S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/21/2018 - 02:03

న్యూఢిల్లీ, మే 20: ప్రపంచంలో ఆరో సంపన్న దేశంగా భారత్ అవతరించింది. కాగా యుఎస్ తన తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రపంచంలో సంపన్న దేశాలపై ఆఫ్రోఆసియా బ్యాంక్ ‘గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ’ పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 62,584 బిలియన్ యుఎస్ డాలర్లతో యుఎస్ ప్రపంచంలోనే సంపన్న దేశంగా అగ్రస్థానంలో నిలిచింది.

05/21/2018 - 00:30

బెంగళూరు, మే 20: కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు సాగుతున్నాయి. జేడీ(ఎస్) -కాంగ్రెస్ కూటమి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెండు వర్గాలూ విస్తృత చర్చల్లో తలమునకలై ఉన్నాయి. ఆదివారం ఇరువర్గాలు జరిపిన చర్చల్లో ఒక ఒప్పందానికి వచ్చినట్టు సమాచారం.

05/21/2018 - 00:27

న్యూఢిల్లీ, మే 20: భారత్ -రష్యాల మధ్య మరో శిఖరాగ్ర భేటీకి రంగం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నుంచి జరిపే రష్యా పర్యటన ఇరు దేశాలు మరింత చేరువ కావడానికి ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ పర్యటన దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

05/20/2018 - 03:09

చివరి క్షణం వరకూ ఉన్న ధీమా బలం లేకపోవడంతో నీరుగారింది. విశ్వాస పరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేసిన యెడ్యూరప్ప అసెంబ్లీనుంచి ఉద్వేగభరిత నిష్క్రమణ.

05/20/2018 - 02:58

న్యూఢిల్లీ, మే 18: అందినట్టే అందిన అధికారం చేజారడం అన్నది ఆశనీపాతమే! ముఖ్యంగా అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అనివార్య పరిస్థితుల్లో తప్పుకోవల్సి రావడం అన్నది ఏ నాయకుడిలోనైనా భావోద్వేగాలను రగిలిస్తుంది. ఇందుకు హోదాలతో నిమిత్తం లేదు. ఎంతటి నాయకుడైనా స్వాభావికంగా ఓ సాధారణ వ్యక్తే. భారత రాజకీయ చరిత్రలో ఎన్నో మలుపులు ఉన్నాయి..ఎన్నో చారిత్రక ఉదంతాలూ ఉన్నాయి.

05/20/2018 - 02:55

న్యూఢిల్లీ, మే 19: సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఏకే సిక్రీ శనివారం నవ్వులు పూయించారు. కర్నాటక రాజకీయ సంక్షోభం పరిసమాప్తం కావడంతో ఆయనో వ్యాఖ్య చేశారు. ‘ఇక మనం సెలవులు హాయిగా గడపవచ్చు’ అని జస్టిస్ సిక్రీ అన్నారు. ఆయనీ వ్యాఖ్యలు చేయగానే కోర్టు రూమ్‌లో ఉన్నవారంతా హాయిగానే నవ్వుకున్నారు. ఉత్కంఠ వాతావరణం కాస్తా తేలికపడింది.

05/20/2018 - 02:53

శ్రీనగర్, మే 19: దారితప్పిన యువత చేపట్టే ప్రతి రాయి, ఆయుధం కాశ్మీర్‌ను, దేశాన్ని ఆస్థిరపరుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. అస్థిరత్వ వాతావరణం నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రజలు తనవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రమజాన్ సందర్భంగా ఉగ్రవాద నిరోధక చర్యలకు తాత్కాలిక విరామం ప్రకటించిన నేపథ్యంలో, శనివారం ప్రధాని మోదీ కాశ్మీర్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు.

05/20/2018 - 02:51

న్యూఢిల్లీ, మే 19: భారతీయ జనతాపార్టీ (బీజేపీ) నాయకులు సుప్రీం కోర్టుపై మండిపడుతున్నారు. సుప్రీం కోర్టు వల్లే యెడ్యూరప్ప బలపరీక్ష నిరూపించుకోలేకపోయారని వారు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోలేకే శనివారం యెడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

05/20/2018 - 02:50

న్యూఢిల్లీ, మే 19: కర్నాటకలో బలనిరూపణకు ముందే బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పదవికి రాజీనామా చేయడం ప్రజాస్వామ్య విజయమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇది ప్రాంతీయ ఫ్రంట్ సాధించిన గెలుపని పేర్కొంటూ కాంగ్రెస్, జేడీఎస్ నాయకులను అభినందించారు.

05/20/2018 - 02:49

లెహ్, మే 19: జమ్మూకాశ్మీర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఒకరోజు పర్యటనకు వచ్చిన ఆయన 25 వేల కోట్లతో నిర్మిస్తున్న ఆసియాలోనే అతిపెద్దదైన జోజిలా సొరంగ మార్గానికి శంకుస్థాపన చేశారు. అనంతరం లెహ్‌లో జరిగిన కుషోక్ బాకులా రింపోచ్ 19వ జయంతి ఉత్సవ సభలో ఆయన మాట్లాడారు.

Pages