S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/02/2018 - 12:53

బెంగళూరు: బీజేపీకి చెందిన మాజీ మంత్రి హరతాళ్ హాలప్ప కాంగ్రెస్ ప్రవేశానికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఈమేరకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మి వచ్చేవారిని ఆహ్వానిస్తామని వెల్లడించారు. మైసూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హాలప్ప ఇప్పటి వరకు ఎవ్వరినీ సంప్రదించలేదని అన్నారు.

04/02/2018 - 13:22

న్యూఢిల్లీ: రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ భారత్ బంద్‌కు దేశవ్యాప్తంగా దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. బీహార్, పంజాబ్, ఒడిస్సా రాష్ట్రాల్లో దళిత సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టాయి. రైల్వేట్రాక్‌లపై ఆందోళనలతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పంజాబ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

04/02/2018 - 13:07

న్యూఢిల్లీ : పార్లమెంటు ఉభయసభల్లోనూ సోమవారం ఆందోళనలు కొనసాగాయి. రాజ్యసభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వారు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభ్యులకు చైర్మన్ వెంకయ్యనాయుడు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

04/02/2018 - 04:39

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక హోటల్ కుప్పకూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. అరవై ఏళ్ల నాటి ఈ హోటల్ భవనానికి చెందిన ఒక స్తంభాన్ని ఒక కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాగా శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా మృతుల సంఖ్య ఆదివారం నాడికి పదికి చేరింది. కాగా ఈ సంఘటనపై మెజిస్టీరియల్ విచారణకు జిల్లా అధికారులు ఆదేశించారు.

04/02/2018 - 01:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని కొన్ని నిబంధనలు సడలిస్తూ ఇటీవల అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని కేంద్రం ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ చట్టంలోని కొన్ని నిబంధనలను సడలిస్తూ ఇచ్చిన ఆదేశాల మూలంగా ఆ చట్టాన్ని నీరుగార్చే ప్రమాధం ఉందని సుప్రీం కోర్టుకు నివేదించేందుకు కేంద్రం చర్యలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.

04/02/2018 - 01:45

పూనె, ఏప్రిల్ 1: దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని తరచూ వల్లించే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇప్పుడు కాస్త స్వరం మార్చారు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ వంటివి రాజకీయ నినాదాలని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరిభాషలో ఇలాంటివి లేవని మోహన్ భగవత్ అన్నారు.

04/02/2018 - 01:43

ట్యుటికోర్న్/చైన్నై ఎప్రిల్ 1: ట్యుటికోర్న్ సమీపంలో వేదాంత నెలకొల్పుతున్న స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌ను మూసివేయాలని కోరుతున్న ఆందోళనకారులకు తమిళ నటుడు, మక్కల్ నీతి మయ్యమ్ అధినేత కమల్ హసన్ మద్దతు పలికారు. ‘కాపర్ ప్లాంట్ విస్తరణ పనులను అనుమతించరాదు, అవసరమైతే ఈ ప్లాంట్‌ను మూసేయడం ఉత్తమం’ అని ఆయన స్పష్టం చేశారు.

04/02/2018 - 01:41

న్యూఢిల్లీ, ఏప్రిల్1: రాజకీయాల్లో కొన్ని పరిణామాలు ఆసక్తిని రేపుతాయి. కొన్నిసార్లు ఆశ్చర్యాన్నీ కలిగిస్తాయి. 1978లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పుడు తన పార్టీ గుర్తుగా ‘హస్తం’ ను ఇందిరాగాంధీ ఎంచుకున్నారు. అప్పుడు ఏనుగు, సైకిల్ గుర్తులను ఎంచుకునే అవకాశం ఉన్నా ఇందిర ఇష్టపడలేదు.

04/02/2018 - 01:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దేశంలో కోట్లాది ఉద్యోగాలు సృష్టించామనీ, అభివృద్ధినీ పరుగులు పెట్టిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్‌డీఏ సర్కార్ చేస్తున్న ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో తిరగబడింది. దేశంలో 200 కోట్ల ఉద్యోగాలు వచ్చాయనీ, అలాగే గ్రహాంతర జీవులూ భారత్ కోసం పనిచేస్తున్నాయంటూ మోదీ ప్రచారంలోని పసలేనితనాన్ని కాంగ్రెస్ ఏప్రిల్ ఫూల్ దినోత్సవం సందర్భంగా ఎండగట్టింది.

04/02/2018 - 01:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: భారీ ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి లావాదేవీల నిర్వహణకు ఆధార్ వివరాలు తప్పనిసరి చేసిన దగ్గర్నుంచీ అధికారుల అవినీతి ఖజానా గుట్టును సమర్థంగా గుర్తించగలుగుతున్నామని కేంద్ర నిఘా విభాగం వెల్లడించింది.

Pages