S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/03/2018 - 04:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని బలహీనపరుస్తూ సుప్రీం ఇచ్చిన ఉత్తర్వుపై దళిత సంఘాలు తలపెట్టిన ఆందోళనలను కేంద్రం సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే భారీ ఆస్తి నష్టం, ప్రాణనష్టం సంభవించిందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిగిన పరిణామాలకు కేంద్రం బాధ్యత వహించక తప్పదని కాంగ్రెస్ హెచ్చరించింది.

04/03/2018 - 03:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంపై వైకాపా, తెలుగుదేశం, కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం తదితర ఎనిమిది పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం సోమవారం తొమ్మిదో రోజు కూడా చర్చకు రాలేకపోయింది. లోక్‌సభ సోమవారం ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు.

04/03/2018 - 04:17

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై వంద మంది సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ బీజేపీ చర్చనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఆరోపించారు. సోమవారం పార్లమెంట్ వాయిదా పడిన తరువాత ఆ పార్టీ ఎంపీలు విలేఖరులతో మాట్లాడారు.

04/03/2018 - 03:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశం విడిచి పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ మాల్యా నుండి రూ.150కోట్లు రాజకీయ విరాళంగా తీసుకున్నారని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. సోమవారం విజయ్ చౌక్ వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బ్యాంకులకు 9వేల కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టిన విజయమాల్యా 2016 మార్చి 1న రాజ్యసభలో ఉన్నారు..

04/03/2018 - 03:16

భారత్‌లో తీవ్ర ఆహార కొరత
రెండింతలు కానున్న గంగా ప్రవాహం
వరదల ముప్పుతో వ్యవసాయానికి చేటు
అమెజాన్ నదీ ప్రభావంలో 25 శాతం క్షీణత
తాజా పరిశోధనలో వెల్లడి

04/03/2018 - 02:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ప్రధాని నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌తో సమావేశంకానున్నారు. పార్లమెంటు ఆవరణలోని గులాంనబీ ఆజాద్ కార్యాలయంలో ఉదయం 11.15 గంటలకు చంద్రబాబు భేటీ అవుతారు.

04/03/2018 - 02:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని నీరుగార్చేలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఆరోపిస్తూ దళిత సంఘాలు సోమవారం చేపట్టిన భారత్ బంద్ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పోలీసుల మధ్య ఘర్షణలు, రైళ్ల రాకపోకలను అడ్డుకోవడం, పలు వాహనాల ధ్వంసంవంటి సంఘటనలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఉత్తరాదిలోని దాదాపు ఏడు రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.

04/03/2018 - 01:39

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై గతంలో ఇచ్చిన తీర్పును తక్షణ పునర్విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు రూలింగ్‌పై సోమవారం వివిధ దళిత సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకరూపం దాల్చి పదిమంది వరకూ మరణించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా ఎస్సీ, ఎస్టీ చట్టం పూర్వస్థితిని కొనసాగించాలని కోరుతూ కేంద్రం సోమవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

04/03/2018 - 01:38

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ప్రధాని నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌తో సమావేశంకానున్నారు. పార్లమెంటు ఆవరణలోని గులాంనబీ ఆజాద్ కార్యాలయంలో ఉదయం 11.15 గంటలకు చంద్రబాబు భేటీ అవుతారు.

04/03/2018 - 01:31

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాల అమలు, విభజన సమయంలో తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల అమలుపై కేంద్రం తన వైఖరి చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ సోమవారం సుప్రీకోర్టులో విచారణకు వచ్చింది.

Pages