S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/03/2018 - 03:27

న్యూఢిల్లీ, జనవరి 2: క్లినికల్ ట్రయల్స్‌లో తరచూ ఎదురయ్యే మరణాలు, ప్రతిబంధకాలను ధీటుగా ఎదుర్కొని ఉత్తమమైన, బలమైన వ్యవస్థను రూపొందించనున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు.

01/03/2018 - 03:26

తంజావూర్, జనవరి 2: ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం పెరుగుతోందంటూ డిఎంకె కార్యకర్తలు మంగళవారం ఇక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నల్లజెండాలు ప్రదర్శించి నినాదాలు చేశారు. స్వచ్ఛ్భారత్ అమలుపై సమీక్ష జరిపేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ తంజావూర్ వచ్చారు. ఇలాంటి సమీక్షా సమావేశాలు జరపడం ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని డిఎంకె ధ్వజమెత్తింది.

01/03/2018 - 03:25

చిత్రం..ప్రధాని నరేంద్ర మోదీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న
పిఎంఓ అధికారులు, ఎస్‌పీజీ సిబ్బంది

01/03/2018 - 03:24

న్యూఢిల్లీ, జనవరి 2: బధిర బాలిక అత్యాచార బాధితురాలికి 15 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఏకకాలంలోనే చెల్లించాలని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఈ బాలిక అత్యాచార కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరిస్తూ ఆదేశాలు జారీచేసింది. అత్యాచారానికి గురైన ఈ బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

01/03/2018 - 03:23

న్యూఢిల్లీ, జనవరి 2: రాజ్యసభలో మంగళవారం అరుదైన రికార్డు ఆవిష్కృతమైంది. పెద్దల సభ జీరో అవర్ అజెండాలో పొందుపరిచిన అంశాలతోపాటు ప్రత్యేక ప్రస్తావనలను రికార్డుస్థాయిలో పూర్తిచేసి చరిత్ర సృష్టించింది. మొదటిసారిగా సభలో జీరో అవర్‌లో సభ్యులు లేవనెత్తిన అంశాలను, సభ్యుల ప్రత్యేక ప్రస్తావనలను పూర్తి చేసినట్టు రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు వెల్లడించారు.

01/03/2018 - 03:23

జమ్మూ, జనవరి 2: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. గత ఏడాది 81 లక్షల 78వేలమంది భక్తులు ఆలయాన్ని సందర్శించారని, 2016తో పోలిస్తే 4 లక్షల 54వేలమంది యాత్రికులు పెరిగారని అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

01/03/2018 - 03:22

న్యూఢిల్లీ, జనవరి 2: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో రెండేళ్ల విరామం తరువాత ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, బీఎస్‌ఎఫ్‌లు పాల్గొంటున్నాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ), సహస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) రెండేళ్ల తరువాత పరేడ్‌కు వస్తున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ పోర్స్ (బీఎస్‌ఎఫ్) ఏడాది విరామం తరువాత గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

01/03/2018 - 03:00

న్యూఢిల్లీ, జనవరి 2: దేశ రెండో రాజధానిగా ఏర్పాటుకు ఎటువంటి ప్రణాళిక లేదని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మంగళవారం టీఆర్‌ఎస్ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ దక్షిణ భారతదేశంలో రెండో రాజధానిగా హైదరాబాద్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా అని లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
కాపు రిజర్వేషన్ల బిల్లు ఇంకా చేరలేదు: కేంద్రం

01/03/2018 - 03:32

న్యూఢిల్లీ, జనవరి 2: అమరావతి రాజధాని నగరాభివృద్ధి ప్రాజెక్టుకు ఏపీ కోరిన రుణ దరఖాస్తు ప్రపంచ బ్యాంకు వద్ద పరిశీలనలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. రూ.3,324 కోట్లు రుణం కోరతూ ఆంధ్ర ప్రభుత్వం ప్రపంచబ్యాంకుకు దరఖాస్తు సమర్పించిందని జైట్లీ వివరించారు.

01/03/2018 - 01:50

న్యూఢిల్లీ, జనవరి 2: ఎన్నికల వ్యయ ప్రక్షాళనకు సంబంధించి కేంద్రం మంగళవారం కీలక ప్రక్రియను తెరపైకి తెచ్చింది. ఈ ప్రక్షాళనలో భాగంగా ఎన్నికల బాండ్లను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. వీటివల్ల రుణదాతల పేరు బయటకు వచ్చే అవకాశం ఉండదు. బ్యాంకులను మధ్యవర్తులుగా చేసి రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చేందుకు ఈ బాండ్లు దోహదం చేస్తాయి.

Pages