S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/20/2018 - 02:48

జమ్మూ, మే 19: అంతర్జాతీయ సరిహద్దులో (ఐబీ) ప్రశాంత వాతావరణం నెలకొంది. ముందు రోజు అంటే శుక్రవారం పాక్ రేంజర్ల కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్ జవాన్‌తోపాటు ఐదుగురు మృతి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ ప్రాంతంలోని సరిహద్దుల్లో శనివారం ప్రశాంత వాతావరణం కనిపించింది. కాల్పులు జరిగిన ప్రాంతంలో విద్యాసంస్థలకు ముందు జాగ్రత్తగా సెలవులు ప్రకటించినట్టు అధికారులు వెల్లడించారు.

05/20/2018 - 02:46

బేతుల్, మే 19: అవినీతి రోడ్ కాంట్రాక్టర్లను బుల్‌డోజర్ కింద ఉంచి తొక్కించేస్తానని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో జరుగుతున్న రోడ్‌పనులను ఆయన శనివారం పరిశీలించారు. అయితే అక్కడ పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్న విషయాన్ని గమనించిన ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో చూడాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లదే కదా..

05/20/2018 - 02:30

మథుర, గురుగ్రామ్, న్యూఢిల్లీ, అమృత్‌సర్‌లలో శనివారం వచ్చిన
గాలి దుమారం, ఇసుక తుపాను
ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయ.

చిత్రాలు..న్యూఢిల్లీలో..
*మథురలో..

05/20/2018 - 01:16

న్యూఢిల్లీ, మే 19: ప్రధాని మోదీ ఓ నియంత. కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుకు అనుమతించటం ద్వారా తన అవినీతిని బైటపెట్టుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కర్నాటక సీఎం యెడ్యూరప్ప శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకోలేక రాజీనామా చేసిన నేపథ్యంలో రాహుల్ ఏఐసీసీలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

05/20/2018 - 01:13

అహ్మదాబాద్, మే 19: కూలి కోసం హైవే ఎక్కిన బతుకులు సిమెంట్ బస్తాల కింద ఛిద్రమైపోయాయి. చీకట్లు చెదరక ముందే కూలి బతుకులు తెల్లారిపోయాయి. శనివారం తెల్లవారుఝామున గుజరాత్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం ముగ్గురు పిల్లలు సహా 19మందిని చిదిమేసింది. ప్రమాదం సంభవించిన సమయంలో సమీప ప్రాంతంలో జనావాసాలు లేకపోవడంతో రక్షించేవారులేక ఆర్తనాదాలు చేస్తూనే కూలీలు ప్రాణాలు విడిచారు.

05/20/2018 - 01:03

రెండు సీట్ల నుంచి బీజేపీని 104 స్థానాలకు తీసుకొచ్చాను. ఇల్లిల్లూ తిరిగాను. ప్రజలతోనే ఉన్నాను. నా జీవితమంతా అగ్నిపరీక్ష చందమే. అయినా తుది శ్వాస విడిచేవరకూ ప్రజల కోసం పాటుపడతాను. కాంగ్రెస్- జేడీ(ఎస్)లది అపవిత్ర, అవకాశవాద కూటమి. కుట్రతో ప్రజాతీర్పును అవహేళన చేశారు. నేను విశ్వాస పరీక్షను ఎదుర్కోవడం లేదు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానంటూ కన్నీటి పర్యంతమవుతున్న బీఎస్ యెడ్యూరప్ప

05/20/2018 - 01:00

బెంగలూరు, మే 19: కర్నాటకలోని మూడు రోజుల యెడ్యూరప్ప ప్రభుత్వం కుప్పకూలింది. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటామంటూ చివరి క్షణం వరకూ ధీమా వ్యక్తం చేసిన యెడ్యూరప్ప విశ్వాస పరీక్షను ఎదుర్కోకుండానే నిష్క్రమించారు. అసెంబ్లీలో శనివారం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, భావోద్వేగంతో ప్రసంగించిన అనంతరం ‘నేను రాజీనామా చేస్తున్నాను ..’ అంటూ సభ నుండి వెళ్లిపోయారు.

05/20/2018 - 00:55

‘నేను రాజీనామా చేస్తున్నాను ..’ అంటూ మూడురోజుల ముఖ్యమంత్రి యెడ్యూరప్ప సభ నుంచి నిష్క్రమించిన సందర్భంలో ఆనందంతో విజయ సంకేతాన్ని చూపిస్తున్న కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి, ఆ పార్టీల ఎమ్మెల్యేలు

05/19/2018 - 17:33

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామాపై పలువురు స్పందించారు.

05/19/2018 - 17:31

కర్నాటక:అధికారం కోసం బీజేపీ సభ్యులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కర్ణాటకలో యడ్యూరప్ప రాజీనామా తరువాత ఢిల్లీలో రాహుల్ విలేకర్లతో మాట్లాడారు. మణిపూర్, గోవాలలో బీజేపీ ప్రజా తీర్పును గౌరవించలేదని అన్నారు. జాతీయ గీతం ఆలపిస్తుంటేనే బీజేపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోవటం వల్ల వారికి జాతీయగీతం పట్ల ఉన్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.

Pages