S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/08/2017 - 01:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్‌పై ఆ పార్టీ ఆగమేఘాలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. గుజరాత్ అసెం బ్లీ ఎన్నికలకు మరో రెండు రోజుల్లో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించి అయ్యర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.

12/08/2017 - 00:33

విశాఖపట్నం, డిసెంబర్ 7: పరిశోధనల ద్వారానే రక్షణ రంగం బలోపేతం అవుతుందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో డిఫెన్స్ స్టడీస్ సెంటర్‌ను రాష్టప్రతి గురువారం ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. దేశం ఏ ప్రాంతంలో పనిచేస్తున్న డిఫెన్స్, మిలటరీ రంగాల్లో పనిచేస్తున్న అధికారులు ఈ యూనివర్శిటీలో కోర్సులు అభ్యసించడానికి, అలాగే పరిశోధనలు చేయడానికి వీలు కల్పించారు.

12/07/2017 - 00:01

వివాదాన్ని త్వరగా ముగించాలి
అదే.. దేశానికీ మంచిది
తీర్పు ఏదైనా శిరసావహిస్తాం
స్పష్టం చేసిన హజీ మహబూబ్
సిబల్ వాదనపై సున్ని ఆగ్రహం
ఇరకాటంలో పడిన కాంగ్రెస్
తెరవెనుక కథ నడుపుతున్న ఎన్డీయే?
2018 నాటికి ముగించే యోచన

12/06/2017 - 23:42

ధండూక (గుజరాత్), డిసెంబర్ 6: 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలతో అయోధ్య వివాదాన్ని ముడి పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆయన బుధవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసుపై సుప్రీం కోర్టులో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వాదన సరికాదని మండిపడ్డారు.

12/06/2017 - 23:42

హైదరాబాద్, డిసెంబర్ 6: హైదరాబాద్ పాతబస్తీలో బ్లాక్ డే ప్రశాంతంగా ముగిసింది. బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ డిజెఎస్, ఎంబిటి పాతబస్తీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు పాతబస్తీలో బుధవారం డిజెఎస్, ఎంబిటి కార్యకర్తలు దుకాణాలను బలవంతంగా మూయించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పలువురు ముస్లిం సంస్థలకు చెందిన కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

12/06/2017 - 23:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్‌కు జాతి ఘన నివాళులర్పించింది. అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అంబేద్కర్ దేశానికి, ముఖ్యంగా దళితుల ఉద్ధరణకు ఎనలేని కృషి చేశారని పలువురు శ్లాఘించారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు అంబేద్కర్ సేవలను కొనియాడారు.

12/06/2017 - 23:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంతే వేగంగా స్పందించారు. దేశంలో అధిక ధరలను కోడ్ చేస్తూ రాహుల్ తన ట్విట్టర్‌లో కేంద్రంపై విమర్శలు చేశారు. 2014-2017 మధ్య పెరిగిన ధరల వ్యత్యాసాన్ని ట్విట్టర్‌లో ఎత్తిచూపిన రాహుల్ పెరుగుదల శాతం చూపడంలో మాత్రం తప్పుదొర్లింది. దీనిపై బీజేపీ శ్రేణులు, నెటిజన్లు మండిపడ్డారు.

12/06/2017 - 23:34

శ్రీనగర్, డిసెంబర్ 6: ఆర్మీ జవాను ఇర్ఫాన్ దర్ హత్యకేసును ఛేదించి, ఓ మిలిటెంట్‌ను అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు బుధవారం ప్రకటించారు. జవాను ఇర్ఫాన్‌ను గత నెలలో మిలిటెంట్లు హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి, షోపియాన్ జిల్లా షిర్మల్‌కు చెందిన ముజామిల్ అనే మిలిటెంట్‌ను అరెస్టు చేశారు.

12/06/2017 - 23:34

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: జెడి(యు) రెబెల్ ఎంపీలు శరద్ యాదవ్, అనిల్ అన్వర్లను అనర్హులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తన ఉత్తర్వు నిర్ణయాన్ని విమర్శించటం ఎంతమాత్రం సహేతుకం కాదని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఖండించారు. న్యాయాన్ని ఆలస్యం చేయడం అంటే ఖండించడమేనని, ఇలాంటి వ్యవహారాల్లో ఉపేక్ష ఎంతమాత్రం సమ్మతం కాదన్నారు.

12/06/2017 - 23:33

జైపూర్, డిసెంబర్ 6: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబాకు చెందిన ఎనిమిది మంది ఉగ్రవాదులకు రాజస్థాన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. శిక్షపడ్డవారిలో ముగ్గురు పాకిస్తాన్ జాతీయులున్నారు. ఎనిమిది మంది ఉగ్రవాదులను 2010-11లో రాజస్థాన్ యాంటీ టెర్రరిస్టు పోలీసులు అరెస్టు చేశారు. ఆరేళ్లపాటు విచారణ తరువాత బుధవారం వారందరికీ శిక్ష వేస్తూ కోర్టు తీర్పును వెలువరించింది.

Pages