S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/22/2018 - 02:14

జైపూర్, జూలై 21: గోవులను అక్రమరవాణా ఆరోపణపై మరో వ్యక్తి మూక హింసకు బలయ్యాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని ఆళ్వార్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని లాల్వండి ప్రాంతంలో అక్బర్ ఖాన్ అనే 28 సంవత్సరాల యువకుడు మరో వ్యక్తితో కలిసి రెండు ఆవులను తీసుకెళుతుండగా ఈ ఘటన జరిగింది. వీరు గోవులను అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానంతో వీరిపై స్థానిక ప్రజలు సామూహికంగా దాడి చేశారు.

07/22/2018 - 02:00

కోల్‌కతా, జూలై 21: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాడులు, విద్వేషాలు, హింసను ప్రేరేపిస్తూ దేశాన్ని అథోగతి పాలుచేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. మృతవీరులు దినోత్సవం సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన అమరవీరుల భారీ ర్యాలీలో నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు.

07/22/2018 - 05:02

న్యూఢిల్లీ, జూలై 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు త్వరలో సరికొత్త వ్యూహాన్ని ప్రకటిస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తప్పుడు ఆరోపణలతో ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారని, అవమానపరిచారని ఆయన ఆరోపించారు.

07/22/2018 - 05:03

న్యూఢిల్లీ, జూలై 21: పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవహేళన చేసే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీల విషయంలో ఏన్డీయే ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని శనివారం ఇక్కడ ధ్వజమెత్తారు.

07/22/2018 - 05:06

న్యూఢిల్లీ, జూలై 21: వినియోగదారులకు శుభవార్త. గృహోపకరణాలు, ఎక్కువగా ఉపయోగించే వినిమయ వస్తువులపై వస్తుసేవా పన్నును తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. శనివారం జీఎస్‌టీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రజలు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై జీఎస్‌టీని తగ్గిస్తున్నట్లు చెప్పారు. సవరించిన జీఎస్‌టీ రేట్లు జూలై 27వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.

07/22/2018 - 05:09

షాహజహన్‌పూర్ (యుపీ), జూలై 21: విపక్ష పార్టీలు బీజేపీపై లోక్‌సభలో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అర్థం లేదని, ఏ ఉద్దేశ్యంతో ఈ తీర్మానం పెట్టారో తెలియక ప్రతిపక్ష పార్టీలు అయోమయానికి గురయ్యాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. ఎఐసిసి అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగం తర్వాత తన వద్దకు వచ్చి కౌగిలించుకోవడం అసందర్భమని, ఇది అనాలోచిత చర్య అని ఆయన ఎద్దేవా చేశారు.

07/21/2018 - 16:27

కోల్‌కతా: కేంద్రంలో బిజేపీని గద్దె దించితీరుతామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆమె కోల్‌కతాలో జరిగిన అమరవీరుల దినోత్సవంలో మాట్లాడుతూ..‘‘బీజేపీని తొలగించండి-దేశాన్ని రక్షించండి’’ అనే నినాదంతో పవ్చిమ బెంగాల్‌లో ప్రచారం చేస్తామని అన్నారు. ఆగస్టు 15 నుంచి ప్రచారం ప్రారంభిస్తామని తెలిపారు. జనవరి 19 దేశంలోని వివిధ పార్టీల నేతలను ఆహ్వానించి మెగా ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.

07/21/2018 - 16:26

న్యూఢిల్లీ :కళంకితులతో కలిసింది మీరని, గాలి జనార్థన్‌రెడ్డి వంటి వ్యక్తుల మనుషులకు టిక్కెట్లు ఇచ్చి కలిసి పనిచేస్తుందని మీరని, వైసీపీ నేత జగన్మోహన్‌రెడ్డితో తనను ఎలా పోలుస్తారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన శనివారంనాడిక్కడ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ..తాను యూ టర్న్ తీసుకోలేదని, మీరు తీసుకున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కథలు చెబుతున్నారని విమర్శించారు.

07/21/2018 - 13:12

రాయ్‌గఢ్: ఒడిస్సా రాష్ట్రంలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో భారీ వర్షాలకు రైల్వే ట్రాక్‌లపైకి కూడా వరదనీరు వచ్చి చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాలుమస్కాస్టేషన్ వద్ద హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వరద నీటిలో చిక్కుకుపోయింది. బోగీలోకి నీరు వచ్చి చేరింది.

07/21/2018 - 12:20

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేయటంతో పాటు ఈరోజు నేషనల్ మీడియాతో ఆయన ముచ్చటించనున్నారు.

Pages