S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/19/2018 - 16:38

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో బల పరీక్షకు ముందే ఆయన తన రాజీనామాను సమర్పించినట్లు తెలిసింది. మూడు రోజులే ముఖ్యమంత్రిగా పనిచేశారు. సంఖ్యాబలం లేక రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు. యడ్యూరప్ప రాజీనామాతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్‌కు ఎమ్మెల్యేలను తరలించటం ద్వారా కాంగ్రెస్, జేడీఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించాయి.

05/19/2018 - 16:32

బెంగళూరు: అసెంబ్లీలో బలాన్ని కూడగట్టడంలో విఫలమయ్యామని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. ఆయన అసెంబ్లీలో ఉద్వేగంగా ప్రసంగించారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్, జేడీఎస్‌లను తిరస్కరించారని, ఎన్నికలు ప్రకటించిన తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించారని అన్నారు. సభలో ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.

05/19/2018 - 14:20

గుజరాత్‌: భావనగర్‌-అహ్మదాబాద్‌ హైవేపై బవల్‌యాలీ గ్రామం సమీపంలో శనివారం ఉదయంసిమెంట్‌ బస్తాలు తీసుకెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడటంతో 19 మంది దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ట్రక్కు రోడ్డుపై మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. కూలీలపై సిమెంట్‌ బస్తాలు పడటంతో 19 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు.

05/19/2018 - 14:14

జమ్ముకాశ్మీర్‌: జమ్ముకాశ్మీర్‌లో వ్యవసాయ రంగ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు పరమపూజ్య పద్మభూషణ్‌ కుషోల్‌ బకుల రింపోచే శత జయంతి పురస్కరించుకొని లేహ్‌లో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. జమ్ముకాశ్మీర్‌లో రూ. 25వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు.

05/19/2018 - 13:53

బెంగుళూరు: కర్ణాటక శాసనసభలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి సంఖ్యాబలం ఉందని జేడీఎస్‌ అధినేత కుమారస్వామి అన్నారు. తమ ఎమ్మెల్యేలతో హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు చేరుకున్న అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని తెలిపారు. తమలో ఎలాంటి సమస్యలు లేవని.. అందరం ఐక్యంగా ఉన్నామని పేర్కొన్నారు. బలనిరూపణలో యడ్యూరప్పకు ఓటమి ఖాయమని తేల్చిచెప్పారు.

05/19/2018 - 13:51

బెంగుళూరు: కర్ణాటక విధాన సభ కొలువుదీరింది. ఈ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌ బోపయ్య సభ్యులతో ప్రమాణస్వీకార కార్యక్రమం చేపట్టారు. తొలుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య శాసనసభ్యునిగా ప్రమాణం చేశారు. యడ్యూరప్ప సర్కార్‌ బలనిరూపణ సాయంత్రం 4 గంటలకు జరగనుంది.

05/19/2018 - 13:44

పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను హుటాహుటిన ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్) ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బెయిల్‌పై ఇంటివద్ద ఉంటున్న ఆయనకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు. ఐజీఐఎంఎస్‌కి చెందిన ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

05/19/2018 - 13:35

బెంగుళూరు: కర్నాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనంద్ శర్మ, ప్రతాప్ గౌడ పాటిల్‌లు.. ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. వాళ్లు ఇంత వరకు అసెంబ్లీకి రాకపోవడంతో కాంగ్రెస్ వర్గంలో కొంత కలకలం నెలకొన్నది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ర బలపరీక్ష ఎదుర్కోనున్నారు.

05/19/2018 - 13:31

న్యూఢిల్లీ: ప్రోటెం స్పీకర్ బోపయ్యను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రోటెం స్పీకర్ బోపయ్య సమక్షంలోనే యడ్డీ బలపరీక్ష జరగనున్నది. బోపయ్యే తాత్కాలిక స్పీకర్‌గా కొనసాగుతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సభలో జరిగే బలపరీక్షను స్థానిక టీవీ ఛానళ్లలో లైవ్ చేయాలని కోర్టు ఆదేశించింది. మరో వైపు గాలి జనార్థన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి..

05/19/2018 - 04:19

పనాజీ/ ఇంఫాల్/ పాట్నా, మే 18: రసకందాయంలో పడిన కర్నాటక రాజకీయం సెగలు రేపుతుంటే, ప్రతిపక్షంలోవున్న సింగిల్ లార్జెస్ట్ పార్టీల కొత్త డిమాండ్లతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. కర్నాటక గవర్నర్ అనుసరించిన రాజ్యాంగ విధానానే్న ఆయా రాష్ట్రాల్లోనూ అమలు చేయాలన్న డిమాండ్‌తో గోవా, మణిపూర్, బీహార్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్, ఆర్జేడీలు గవర్నర్లకు లేఖలు ఇవ్వడం సరికొత్త అంకానికి తెరలేపినట్టయ్యింది.

Pages