరుదైన, ఘనమైన శకమే అస్తమించింది.

08/08/2018 - 02:18

న్యూఢిల్లీ, ఆగస్టు 7: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ప్రతిపక్షం అభ్యర్థిగా ఎన్‌సీపీ నాయకురాలు వందనా చవాన్‌ను రంగంలోకి దించుతున్నట్లు తెలిసింది. ఎన్‌డీఏ తరపున జేడీ(యూ) సీనియర్ నాయకుడు హరివంశ్ నారాయణ్ సింగ్‌ను రంగంలో ఉండటం తెలిసిందే. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి జరిగే ఎన్నికకోసం బుధవారం మధ్యాహ్నం పనె్నండు గంటలలోగా నామినేషన్లు దాఖలు చేయవలసి ఉంటుంది.

08/08/2018 - 02:16

న్యూఢిల్లీ, ఆగస్టు 7: రాజ్యసభ చర్చలను సీరియస్‌గా తీసుకోకపోవడం, సరిగా హాజరుకాకపోవడంపై రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు సభ్యులను మందలించారు. ప్రతిష్టాకరమైన జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే బిల్లుపై సోమవారం చర్చ జరిగింది. ఈ బిల్లును సభ ఆమోదించింది. ఈ బిల్లుపై చర్చ సమయంలో సభ్యులు తక్కువ మంది సభలో ఉన్నారు. మంగళవారం రాజ్యసభలో ఈ విషయాన్ని చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు ప్రస్తావించారు.

08/08/2018 - 02:10

చెన్నై, ఆగస్టు 7: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో నిర్వహించేందుకు వీలుగా స్థలం కేటాయించాలన్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే డిమాండ్‌ను రాష్ట్రప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించే స్థలంపై వివాదం రాజుకుంది.

Pages