S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/21/2018 - 02:24

న్యూఢిల్లీ, మే 20: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2 బలియన్ డాలర్లకుపైగా కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పరారైన వ్యాపారవేత్త నీరవ్ మోదీ, అతని అంకుల్ చోక్సీలపై రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయడానికి సీబీఐ సిద్ధమవుతోంది. ఈ మేరకు సీబీఐ ఇంటర్‌పోల్‌ని ఆశ్రయించనుంది.

05/21/2018 - 02:22

గువహతి, మే 20: మోదీ ప్రభుత్వం మాత్రమే ఈ ప్రాంతానికి శాంతి, సుస్థిరతలను, అభివృద్ధికి దోహదం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకం వల్ల ఈ ప్రాంతం దారుణమైన వెనుకబాటుకు గురైందని ఆరోపించారు. బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్ వంటి పొరుగు దేశాలతో సత్సంబంధాలను నెరపడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య భారత ప్రాంతాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తారన్నారు.

05/21/2018 - 02:21

మొహాలి, మే 20: వాతావరణ మార్పు, నీటి కొరత వంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన పరిశోధనలు చేపట్టాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ శాస్తవ్రేత్తలు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. జాతి నిర్మాణంలో శాస్త్ర సాంకేతిక రంగాలదే కీలకపాత్ర అన్నారు. ఇక్కడ ఆదివారం నిర్వహించిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) స్నాతకోత్సవంలో పాల్గొని ఆయన ప్రసంగించారు.

05/21/2018 - 02:19

న్యూఢిల్లీ, మే 20: కర్నాటకలో అధికార పగ్గాలు బీజేపీకి దక్కకుండా చేయడంలో కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కావడంతో, బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ వల్ల తమకు ముప్పు ఉందని భావించే ప్రాంతీయ పార్టీలు, ఇది అంతం కాదు, ఆరంభం అనే రీతిలో బీజేపీకి గట్టి సందేశం ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరుతున్నాయి.

05/21/2018 - 02:18

న్యూఢిల్లీ, మే 20: కర్నాటక రాజకీయంలో తమ పాత్ర ముగిసిపోలేదన్న నమ్మకంతోనే ఉంది బీజేపీ. బలపరీక్షకు ముందే వెనకడుగు వేసినా, పదవుల కోసం కాంగ్రెస్- జేడీ(ఎస్) కూటమి కొట్లాటల మధ్య మళ్లీ తమ టైం రాకపోదన్న నమ్మకంతో కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా బీఎస్ యెడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర్నుంచీ మూడు రోజులపాటు సాగిన ఉత్కంఠ రాజకీయాలకు, బలపరీక్షకు బీజేపీ వెనకడుగు వేయడంతో తెరపడటం తెలిసిందే.

05/21/2018 - 02:17

లక్నో, మే 20: ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల ఫలితాలు దేశంలోని కొత్త రాజకీయ పొత్తులకు, కొత్త సమీకరణాలకు మార్గం చూపుతున్నాయి. ‘కలసి ఉంటే కలదు బీజేపీ పరాజయం’ అన్న కొత్త నానుడికి అంకురార్పణ చేసేలా వివిధ పార్టీలు అన్నీ ఏకతాటిపైకి రావడానికి ఇప్పటి నుంచే చర్చోపచర్చలు ప్రారంభించాయి. 2019 ఎన్నికల్లో బీజీపియేతర పార్టీలు ఏకమైతే ఆ పార్టీని మట్టికరిపించడం సులభమవుతుందన్న వ్యూహం తెరపైకి వచ్చింది.

05/21/2018 - 02:16

న్యూఢిల్లీ, మే 20: ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని విధించడం వల్ల పాలన స్తంభిస్తుందన్న వాదనలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఈ సమయంలో కేవలం కొత్త ప్రాజెక్టులు, కొత్త పథకాలు మాత్రమే ప్రకటించేందుకు ఎన్నికల కోడ్ అనుమతించదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం లా కమిషన్ ప్యానెల్‌కు స్పష్టం చేసింది.

05/21/2018 - 02:15

శ్రీనగర్, మే 20: కథువా కేసులో నిందితుడు ఎగ్జామ్ అటెండెన్స్ షీటులో చేసినట్టు చెబుతున్న సంతకంతో అతని సంతకం మ్యాచ్ కావడం లేదని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్‌స్ లేబరేటరీ తన రిపోర్టులో వెల్లడించింది.

05/21/2018 - 01:52

న్యూఢిల్లీ, మే 20: కర్నాటకలో దొడ్డిదారి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు బీజేపీ అనైతికంగా వ్యవహరించిందని, ఎమ్మెల్యేలకు డబ్బు ఎరచూపి ప్రలోభాలకు గురి చేసిందని, ఈ అంశాలపై విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేసింది. కర్నాటకలో బీజేపీ నిర్లజ్జగా వ్యవహరించిన తీరుపై ప్రధాని మోదీ స్పందించాలని ఎఐసీసీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ డిమాండ్ చేశారు.

05/21/2018 - 01:50

చెన్నై, మే 20: కర్నాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందని సూపర్ స్టార్ సినీనటుడు, రాజకీయ పార్టీ ఏర్పాటుకు సమాయత్తమవుతున్న రజనీకాంత్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ మెజార్టీని తెచ్చుకోవాలని, కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విశ్వాస పరీక్షలో విజయాన్ని నమోదు చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Pages