S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/31/2018 - 03:51

న్యూఢిల్లీ, మార్చి 30: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విసురుతున్న సెటైర్లు తూటాల్లా పేలుతూనే ఉన్నాయి. తాజాగా సీబీఎస్‌ఇ పరీక్ష పేపర్ల లీకులపై ఆయన వాగ్బాణాలు సంధించారు.

03/31/2018 - 03:48

న్యూఢిల్లీ, మార్చి 30: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, జస్టిస్ చలమేశ్వర్ రాసిన లేఖ నేపథ్యంలో లాయర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థలోకి చొరబడుతున్న కార్యనిర్వాహక వ్యవస్థ విషయంలో పూర్తి కోర్టును ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ చలమేశ్వర్, ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు లేఖ రాశారు.

03/31/2018 - 04:52

న్యూఢిల్లీ, మార్చి 30: తూర్పు ఆఫ్రికా అభివృద్ధికి కచ్చీ పటేల్ వర్గం ప్రజల పాత్రను ప్రధా ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. విదేశాల్లో నివసించే భారతీయులు మన దేశానికి శాశ్వత రా యబారులున్నారు. నైరోబీ, కెన్యాల్లోని ‘శ్రీ కచ్చీ లెవా పటేల్ సమాజ్’ ప్రజల రజతోత్సవాలను పురస్కరించుకొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడివారినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.

03/31/2018 - 02:44

న్యూఢిల్లీ, మార్చి 30: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఎకనామిక్స్ పేపర్‌కు సంబంధించి పరీక్షను ఏప్రిల్ 25న నిర్వహించనున్నారు. ఇక 10వ తరగతి గణితశాస్త్ర పేపర్‌కు సంబంధించిన పరీక్షను అవసరమైన పక్షంలో ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్, హర్యానా ప్రాంతాల్లో మాత్రమే జూలై నెలలో నిర్వహిస్తారు. పేపర్ల లీకేజీపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పై ప్రకటనను విడుదల చేసింది.

03/31/2018 - 02:36

న్యూఢిల్లీ, మార్చి 30: తమకు కీలక పాత్ర కల్పించని తృతీయ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు దూరంగా ఉండాలని కాగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.

03/30/2018 - 16:39

భూపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం పదవీ విరమణ వయసును పెంచింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచింది. ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రిటైర్మెంట్ వయసును పెంచుతున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.

03/30/2018 - 16:26

న్యూఢిల్లీ: కావేరీ జలాల సమస్యపై ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్ష చేయనున్నట్టు తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే ప్రకటించింది. దివంగత సీఎం జయలలిత జయంతి సందర్భంగా మధురైలో 120 జంటలకు ఒకే వేదిక వద్ద జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ..

03/30/2018 - 15:56

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్ష పేపర్ల లీకేజీ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్నే లేపుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టారు. రాజకీయంగాను కేంద్రంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇంటిదగ్గర భద్రత పెంచారు. 144 సెక్షన్ విధించారు.

03/30/2018 - 15:54

నవాడా : బిహార్‌లోని నవాడాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దుండగులు శుక్రవారం ఆంజనేయుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి, అపచారం చేశారు.
భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘర్షణకు దిగినవారిని చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

03/30/2018 - 15:50

నేపిటా : మయన్మార్‌ నూతన అధ్యక్షుడిగా విన్ మియింట్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఈ కార్యక్రమం జరిగింది. మయన్మార్‌కు, ఆ దేశ ప్రజలకు విధేయత తెలుపుతూ విన్ మియింట్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు ఉపాద్యక్షులుగా మియింట్ స్వే, హెన్రీ వాన్ టియో ప్రమాణ స్వీకారం చేశారు.

Pages