S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/21/2018 - 17:16

ఒడిశా: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాందా నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణీకులతో వెళుతున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొనటంతో పది మంది చనిపోయారు. మృతులలో ఓ చిన్నారి కూడా ఉన్నది. ఏడుగురు ఘటనా స్థలంలో మృతిచెందగా, ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

05/21/2018 - 17:15

బెంగళూరు: కర్నాటకలో ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీ మాదని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. కాంగ్రెస్, జేఏసీ పార్టీలను ప్రజలను తిరస్కరించారని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే హక్కు బీజేపీకి మాత్రమే ఉన్నదని అన్నారు. ప్రజలు ఎవ్వరికీ సరైన మెజార్టీ ఇవ్వలేదని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

05/21/2018 - 14:03

గ్వాలియర్: ఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. బి6, బి7 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రైన్ విశాఖపట్నం వస్తుండగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్ వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

05/21/2018 - 13:22

న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ 27వ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి ఢిల్లీలోని వీర్ భూమి వద్ద రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు సుశీల్ కుమార్ షిండే, మల్లికార్జున్ ఖర్గే తదితరులు కూడా రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు.

05/21/2018 - 13:02

జమ్ము: పాకిస్థాన్ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆదివారం రాత్రి నుంచి భారత బలగాలపై కాల్పులకు పాల్పడుతూనే ఉంది. జమ్ము కాశ్మీర్‌లోని అర్నియా సెక్టార్‌లో గల మూడు బార్డర్‌ అవుట్‌పోస్టులపై నుంచి పాక్‌ రేంజర్స్‌ కాల్పులకు తెగబడినట్లు సీనియర్‌ బీఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే పాక్‌ చర్యను భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయని చెప్పారు.

05/21/2018 - 12:44

రాంచీ: ఉరుములు, మెరుపులతో జార్ఖండ్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు గాయ పడ్డారు. కేవలం రాంచీలో గంటసేపు కురిసిన వర్షంతో 54.4 మిమీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు తోడు గంటకు 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీయడంతో రాంచీలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

05/21/2018 - 12:42

కాన్పూర్ : ఉత్తరప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి పది మంది మృత్యువాత పడ్డారు. మరో 16 మంది తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ.2 లక్షల చొప్పన నష్టపరిహారం ప్రకటించారు. మద్యం షాపు లైసెన్స్‌దారుడు శ్యామ్‌బాలక్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని కాన్పూర్ సీనియర్ ఎస్పీ అఖిలేశ్‌కుమార్ తెలిపారు.

05/21/2018 - 12:41

కర్ణాటక: హసన్‌లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కుమారస్వామి పూజలు చేశారు. కుమారస్వామి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4:40 గంటలకు సోనియాగాంధీతో భేటీ కానున్నారు. ఈ నెల 23న తన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వారిని కుమారస్వామి ఆహ్వానించనున్నారు. సాయంత్రం 6 గంటలకు బెంగళూరు తిరుగుప్రయాణం కానున్నారు.

05/21/2018 - 12:36

తిరువనంతపురం : కేరళలో నిఫా వైరస్ కారణంగా కోజికోడ్ జిల్లాలో విష జ్వరాలు ప్రబలి.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందిని వైద్యాధికారులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. వైరస్ నమూనాలను పుణెలోని ల్యాబ్‌కు జిల్లా వైద్యాధికారులు పంపారు. విష జ్వరాలపై కలెక్టర్ జోస్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

05/21/2018 - 02:26

న్యూఢిల్లీ, మే 20: రక్షణ రంగంలో కృత్రిమ మేధస్సును ప్రవేశపెట్టే ప్రాజెక్టును కేంద్రం ప్రారంభించింది. సైనిక దళాల సంసిద్ధతా స్థాయిని పెంచేందుకు వీలుగా మానవ రహిత ట్యాంకులను, నౌకలను, రొబొటిక్ ఆయుధాలను ప్రవేశపెట్టనున్నది. ఒకవైపు చైనా తన సైన్యానికి సంక్లిష్టమైన కృత్రిమ మేధస్సుతో కూడిన అప్లికేషన్లను అభివృద్ధి పరుస్తున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.

Pages